కేసీఆర్ డ్రామాలు వద్దు.. శివసేన ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్
కేసీఆర్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ డ్రామాలు ఇలాగే కొనసాగితే ఆయన తెలంగాణను కూడా కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఉండబోదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారని విమర్శించారు.
ఆయన మహారాష్ట్రలో ప్రర్యటిస్తుండగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు నిన్న కాంగ్రెస్‌లో చేరారని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో కేసీఆర్, కాంగ్రెస్ మధ్య పోరు నడుస్తోందన్నారు. ఎంవీఏ కూటమి బలంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ వ్యూహాలపై జాతీయ పార్టీల నజర్:
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ రాజకీయ వ్యూహలను జాతీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తుంటే కేసీఆర్ మాత్రం మహారాష్ట్రను టార్గెట్ చేయడం వెనుక ఆయన అసలు టార్గెట్ ఏంటనే చర్చ జరుగుతోంది. దీంతో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్‌పై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు పెంచడంపై కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన యూబీటీ లు స్వరం పెంచాయి....
Jun 28 2023, 09:09