పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్‌లో పాల్గొంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పెదఅమిరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన భీమవరం నేతలతో భేటీ అనారోగ్య కారణంగా వాయిదా పడింది. ఈ విషయం తెలిసిన జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు....
Jun 27 2023, 17:29