/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Ts BJP: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. Yadagiri Goud
Ts BJP: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు..

హైదరాబాద్: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీకి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరుపై ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు..

పార్టీ కార్యాలయంలో బైఠాయించి ఎంపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అర్వింద్‌ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు.

సొంత పార్టీ కార్యకర్తలకు ఎంపీ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చిన మండలాల అధ్యక్షులను తిరిగి నియమించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అక్కడున్న పార్టీ నేతలు చెప్పినా వినిపించుకోని కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డే తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేశారు. చివరకు కిషన్‌రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు..

Bhadrachalam: గోదావరికి పోటెత్తిన వరద.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు..

దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భద్రాచలం వద్ద గోదావరి నుంచి 9,92,794 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.

SB NEWS

SB NEWS

Manipur : మణిపుర్‌లో మళ్లీ అల్లరిమూకల విధ్వంసం.. ఇళ్లు, బస్సులకు నిప్పు

ఇంఫాల్‌ : మణిపుర్‌లో (Manipur) అల్లరి మూకల విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మోరే జిల్లాలోని మోరే బజార్‌ ప్రాంతంలో కొందరు దుండగులు పలు ఇళ్లకు ఇవాళ నిప్పు పెట్టారు..

అయితే ఆ ఇళ్లలో ఎవరూ నివాసం ఉండట్లేదని తెలిసింది. ఈ ప్రదేశం మయన్మార్‌ (Myanmar) సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు రవాణా కోసం వినియోగించే రెండు బస్సులను సైతం ఇలాగే ముష్కరులు తగులబెట్టారు. సపోర్మీనా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

మణిపుర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ బస్సులు దిమాపుర్‌ వైపు నుంచి వస్తుండగా.. స్థానికులు వాటిని అడ్డుకున్నారు. బస్సుల్లోకి ఎక్కి ఇతర తెగ ప్రజలెవరైనా అందులో ఉన్నారా అని సోదాలు చేశారు. ఆ తరువాత వాటిని దహనం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు..

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో దాదాపు మూడు నెలల క్రితం మైతేయ్‌, కుకీ జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్ఠంలా రగులుతోంది. వివిధ అల్లర్లలో సుమారు 160 మంది చనిపోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మొబైల్ రీఛార్జ్, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర ఆన్‌లైన్ సేవలతోపాటు ఆఫీసులు, వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవారిపై ఇంటర్నెట్‌ నిషేధం ప్రభావం చూపుతోన్న కారణంగా కొన్ని షరతులతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను హోంశాఖ మంగళవారం నుంచి పునరుద్ధరించింది..

నాడు మోదీ చెప్పిన జోస్యమే ; నిజమైందా ❓️

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై బుధవారంనాడు ఒకేసారి రెండు అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడం విశేషమైతే, 2019లో మోదీ చెప్పిన జోస్యమే నిజమైందని అధికార బీజేపీ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించింది.

దీంతో మోదీ ఐదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది...

అది 2019 ఫిబ్రవరి 7వ తేదీ. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, విపక్ష పార్టీలు 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేసుకోవచ్చునని అన్నారు. ఏడాది క్రితమే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తమ ప్రభుత్వం ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

''2023లో మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చే అవకాశం మీకు వస్తుంది. మీకు నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను'' అని మోదీ లోక్‌సభలో అనగానే, అధికార సభ్యులు నవ్వులు చిందిస్తూ గట్టిగా బల్లలు చరిచారు. సమర్పణ భావం సేవాభావం తో ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి అధికార హోదా వచ్చామని, అహంకార భావంతో 400 మంది ఎంపీలున్న వారు 40

మంది సభ్యులకు కుదించుకుపోయారని పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి చురకలు వేశారు. మోదీ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతలతో సహా సోనియాగాంధీ కూడా సభలోనే ఉన్నారు.

2018లో అవిశ్వాస తీర్మానం...

మోదీ సర్కార్‌పై 2018లో ఎన్.చంద్రబాబునాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పలు విపక్ష పార్టీలు ఈ తీర్మానాన్ని బలపరచాయి.

కాగా, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. 26 పార్టీల కూటమి ఇండియా లోని బీఆర్ఎస్ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2019లోనే మోదీ ఈ అవిశ్వాస తీర్మానంపై జోస్యం చెప్పారంటూ ప్రభుత్వ వర్గాలు అలనాటి వీడియోను షేర్ చేశాయి....

అవసరమైతే తప్ప బయటకు రావద్దు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు వెల్లువెత్తుతున్న వరదలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది.

నేడు బుధవారం కూడా అతిభారీ వర్షాల ముప్పు పొంచివుండడంతో జీహె చ్ఎంసీ కీలక సూచన చేసింది. సాయంత్రం వరకు బయటకు రావొద్దని హైదరాబాదీలను హెచ్చరించింది.

నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతిభారీ వర్షాలు, గాలులతో చెట్లు కూలడం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినే అవకాశం సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది.

కాగా హైదరాబాద్‌కు భారీ ముప్పు పొంచివుందని ఐఎండీ హైదరాబాద్ విభాగం హెచ్చరించింది. గంటలో 3-5 సెం.మీ నుంచి 5-10 సెం.మీ వాన కురిసే అవకాశం అప్రమత్తం చేసింది.

మరోవైపు హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలను కూడా భారీ వానలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.....

No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్‌, భారాస..

దిల్లీ: మణిపుర్‌ అంశం (Manipur)పై పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి 'ఇండియా (India)'..

కేంద్ర ప్రభుత్వంపై 'అవిశ్వాస తీర్మాన (No Confidence Motion)' అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్‌సభ (Lok sabha)లో కాంగ్రెస్‌ (Congress) డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ వెల్లడించారు. అటు భారాస ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌ కార్యాలయానికి కాంగ్రెస్‌, భారాస నోటీసులిచ్చింది..

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే (NDA) కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు.

దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్‌ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది..

Vijayawada: ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రి: విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి.

దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ఆ మార్గంలో టోల్‌గేట్‌ను మూసివేశారు..

భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు.

ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..

త్వరలో హైదరాబాద్ లో మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్స‌వం

నాంపల్లి చాపల్‌ రోడ్డులో పాత ప్రెస్‌ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధ మైందని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం భవన నిర్మాణ పనులను పర్య వేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌, అశోక్‌ రెడ్డి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు.

వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్‌ భవనంలా నిర్మించారన్నారు. భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారని, ముఖ్య మంత్రి కేసీఆర్‌ కర్త, కర్మ, క్రియగా ఈ భవనం రూపు దిద్దుకుందన్నారు.

భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్‌, తది తరులకు ప్రత్యేక గదులు నిర్మించారని వివరించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారన్నారు.

భవనం పనులన్నీ తుదిదశ కు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను కోరారు. కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందన్నారు......

ఇవాళ తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి :జులై 26

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ సాధారణగా ఉంది. నేడు శ్రీ వారి దర్శనానికి వెళ్లే వారికి స్వామి వారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం 73,137 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణలో "దూకుడు" పెంచిన బీజేపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు చేసింది. పోల్ వార్ రూం ఇంచార్జ్‌గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగు ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్టార్టజీ టీంను ఏర్పాటు చేసింది. మీడియా స్టార్టజీ టీం ఇంచార్జ్‌గా జాతీయ నేత శ్వేతను నియమించగా.. ఎంపీ ధర్మపురి అర్వింద్, యోగానందకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.

అలాగే పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, చింతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల‌ కోసం ప్రత్యేకంగా 22 కమిటీలను ఏర్పాటు చేశారు.

ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ ఉండేలా కార్యచరణ రూపొందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి......