నేడు ఎంసెట్ కౌన్సిలింగ్
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది.
ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన వారికి వచ్చే 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని జేఎన్‌టీయూ అడ్మిషన్స్ విభాగం అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియ కోసం నగరంలో ఏడు హెల్ప్ లైన్‌లను సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసింది. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ, బాగ్‌లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కాలేజీ, రామాంతపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్, మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభు త్వ పాలిటెక్నిక్, జూపార్క్ సమీపంలోని కులీకుతుబ్ పాలిటెక్నిక్, మా రేడ్‌పల్లిలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, గోల్కొండ హోటల్ వెనుక ఉన్న యూనివర్సిటీ సైన్స్‌కళాశాలలో ఈ హెల్ప్‌లైన్ కేంద్రాలున్నాయి....
Jun 28 2023, 09:11