పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి సిఐటియు:తుమ్మల వీరారెడ్డి
పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి సిఐటియు:తుమ్మల వీరారెడ్డి
గ్రామపంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాలకుర్తి నుంచి పట్నం వరకు జరిగే గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం నల్లగొండ మండల ఎంపీడీవో కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు 7 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల నుండి గ్రామపంచాయతీ కార్మికులు తమ వయసు ఎంత గ్రామ పంచాయతీకి సేవ చేయడానికి వినియోగించినారని అన్నారు వారితో ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయించుకుని ఇప్పటివరకు వారికి కనీస వేతనం అమలు చేయకపోవడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు అనేక సంవత్సరాలు పోరాడి జీవో నెంబర్ 51 ని సాధించుకున్నారని అంతలోనే మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో కార్మికులను కట్టు బానిసలు చేసి కార్మికుల చేత తమకు రాణి పనులు బలవంతంగా చేయిస్తూ వారి మరణాలకు కారణమవుతున్నారని ఇలా మరణించిన వారికి ఎలాంటి భద్రత లేదని వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ బిల్ కలెక్టర్ కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి అర్హులైన వారందరిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించాలన్నారు కార్మికులకు ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని అన్నారు గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర పట్నం చేరుకునే లోపు సమస్యలు పరిష్కారం చేయకపోయినట్లయితే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
*ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, కానుగు లింగస్వామి, దయానంద్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, భీమ గాని, గణేష్ ,యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర అరుణ, పొన్న అంజయ్య, వడ్డేపల్లి యాదయ్య, సలివోదు సైదాచారి, వరికుప్పల ముత్యాలు, కృష్ణ, సంజీవ, చింతకింది భద్రయ్య, రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.




పెండింగ్లో ఉన్న 3500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని నలగొండ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 300 కోట్ల రూపాయలు విడుదల కాక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చదువు పూర్తి అయిన కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలందరూ ఉన్నత చదువులకు దూరం కావడం జరుగుతుంది చదువు పూర్తి అయినా ఫీజు రీయంబర్స్మెంట్ రాకపోవడం వల్ల సర్టిఫికెట్ లేక ఉన్నత చదువుల్లో పై కోర్సుల్లో చేరకపోవడం వలన విద్యార్థులు తీవ్ర మనోవేదన గురి అవుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 3500కోట్ల స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ పరికశెట్టి జిల్లా నాయకులు ఈగల సూర్య బిక్షం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
తిప్పర్తి: ఇoడ్లూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీపీ

తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు సిరిపురం యాదయ్య 13వ వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రము లో అమరవీరుల స్తూపం వద్ద బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన

అర్హత కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి-------- సిఐటియు


ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు జన్మదిన వేడుకలు నిర్వహించిన బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి గారు...

Feb 21 2023, 13:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.3k