/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz గోదావరిఖనిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు? Yadagiri Goud
గోదావరిఖనిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు?

గోదావరిఖని ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న

గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ (46) తో పాటు అతని కూతురు ఖతిజా (19) ను అదుపులోకి తీసుకున్నారు. జావిద్ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పర్వదినం కోసం తండ్రి కూతుర్లు గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం.

అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు, వీరి ప్రమేయం ఎంత మేర అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది. అనుమానితులగా మాత్రమే తీసుకెల్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకి దొరకబట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది....

మళ్లీ టమాటా మంట, సెంచరీ దాటిన పచ్చిమిర్చి

టమాటా రేటు మరోసారి మండిపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120 కి పైగా ధర పలుకుతోంది. ఇవి హోల్ సేల్ మార్కెట్ ధరలు కాగా.. రిటైల్‌గా అమ్మే అంగళ్ళలో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ధరలు పెరగడంతో టమాటా, పచ్చిమిర్చిలను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.

ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగానే పంట దిగుబడులు తగ్గి టమాటా, పచ్చి మిర్చి ధరలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా మామూలుగా జూన్ ఆరంభంలో వర్షాలు కురిసేవి. అయితే ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆల‌స్యం కారణంగా పంటల దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈసారి టమాటా దిగుబడి బాగా తగ్గింది. ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ అయిన మదనపల్లెకు చాలా తక్కువగా టమాటాలు వస్తున్నాయి. దీంతో టమాటాల కొనుగోలుకు వ్యాపారులు పోటీపడుతుండటంతో ధరలు పెరిగాయి.

ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా, పచ్చిమిర్చి కొంతమేర సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ కారణాల వల్ల కూడా టమాటా, పచ్చిమిర్చితో పాటు ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్లలోకి తాజా పంట వస్తేనే ధరల మంట నుంచి ఉపశమనం కలుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

మరో 150 బస్‌ స్టేషన్లను ఆధునీకరిస్తాం

•రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌

గత ఆర్ధిక సంవత్సరంలో వంద బస్‌ స్టేషన్‌లను ఆధునీకరించామని, ఈ యేడాదిలో మరో 150 బస్‌ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు.

మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ఎంజీబీఎ్‌సను సందర్శించి ప్రయాణికుల వసతి సౌకర్యాలను పరిశీలించారు. భద్రాచలం వైపునకు వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి పువ్వాడ విలేకరులతో మాట్లాడుతూ అనేక సమస్యలను అధిగమించి ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలతో ప్రజలకు చేరువైందని అన్నారు.

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ఇప్పటి వరకు 7 డీఏలను ప్రకటించామని, దీంతో వారి వేతనాలు 35 శాతం వరకు పెరిగాయన్నారు. వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. రెండేళ్లుగా సంస్థను ప్రజలు ఆశించిన స్థాయిలో ఆదరించడంతో రాబడి పెరుగుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఏపీలోని శ్రీశైలానికి టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో మంత్రి పువ్వాడ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు...

నాలుగేళ్లు సహజీవనం తర్వాత వదిలేశాడు

నాలుగేళ్లు సహజీవనం చేసిన తర్వాత ప్రియురాలిని వదిలేశాడు ఓ ప్రేమికుడు. దాంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే...

ఖమ్మం జిల్లా కల్లూరు అంబేడ్కర్ నగర్ కు చెందిన కోటా విజయ, ఉబ్బన నాగేంద్ర బాబు అనే ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కోటా విజయను రహస్యంగా తాళి కట్టి భార్య గా చేసుకున్నాడు.

నాలుగేళ్లు సహజీవనం చేశాక విజయను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియురాలు తన ప్రియుడు ఉబ్బాన నాగేంద్ర బాబు ఇంటి ముందు నిన్న సాయంత్రం నుంచి మౌన పోరాటం చేస్తుంది. తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా సహజీవనం చేశాక పెళ్లి కి నిరాకరించిన నాగేంద్ర బాబుతో తనకు వివాహం జరిగేంత వరకు ఇంటి ముందు దీక్ష చేస్తూనే ఉంటానని పేర్కొంటుంది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది...

నేడు పార్వతిపురంలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో పర్యటిస్తున్నారు. సందర్భంగా ఏర్పాట్లను జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షణ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమ్మఒడి నాలుగో విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం కురుపాంలో ప్రారంభించనున్నారు. మొదటిసారి సిఎం జగన్మోహనరేడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.

ముఖ్యమంత్రి హౌదాలో మొట్టమొదటిసారిగా జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లాకు వస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వాహనాల పార్కింగ్‌ లాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం కురుపాం లో ప్రారంభించడం ఇక్కడ ప్రజలు తమ అదృష్టంగా భావిస్తున్నారని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు...

నేడు ఎంసెట్ కౌన్సిలింగ్

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది.

ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన వారికి వచ్చే 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని జేఎన్‌టీయూ అడ్మిషన్స్‌ విభాగం అధికారులు తెలిపారు.

ఈ ప్రక్రియ కోసం నగరంలో ఏడు హెల్ప్‌ లైన్‌లను సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ, బాగ్‌లింగంపల్లిలోని బీఆర్‌ అంబేద్కర్‌ కాలేజీ, రామాంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌, మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభు త్వ పాలిటెక్నిక్‌, జూపార్క్‌ సమీపంలోని కులీకుతుబ్‌ పాలిటెక్నిక్‌, మా రేడ్‌పల్లిలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌, గోల్కొండ హోటల్‌ వెనుక ఉన్న యూనివర్సిటీ సైన్స్‌కళాశాలలో ఈ హెల్ప్‌లైన్‌ కేంద్రాలున్నాయి....

కేసీఆర్ డ్రామాలు వద్దు.. శివసేన ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్

కేసీఆర్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డ్రామాలు ఇలాగే కొనసాగితే ఆయన తెలంగాణను కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఉండబోదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారని విమర్శించారు.

ఆయన మహారాష్ట్రలో ప్రర్యటిస్తుండగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తోందన్నారు. ఎంవీఏ కూటమి బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ వ్యూహాలపై జాతీయ పార్టీల నజర్:

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ రాజకీయ వ్యూహలను జాతీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తుంటే కేసీఆర్ మాత్రం మహారాష్ట్రను టార్గెట్ చేయడం వెనుక ఆయన అసలు టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు పెంచడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన యూబీటీ లు స్వరం పెంచాయి....

హైదరాబాద్‌లో భారీ వర్షం

నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం సాయంత్రం నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, శామీర్ పేట్, నిజాంపేట,

బాచుపల్లి, కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పలుచోట్ల వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు ముగిసే వేళ వర్షం కురియడంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు....

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

సోలాపూర్ :జూన్ 27

మహారాష్ట్ర టూర్‌లో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలకు బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. తాము ఎవరికి ఏ టీమ్, బీ టీమ్ కాదని మాది రైతులు, కార్మికులు, పేదల టీమ్ అని అన్నారు. చిన్న పార్టీని చూసుకుని జాతీయ పార్టీలు ఎందుకు జడుసుకుంటున్నాయని విమర్శించారు.

బీఆర్ఎస్ అంటే భారత్ పరివర్తన్ పార్టీ అని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బీఆర్ఎస్ మహారాష్ట్రలో పోటీ చేస్తుందని అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం సోలాపూర్ జిల్లాలోని సర్కోలి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్‌ బాల్కే‌తో పాటు పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు కావడం లేదన్నారు. మహారాష్ట్రలో పోటీ చేస్తామంటే ఎందుకు భయం అని ప్రశ్నించారు.

రైతులంతా సంఘటితమై పోరాటం చేస్తే తప్పా రైతు సమస్యలు పరిష్కారం కావన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్నేళ్లు పరిపాలించి ఎందుకు పని చేయలేకపోయాయని నిలదీశారు. తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, తెలంగాణలో సాధ్యమైన అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు కావడం లేదన్నారు. పార్టీలో చేరిన భగీరథ్ బాల్కే ఎమ్మెల్యే అవుతారని ఆయన గెలిచాక మంత్రిగా కూడా అవుతారన్నారు...

Narendra Modi: కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటేయండి: మోదీ..

భోపాల్: కేసీఆర్‌ (KCR) కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటువేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం భాజపాకు ఓటు వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని భోపాల్‌లో నిర్వహించిన 'మేరా బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌ (Mera Booth Sabse Majboot)' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా.. ఇటీవలి విపక్షాల భేటీపై ధ్వజమెత్తారు.

'అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా' అని వ్యాఖ్యానించారు. భాజపాకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దది' అని ప్రధాని మోదీ అన్నారు..