నాలుగేళ్లు సహజీవనం తర్వాత వదిలేశాడు
నాలుగేళ్లు సహజీవనం చేసిన తర్వాత ప్రియురాలిని వదిలేశాడు ఓ ప్రేమికుడు. దాంతో బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. వివరాల్లోకి వెళితే...
ఖమ్మం జిల్లా కల్లూరు అంబేడ్కర్ నగర్ కు చెందిన కోటా విజయ, ఉబ్బన నాగేంద్ర బాబు అనే ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ హైదరాబాద్ లో సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఒకరికొకరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కోటా విజయను రహస్యంగా తాళి కట్టి భార్య గా చేసుకున్నాడు.
నాలుగేళ్లు సహజీవనం చేశాక విజయను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ప్రియురాలు తన ప్రియుడు ఉబ్బాన నాగేంద్ర బాబు ఇంటి ముందు నిన్న సాయంత్రం నుంచి మౌన పోరాటం చేస్తుంది. తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా సహజీవనం చేశాక పెళ్లి కి నిరాకరించిన నాగేంద్ర బాబుతో తనకు వివాహం జరిగేంత వరకు ఇంటి ముందు దీక్ష చేస్తూనే ఉంటానని పేర్కొంటుంది. తనకు న్యాయం చేయాలని కోరుతుంది...
Jun 28 2023, 09:15