పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి,స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం:ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లను సవరించాలి
స్థానిక సమస్యలపై ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం
ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు
దొడ్డి కొమరయ్య భవన్లో బుధవారం సిపిఎం నల్గొండ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చట్టం చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సబ్సిడీలు ఇవ్వకుండా కార్పొరేటీకరణ చేయడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. పేదలు, వామపక్ష పార్టీల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టానికి 60 శాతం నిధులు తగ్గిస్తూ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ ను సవరించి ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి రావడానికి ఉన్న పంచాయతీరాజ్ ,ఆర్ అండ్ బి రోడ్లను డబల్ రోడ్లుగా మార్చాలని, దెబ్బతిని గుంతలతో అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని పాదయాత్రలు, మంత్రులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు మినహా శివారు ప్రాంతాల అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు, తదితర సమస్యలపై ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
*ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశమ్ ,పాలడుగు ప్రభావతి, నల్లగొండ పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, తుమ్మల పద్మ, నల్లగొండ ,తిప్పర్తి, కనగల్లు మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నె బిక్షం, కందుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.




మహాప్రస్థానం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ వెంకట్రావ్
సమాచార హక్కు వికాస సమితి 2023 క్యాలెండర్ ను మునుగొడు మండలంలోని mro కృష్ణా రెడ్డి dt నరేష్ ,mpdo జానాయ్య ,పంచాయతీ రాజ్ ae రామకృష్ణ గార్ల చే క్యాలెండర్ ఆవిష్కరణ చెయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ జిల్లా కార్యదర్శి p సైదులు గౌడ్,మునుగొడు నియోజకవర్గం అధ్యక్షులు అద్దంకి రామ లింగయ్య ప్రదాన కార్యదర్శి సురిగి శ్రీశైలం,సహదేవు తదితరలు పాల్గొన్నారుు
వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాల నాయకులతో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు అనగా 15 2 2023 తేదీన 11 గంటలకు నిరసన కార్యక్రమం జరపడమైనది విషయం ఏమనగా విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాచకుడు అత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది దీనిని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మానసిక వికలాంగుల పైన మరియు వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం జరుగుతుంది మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బి సుబ్బారావు రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్న సుబ్బయ్య సంఘ సేవకులు సల్లావుద్దీన్ ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి ఎం ఎస్ పి నాయకులు మాతయ్య వికలాంగుల హక్కుల పోరాట సమితి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను మరియు నగర అధ్యక్షుడు ప్రసాద్ విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్ సుబ్బరాయుడు మరియు ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి మరియు వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి బి ఓబయ్య ఆరిపుల్ల రా చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారుు.
జగిత్యాల జిల్లా :

19న శివాజీ జయంతి ర్యాలీని విజయవంతం చేయండి

నల్లగొండ: మన ఊరు.. మన బడి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

నేడు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..


Feb 16 2023, 10:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.0k