/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Pawan Kalyan: అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌ Yadagiri Goud
Pawan Kalyan: అందర్నీ కలిశాక అన్ని విషయాలు మాట్లాడతా: పవన్‌

దిల్లీ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం హస్తినకు చేరుకున్న పవన్‌.. కేంద్రమంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, మురళీధరన్‌తో సమావేశమైన విషయం తెలిసిందే..

భాజపా ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గానూ ఉన్న మురళీధరన్‌తో పవన్‌ మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం మురళీధరన్‌ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్‌ కార్యాచరణపై పవన్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు పవన్‌ను కలవగా భాజపా ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని ఆయన చెప్పారు. సాయంత్రం కేంద్రహోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ అయ్యే అవకాశముంది.

పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఘటనపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి....

•పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్

పదవ తరగతి పరీక్ష పేపర్లు మూడో తారీకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మొదటి రోజే లీక్ కావడం,కేసీఆర్ అసమర్ధ ప్రభుత్వ పరిపాలనకు నిదర్శనమని పీ.డి.ఎస్.యూ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ తెలిపారు.

స్థానిక బి.సి హాస్టల్లో పేపర్ లీకేజీ ఘటనపై దోషులను శిక్షించాలని,దీనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేయాలని పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పోలే పవన్ పాల్గొని మాట్లాడుతూ ఎగ్జామ్ ప్రారంభమైన ఏడు నిమిషాలకే ప్రశ్న పత్రం లీకు కావడం అంటే అత్యంత సోచనీయమని అన్నారు. ఇప్పటికే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ రాస్తే పేపర్ల లీకేజీ తో అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, మరొకవైపు చదువుకుందాం అంటే పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయని, " చదువుకొన్నేడిదే.. చదువు లాగా" నేడు తెలంగాణ రాష్ట్రంలో తయారయిందని మండిపడ్డారు. అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూస్తున్నాయని తెలిపారు .నిన్న తెలుగు పేపర్ లీకేజీ, నేడు హిందీ పేపర్ లీకేజీలు జరగడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీరని అన్యాయమే అని మండిపడ్డారు .ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 4 ,ఎంసెట్, ఇంకా అనేక రకాల పరీక్ష పేపర్ల నుండి నేడు టెన్త్ పరీక్ష పేపర్ లీకేజీ వరకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రధాన దోషులను శిక్షించకుండా కాలయాపన చేసిందని, అందులో భాగంగానే పేపర్ లీకేజీ ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని దుయ్యబట్టారు.

కేజీ నుండి పీజీ వరకు నా స్వప్నం,నా కళా అని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ పదవి నుండి తప్పుకోవాలని, ఎస్.ఎస్.సి బోర్డు నిర్లక్ష్యానికి నిలువుటద్దం పేపర్ లీకేజీ ఘటనని ఎద్దేవా చేశారు. వెంటనే పేపర్ లీకేజీ కు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పేద, బడుగు,బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో "ఉన్నత చదువులు ఉన్నోడికి అన్నట్లుగా" ప్రభుత్వ తీరు ఉన్నదని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని అందులో భాగంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు.పేపర్ లీకేజీ ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పిడిఎస్ యూ నాయకులు ఇందూరు మధు, జి వెంకటేష్ ,ఆర్ ప్రవీణ్, లెనిన్, రాజు, మాధవ్, సురేష్ ,నవీన్ ,ప్రభాకర్ తదిత తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

ఇండియాలో కొత్తగా 3038 కరోనా కేసులు, 9 మరణాలు..

•ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..

గడిచిన 24 గంటల్లో దేశంలో 3038 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,29,284 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 87 శాతంగా ఉంది.ఇక దేశంలో 9 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,901 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2069 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,77,204 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,11,814 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1,64,740 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ..

శంషాబాద్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

•మొత్తం 137 మంది ప్రయాణికులు సురక్షితం

బెంగళూరు నుంచి వారణాసికి వెళ్తున్న ఇండియా ఫ్లైట్ (6E897) తెలంగాణలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, అందుకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని చెప్పారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఇండిగో ఫ్లైట్ 6E897 ఉదయం 5.10 గంటలకు బయలుదేరింది, అయితే సాంకేతిక సమస్యల కారణంగా విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు.

అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం ఏర్పడిందన్న సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఈ విమానం కొద్దిసేపటి క్రితం బయలుదేరింది.

అంతకుముందు ఏప్రిల్ 1న ఢిల్లీ నుంచి దుబాయ్‌కి బయలుదేరిన కార్గో విమానం పక్షిని ఢీకొట్టింది. దీని తర్వాత, హెచ్చరిక జారీ చేసిన తర్వాత, అతన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. పక్షి ఢీకొనడంతో విమానం విండ్‌షీల్డ్‌ పగిలిందని విచారణలో తేలింది. అయితే, కొంత సేపటి తర్వాత మళ్లీ విమానం బయలుదేరింది.

ముంబయిలో ధీరేంద్ర శాస్త్రిపై ఫిర్యాదు

•సాయిబాబాపై వ్యాఖ్యానించినందుకు భాగేశ్వర్ బాబా, ధీరేంద్ర శాస్త్రిపై ఎఫ్ఐఆర్ చేయాలని డిమాండ్

సాయిబాబా గురించి బాగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర్ ధీరేంద్ర శాస్త్రి చేసిన ప్రకటనపై వివాదం పెరిగింది.వాస్తవానికి షిర్డీ సాయిబాబా విషయంలో ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై లిఖితపూర్వక ఫిర్యాదు నమోదైంది. ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే యువసేన ఈ ఫిర్యాదు చేసింది. షిర్డీ సాయి బాబాపై బాగేశ్వర్ బాబా చేసిన వివాదాస్పద ప్రకటన వెలువడడంతో ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే యువసేన సభ్యులు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాగేశ్వర్ బాబాపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కొన్ని రోజుల క్రితం సాయిబాబా గురించి పెద్ద ప్రకటన చేశారు. సాయిబాబా దేవుడు కాదని ధీరేంద్ర శాస్త్రి అన్నారు. సాయిబాబా సాధువు, ఫకీరు కాగలడని ఆయన అన్నారు. కానీ దేవుడు ఉండలేడు. మన మతంలో శంకరాచార్యులకు అతి పెద్ద స్థానం ఉందన్నారు. వారు సాయిబాబాకు దేవతల స్థానాన్ని ఇవ్వలేదు. నక్క చర్మాన్ని ధరించి ఎవరూ సింహం కాలేరని వివాదాస్పద వాంగ్మూలం ఇచ్చారు.

Naxals Encounter: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)లోని నక్సల్స్‌ (Naxals) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఛత్రా (Chatra) అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు..

వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు (Maoist) అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.(Naxals Encounter)

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ (CRPF Cobra Unit) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..

నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది..

Pawan Kalyan: దిల్లీకి పవన్‌.. భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని

దిల్లీ: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌..

నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు.

దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా(BJP)కు చెందిన పలువురు ముఖ్యనేతలు, కేంద్రమంత్రులతో పవన్‌, మనోహర్‌ భేటీ కానున్నారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై భాజపా పెద్దలతో పవన్‌ చర్చిచే అవకాశముంది. జనసేనాని దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అత్తారింటి ముందు అల్లుడి ధర్నా

కోదాడ :

తన కొడుకును తనకు దూరం చెయ్యొద్దంటూ ఓ తండ్రి ఆందోళన చేస్తున్నాడు. అత్తారింటి ముందు తన తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగాడు.

ఏడాదిన్నరగా తన కొడుకును కలవనివ్వడంలేదని, కోర్టు తీర్పును కూడా అమలుచేయట్లేదని వాపోతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన.

హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ కు కోదాడకు చెందిన రమణి పృథ్వితో 2018లో వివాహం జరిగింది. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే, 2021లో భార్యాభర్తల మధ్య విభేదాలు తలేత్తాయి. దీంతో రమణి పృథ్వి కొడుకును తీసుకుని కోదాడలోని పుట్టింటికి చేరుకుంది.

ఆ తర్వాత కొడుకును తల్లిదండ్రుల వద్ద వదిలి కెనడా వెళ్లింది. దీంతో ప్రవీణ్ కుమార్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. వారానికోమారు తండ్రీకొడుకులు కలుసుకునేందుకు వీలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..

ఏడాదిన్నరగా తన కొడుకును చూసుకునేందుకు ప్రవీణ్ ఎన్నిమార్లు ప్రయత్నించినా అత్తామామలు కుదరనివ్వలేదు. దీంతో తన కొడుకును తనకు చూపించాలంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్ అత్తారింటి ముందు ధర్నాకు దిగాడు. కొడుకు కోసం కొన్న ఆట వస్తువులను ప్రదర్శిస్తూ అత్తామామల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు.

Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది..

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఏపీలో మార్చిలో 10-20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. కానీ, ఈసారి చాలా ఎక్కువగా అంటే 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ఇది చాలా అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..

ఇక, ఇదే సమయంలో.. కోనసీమ జిల్లాలో 733 శాతం, విశాఖపట్నంలో 623 శాతం, శ్రీకాకుళంలో 429 శాతం, అనకాపల్లిలో 439 శాతం, కాకినాడలో 523 శాతం, కృష్ణా జిల్లాలో 564 శాతం, నెల్లూరులో 553 శాతం, కడపలో 646 శాతం, తిరుపతిలో 671 శాతం, అన్నమయ్య జిల్లాలో 386 శాతం, ఏలూరులో 353 శాతం వర్షపాతం మార్చి నెలలో నమోదు అయ్యింది.. అత్యల్పంగా అంటే ప్రకాశం జిల్లాలో 6 శాతం మాత్రమే నమోదైంది.. కర్నూలులో 16 శాతం, అనంతపురం 35 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 110 శాతం, నంద్యాల 123 శాతంలో వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, మార్చిలో కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం జరిగిన విషయం విదితమే..

CM YS Jagan: సీఎం జగన్‌ కీలక భేటీ.. మారబోతున్న ఎమ్మెల్యేల జాతకాలు..!

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించబోతున్నారు..

ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకాబోతున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌ ఇస్తారు అనే చర్చ సాగుతోంది.. గతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్‌.. మరోవైపు.. మంత్రివర్గంలో మార్పులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశంలోనే.. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడంతో.. ఆ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నేతలకు టెన్షన్‌ పట్టుకున్నట్టు తెలుస్తుంది..