ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు పంపుతాం:టూటౌన్ SI రాజశేఖర్ రెడ్డి.
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు
బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకు పంపుతాం
మైనర్లకు బైకులు ఇస్తే తల్లిందండ్రులదే బాధ్యత
ఆకతాయిలపై ఆకస్మిక దాడులు
నల్లగొండ: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అర్థరాత్రి సమయంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై శనివారం రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. టుటౌన్ ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణ ప్రాంతంలో అర్థరాత్రి ఆవరాగా తిరుతుగున్న వారిపై నిఘా ఉంచారు. దీనిలో భాగంగానే శనివారం అర్థరాత్రి బహరంగా ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, స్థానికులను ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై తమ సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. మద్యం సేవించిన అనంతరం భారీ శబ్ధాలు చేస్తూ బైక్ రేసింగ్ లకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆకతాయిలపై 15 కేసులు, డ్రంకెన్ డ్రైవ్ లో10 మందిపై కేసులు నమోదు చేసి, 23 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. రాత్రి సమయంలో మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు నిద్రిస్తున్న సమయంలో పట్టణ ప్రాంతంలో మద్యం సేవించినా, న్యూసెన్స్ కలిగిస్తూ భారీ శబ్ధాలతో బైక్ రైడింగ్ లకు పాల్పడుతున్నవారిపై తమకు సమాచారం అందించాలని ఎస్ఐ స్థానిక ప్రజలకు కోరారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు తప్పవు

ఘణంగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు టైగర్ R కృష్ణన్న గారి తనయుడు జాతీయ విద్యార్థి -యువజన సంఘాల కోఆర్డినేటర్ డాక్టర్ R అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలను స్థానిక బిసి స్టడీ సర్కిల్ హాస్టల్లో జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో కేకు కట్చేసి ,స్వీట్స్ పంపిణి చేసి జరిపారు .ఈ కార్యక్రమములో జిల్లా కార్యదర్శి వడ్డెబోయిన సైదులు ,విద్యార్థి సంఘం సింగం రమేశ్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాద్యక్షుడు పగిళ్ల కృష్ణ ,మహిలా మండలాధ్యక్షురాలు శంకరదుర్గ ,సతీశ్ ,తుంగతుర్తి శంకరా చారీ తదితరులు పాల్గొన్నారు.
Feb 06 2023, 16:42
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.8k