బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ
బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.
ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది. కౌన్సిల్‌లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ చేపడతారు. మన ఊరు - మన బడి, జంటనగరాల్లో సీసీటీవీ కెమేరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు - ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ. సీతారామ రెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలపనుంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల సలహా మండలి నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలోనే తెలిపారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర శాసనసభలో హరీశ్‌రావు, మండలిలో ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న శాసనసభకు సెలవు. తిరిగి ఇవాళ సభలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. దానికి రాష్ట్ర ఆర్థికమంత్రి సమాధానం చెబుతారు. 9, 10, 11 తేదీల్లో పద్దులపై చర్చ ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి.

బడ్జెట్‌పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది.2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్‌పై నేడు శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్ పై చర్చ చేపడతారు.



హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్‌నగర్ వాసి మాజ్‌హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.
Feb 08 2023, 16:16
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.1k