ఈనెల 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.
ఈనెల 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయండి.
-బకరం శ్రీనివాస్ మాదిగ.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వర్గీకరణ జరగలేదు. ప్రధాని ఈనెల 13న హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా.. వర్గీకరణ బిల్లును వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని ఎంఎస్పి నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి శంకర్ మాదిగ డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా....
ఫిబ్రవరి 13న హైదరాబాద్-విజయవాడ రహదారిని దిగ్బంధం చేస్తున్నామని వారు గురువారం చిట్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొని మాట్లాడారు.
వర్గీకరణ చేయకపోవడంతో ఎస్సీలు విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు.
బీజేపీ మాదిగలకు ప్రత్యక్ష పోరాటం తప్పదన్నారు. వర్గీకరణ అంశం తేల్చకుండా బీజేపీ నేతలు ఎవరు వచ్చినా ఎమ్మార్పీఎస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు ఈనెల 13న రానున్న ప్రధాన మంత్రి మోడీకి మాదిగల నిరసన సెగలు తగలాలన్నారు. అనంతరం. హైదరాబాద్- విజయవాడ రహదారి దిగ్భంధానికి సంబంధించి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.
--------------------------------------------------
ఈ సమావేశంలో ఏరసాని గోపాల్, నోముల పురుషోత్తం, బొజ్జ చిన్న ముదిగొండ వెంకటేశ్వర్లు, ఎరసాని సోమయ్య, పెరిక లింగస్వామి, పోకల అశోక్, పోకల యేసు తదితరులు పాల్గొన్నారు.



మానవత్వం చాటుకున్న మున్సిపల్ చైర్మన్:
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్...
నకిరేకల్ నియోజకవర్గం
నల్లగొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో సిమెంట్ బెంచిల పంపిణీ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.


హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
Feb 09 2023, 20:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.4k