/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz RevanthReddy: కర్ణాటకలో వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తాం: రేవంత్‌ రెడ్డి Yadagiri Goud
RevanthReddy: కర్ణాటకలో వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తాం: రేవంత్‌ రెడ్డి

దిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ అధిష్ఠానంతో చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పార్టీ సీనియర్‌ నేతలు రాష్ట్ర నాయకులకు కొన్ని సూచనలు చేశారని అన్నారు. కర్ణాటకలో అవలంభించిన వ్యూహాల్లో కొన్నింటిని ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అధిష్ఠానం సూచించినట్లు చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకుంటామని తెలిపారు..

భారాసతో ఎలాంటి పొత్తులు ఉండబోవని కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, భారాస ఒకటేనని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో భారాసను భాగస్వామ్యం చేయ్యబోమని అధిష్ఠానం స్పష్టం చేసిందన్నారు. 'కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి.. ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి' అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee: మమతా హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. ఉత్తర బెంగాల్‌ సిలిగుఢిలోని సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది..

అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతోనే మమతా హెలికాప్టర్‌ అత్యవసరంగా దిగినట్లు తెలుస్తోంది.

జల్‌పాయగుఢీ జిల్లా కేంద్రంతోపాటు అక్కడి క్రాంతీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. అనంతరం మరో సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. అదే సమయంలో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దిగింది. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సురక్షితంగా ఉన్నారని టీఎంసీ నేత రాజీబ్‌ బెనర్జీ వెల్లడించారు..

Eatala Jamuna: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై ఈటల జమున సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్‌: భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున ఆరోపించారు. రూ.20కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు..

హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు.

''ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. కౌశిక్‌ రెడ్డిని.. కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలపైకి ఉసిగొల్పారు. ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని కౌశిక్‌రెడ్డి కూలగొట్టించారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం'' అని జమున ఆరోపించారు.

భాజపాలో ఈటల రాజేందర్‌ సంతృప్తిగా ఉన్నారని ఈటల జమున చెప్పారు. పార్టీ మారను అని ఆయన ఇప్పటికే స్పష్టంగా చెప్పారని తెలిపారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు..

పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!

ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.

వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్‌లో పాల్గొంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్‌ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పెదఅమిరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన భీమవరం నేతలతో భేటీ అనారోగ్య కారణంగా వాయిదా పడింది. ఈ విషయం తెలిసిన జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు....

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్‌: జూన్ 27

నగరంలో స్పా ముసుగులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టయింది. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేసి

ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మంది విటులను అరెస్ట్ చేశారు. స్పా నిర్వాహకురాలిని ఏపీకి చెందిన శృతిగా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం శృతి ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లారు.

ఫీజుకు డబ్బు లేకపోవడంతో నిందితురాలు వెనక్కివచ్చేశారు. ఉద్యోగాల పేరుతో యువతులతో శృతి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు...

ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడు మల, మూత్ర విసర్జన, విమానాశ్రయంలో అరెస్టు

విమానంలో ప్రయాణంలో తప్పుడు పనులు చేశారనే వార్తలు ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయి. ప్రతిరోజూ ఇలాంటి ప్రయాణికుల చర్యలు తెరపైకి వస్తున్నాయి, ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా విమానంలో సీటు పక్కనే మల, మూత్ర విసర్జన చేసిన ఉదంతం తెరపైకి వచ్చింది.ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అలాంటి పని చేశాడు.దీంతో ఆ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫ్లైట్ కెప్టెన్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ AIC 866లో సీట్ నంబర్ 17Fలో ఉన్న ఒక ప్రయాణికుడు విమానంలో మల, మూత్ర విసర్జన మరియు ఉమ్మివేసాడు. ఈ ప్రయాణ చర్య తర్వాత, ఆమెను క్యాబిన్ సిబ్బంది కూడా హెచ్చరించారని FIR పేర్కొంది. త‌ప్పుడు ప్ర‌వర్తించ‌డాన్ని ఫ్లైట్ కెప్టెన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎయిర్‌లైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం, క్యాబిన్ సిబ్బంది వార్నింగ్ ఇవ్వడంతో విమాన కెప్టెన్‌కు సమాచారం అందించారు. దీని తరువాత, కెప్టెన్ కంపెనీకి సందేశం పంపాడు, అందులో విమానాశ్రయ భద్రత నిందితుడిని విమానాశ్రయంలో పట్టుకోవాలని కోరింది. కలిసి ప్రయాణిస్తున్న ప్రజలు నిరసన వ్యక్తం చేశారని, దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులందరినీ శాంతింపజేశారని ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది. నిందితుడిని పోలీసులకు అప్పగిస్తామని అందరికీ చెప్పారు.

గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో కూర్చున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై మద్యం మత్తులో శంకర్‌ మిశ్రా మూత్ర విసర్జన చేయగా.. ఈ కేసులో నిందితులను జనవరి 7న బెంగళూరు నుంచి పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత అతడిని అరెస్టు చేసే అవకాశం ఉంది.

నేడు పుండరీపురం లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

మహారాష్ట్ర :జూన్ 27

నేడు మంగళవారం ఉదయం 8 గంటలకే సీఎం కేసీఆర్ పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠలశ్వరస్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సంబంధిత కార్యక్రమానికి హాజరు అవుతారు. సోలాపూర్ జిల్లా నేత, ఎన్సీపీకి చెందిన భగీరథ్‌ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో రేపు మధ్యాహ్నం చేరనున్నారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ప్రసంగిస్తారు.

అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు ధారాశివ్‌ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 3.30 గంటలకు అక్కడ ప్రత్యేక పూజలు చేయించి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ ఆలయం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతి భవన్‌కు చేరతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే 4 సార్లు మహారాష్ట్రలో పర్యటన

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికి 4 సార్లు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత ఫిబ్రవరి 5న నాందేడ్‌లో భారీ బహిరంగ సభ, మార్చి 14న కంధహార్ బహిరంగ సభ నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్ లో పర్యటించారు. అక్కడ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదని ప్రజలు ఆలోచించేలా అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల జూన్ 15న నాగ్‌పుర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. త్వరలో ఔరంగాబాద్‌, పుణెలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాజాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ఐదోసారి అవుతుంది.

ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా - ఠాక్రే

మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీమ్‌గా మారిందని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము అంతటిని మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని, ఇటీవల కర్ణాటక ఎన్నికలకు కూడా డబ్బులు పంపారని ఆరోపించారు...

ఇవాళ 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

న్యూఢిల్లీ..

వందే భారత రైళ్ల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నేడు ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లో ఉదయం 10:30 గంటలకు 5 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు PMO ప్రకటనలో తెలిపింది..

మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఇది ఇలా ఉండగా, యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ లో మైనార్టీ హక్కులపై చేసిన వాక్యాలపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు.

ప్రపంచంలోని ప్రజలందరిని ఒక కుటుంబంగా భావిస్తోందనే విషయాన్ని ఒబామా మర్చిపోవద్దని హితవు పలికారు. ఆయన హయాంలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడులు జరిగాయో ఆలోచించుకోవాలని చెప్పారు. భారత్ సెక్యులర్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలని తెలిపారు..

రూ.1,25,000 రివార్డు ఉన్న వాంటెడ్ క్రిమినల్ హతం!!

కౌషంబి:జూన్ 27

హత్యలు, దోపిడీలు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్‌‌ ను ఉత్తరప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ఎన్‍కౌంటర్ చోటుచేసుకుంది.

మృతుడిని మొహమ్మద్ గుర్ఫాన్‌గా గుర్తించారు. మాంఝాన్‌పూర్‌లోని సాండ సుగర్ మిల్లు సమీపంలో లక్నో ఎస్‌టీఎఫ్‌ గాలింపు జరుపుతుండగా జరిగిన ఎదురెదురు కాల్పుల్లో వాంటెండ్ క్రిమినల్ గుర్ఫాన్ హతమైనట్టు కౌషంబి ఎస్‌పీ బ్రిజేష్ శ్రీవాత్సవ తెలిపారు.

గుర్ఫాన్ తలపై రూ.1,25,000 రివార్డు ఉందని చెప్పారు. గాయపడిన గుర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన గుర్ఫాన్‌పై 13 క్రిమినల్ కేసులు ఉన్నట్టు వివరించారు....

Rains: నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..

SB NEWS

SB NEWS