చేనేత పవర్లూమ్ కార్మికులకు నిరాశ మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్:తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్
చేనేత పవర్లూమ్ కార్మికులకు నిరాశ మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్లో నామమాత్రంగా 50 కోట్లు మాత్రమే కేటాయించి చేనేత, పవర్ లూమ్ కార్మికులను నిరాశకు గురిచేశారని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్, తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దండెంపల్లి సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర బడ్జెట్ పై మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో చేనేత బీమా కు మినహా ఇతర ఎలాంటి సంక్షేమ పథకాలు చేనేత సహకార సంఘాల అభివృద్ధి కోసం కార్మికులకు రంగు రసాయనాలు యారో సబ్సిడీ ల కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా చేనేత పవర్ లూమ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి బడ్జెట్లో మొండి చేయి చూపడం విచారకరమని అన్నారు. చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్ లను ఏర్పాటుచేసి చైర్మన్ లను నియమించి ఉత్సవ విగ్రహాలుగా ఉంచారే తప్ప వాటి ద్వారా చేనేత, పవర్లూమ్ కార్మికులకు ఉపయోగపడే విధంగా నిధులు లేకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే రాష్ట్ర బడ్జెట్ ను సవరించి చేనేత, పవర్ లూమ్ కార్పొరేషన్లకు 1200 కోట్లు చొప్పున రెండు కార్పొరేషన్లకు 2400 కోట్లు నిధులు కేటాయించి కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో చేనేత పవర్లు కార్మిక సంఘాల నాయకులు పెండేం రాములు, గంజి నాగరాజు, కర్నాటి శ్రీరంగం, రాపోలు వెంకన్న మధు తదితరులు పాల్గొన్నారు.




హైదరాబాద్, ఖమ్మం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి లేదా గుమిగూడి ఇతరులకు న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు:
మంత్రి జగదీష్ రెడ్డి.. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర...
హైదరాబాద్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా, ఐఎస్‌ఐ ఉగ్రకుట్రలకు ప్రయత్నిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారమందినట్లు తెలుస్తోంది.ఈ ఉగ్ర పన్నాగంపై ఎన్‌ఐఏ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మూసారంబాగ్‌కు చెందిన జాహెద్ అలియాస్ అబ్దుల్.. హుమాయున్‌నగర్ వాసి మాజ్‌హసన్ ఫరూఖ్, సైదాబాద్ అక్బర్‌బాగ్‌కు చెందిన సమీయుద్దీన్‌పై కేసు నమోదు చేసింది.
వైభవంగా ప్రారంభమైన గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర
Feb 08 2023, 07:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.8k