/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఒకరు మాకు టికెట్లు ఇచ్చేదేంటి?అవసరం ఉంటే వాళ్లే వస్తారు: కూనంనేని Yadagiri Goud
ఒకరు మాకు టికెట్లు ఇచ్చేదేంటి?అవసరం ఉంటే వాళ్లే వస్తారు: కూనంనేని

హైదరాబాద్: ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

భాజపాకు వ్యతిరేకంగా మునుగోడు ఉపఎన్నికలో భారాసకు మద్దతు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడారు. భారాసకు మద్దతు ఇచ్చినప్పటికీ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు. పొత్తులు.. పోరాటం.. ఈ రెండూ వేర్వేరని కూనంనేని స్పష్టం చేశారు.

‘‘రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించేది కమ్యూనిస్టులే. టికెట్లు ఒకరు మాకు ఇచ్చేదేంటి?అవసరం ఉందనుకుంటే మా దగ్గరకే భారాస వస్తుంది. లేదనుకుంటే ఎవరి దారి వారిదే. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర అక్కడికి చేరుకుంది. ఏఐటీయూసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదు. సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. త్వరలోనే భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. అదాని కుంభకోణంపై ఒక్క సారి కూడా ప్రధాని మోదీ నోరు విప్పలేదు. సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది. 24గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. విద్యుత్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టి సమస్య పరిష్కరించాలి’’ అని కూనంనేని కోరారు.

‘అదానీ-హిండెన్‌బర్గ్‌’.. కమిటీని మేమే నియమిస్తాం: సుప్రీం

దిల్లీ: అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం కీలక ప్రకటన చేసింది.

ఇటు పిటిషనర్లు, అటు ప్రభుత్వం నుంచి ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సీల్డ్‌ కవర్‌ సూచనలను అంగీకరించబోమని తెలిపింది.

పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించి తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. తామే ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది.

సీఎం కేసీఆర్ కు ప్రధాని మంత్రి మోడీ బర్త్డే విషెస్*

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దేశ ప్రధానమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంతోషకరమైన జీవితం ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షును.

ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు..

TS పోలీస్‌ జాబ్స్‌: గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్‌

హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య ఎంపిక పరీక్షలకు హాజరుకాలేకపోయిన గర్భిణీలు, బాలింతలకు పోలీసు నియామక మండలి(TSLPRB) మరో అవకాశం కల్పించింది.

ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన వారు మెయిన్స్‌లో అర్హత పొందాక దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనవచ్చిని తెలిపింది.

అయితే ఇందులో పాల్గొనాలంటే మెడికల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరి 28వ తేదీలోపు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

KTR: కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆణిముత్యం: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం

హైదరాబాద్‌: తెలంగాణకు నూతన వైద్యకళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

9 వైద్యకళాశాలలు ఇచ్చామని కిషన్‌రెడ్డి(Kishan Reddy).. అసలు తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నుంచి ప్రతిపాదనలే రాలేదని మన్‌సుఖ్‌ మాండవీయ.. రెండు ప్రతిపాదన వచ్చాయని నిర్మలా సీతారామన్‌ అంటున్నారని కేటీఆర్‌ గుర్తు చేశారు.

అబద్ధాలైనా ఎప్పుడూ ఒకేలా చెప్పేలా కేంద్రమంత్రులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ(PM Modi)కి కేటీఆర్‌ హితవు పలికారు. అసలు తెలంగాణలోనే లేని 9 వైద్యకళాశాలలను సృష్టించిన ఘనత కిషన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆయుష్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కల్పిత గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ను కూడా ప్రకటించారన్నారు. కేంద్రమంత్రులు అందరిలో కిషన్‌రెడ్డి ఆణిముత్యం అంటూ కేటీఆర్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Bopparaju: ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే.. ప్రజలకేం చెబుతారు?: బొప్పరాజు

విజయవాడ: ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అంటున్న ఆర్థికశాఖ.. తమకు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ప్రశ్నించారు..

ఉద్యోగుల వేతనాలు సరైన సమయంలో జమ అవుతున్నాయో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు.

''ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస వేతనం 30 శాతం పెంచాలని పీఆర్సీ కమిషన్‌ సిఫార్సు చేసినా రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం కూడా పెంచలేదు. గత ప్రభుత్వ హయాంలో వారికి 50 శాతం మేర వేతనాలు పెంచారు. ఉద్యోగులకే లెక్కలు తెలియకపోతే ప్రజలకేం చెబుతారు? ఎంత మొత్తాన్ని జమ చేస్తున్నారు? ఎంత వెనక్కి తీసుకుంటున్నారు? అనేది అర్థం కావడం లేదు. వీఆర్‌ఏ లాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు కూడా డీఏ చెల్లించలేరా?''అని బొప్పరాజు నిలదీశారు..

Andhra Neews: భాజపాతో పొత్తులోనే ఉన్నామని పవన్ చెప్పారు: సోము వీర్రాజు..

చీరాల: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలం నుంచి చేస్తున్న ఆరోపణలపై గతంలో స్పందించలేదని.. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు..

భాజపాలో కార్యకర్తగా చేరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని.. తానేంటో పార్టీ అధిష్ఠానానికి తెలుసునని సోము అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము మాట్లాడారు. కొంతకాలంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కన్నా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేకే భాజపాను వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు రాష్ట్ర బాధ్యతలు చేపట్టాక పార్టీలో వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయిందని.. వర్గాలుగా చీలిపోయేలా వ్యవహరించారని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..

జనసేనతో పొత్తుపై స్పందిస్తూ.. ''విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వారాహికి పూజ సమయంలో భాజపా పొత్తులోనే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జగన్ వైకాపా ప్రభుత్వానికి 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే, అన్ని పథకాలకు తామే నిధులు ఖర్చుపెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం శోచనీయం'' అని సోము అన్నారు..

గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు.

ఇళ్ల నిర్మాణం, టిట్కో ఇళ్లపై ఆయన సమీక్షించారు.

ఈ సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దివాన్‌ మైదిన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం..

Nadendla Manohar: పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..

జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి..

ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు జనసేన తరపున ఆర్థిక సాయం చేస్తున్నామని వెల్లడించారు.. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దారుణాలు, దాడులు పెరిగాయని విమర్శించారు. జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు కలిగిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల నుంచి పార్టీ సభల వరకూ ఆంక్షలే అని మండిపడ్డారు.

Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా

Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..

ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు..

నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైన నేను కూడా పూర్తి చేయలేకపోయానన్న ఆయన.. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు.