మరో 150 బస్ స్టేషన్లను ఆధునీకరిస్తాం
•రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
గత ఆర్ధిక సంవత్సరంలో వంద బస్ స్టేషన్‌లను ఆధునీకరించామని, ఈ యేడాదిలో మరో 150 బస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందించామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
మంగళవారం సాయంత్రం ఆయన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి ఎంజీబీఎ్‌సను సందర్శించి ప్రయాణికుల వసతి సౌకర్యాలను పరిశీలించారు. భద్రాచలం వైపునకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి పువ్వాడ విలేకరులతో మాట్లాడుతూ అనేక సమస్యలను అధిగమించి ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలతో ప్రజలకు చేరువైందని అన్నారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామని, ఇప్పటి వరకు 7 డీఏలను ప్రకటించామని, దీంతో వారి వేతనాలు 35 శాతం వరకు పెరిగాయన్నారు. వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా సంస్థను ప్రజలు ఆశించిన స్థాయిలో ఆదరించడంతో రాబడి పెరుగుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఏపీలోని శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలో మంత్రి పువ్వాడ మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు...
Jun 28 2023, 09:16