Heat Wave: వడగాలులతో బెంబేలు.. మూడు రోజుల్లో 98 మంది మృతి
దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల (Heat Wave) ప్రభావం అధికంగా ఉంది..
ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు..
ఇక బిహార్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 మంది చనిపోగా.. రాజధాని పట్నాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. నలందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 19 మంది, పీఎంసీహెచ్‌లో 16 మంది మృత్యువాతపడ్డారు.
మరో తొమ్మిది మరణాలు ఇతర జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్నా, షేక్‌పురాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్కడి విద్యాసంస్థలకు జూన్ 24వరకు సెలవులు పొడిగించారు..
Jun 18 2023, 18:03