Andrapradesh

Oct 05 2019, 15:54

తన విధి నిర్వహణలో నిజాయితీగా ఉన్నందుకు ఒక మహిళా అధికారిణిపై వైసిపి ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం

తనకు న్యాయం చేయాలని అర్థరాత్రి వేళ ఆ మహిళాధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు తీసుకోడానికే జంకారంటే, ఈ రాష్ట్రంలో పోలీసింగ్ ఉన్నట్టా లేనట్టా?

వైసిపి నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడా చూడరా..? 

ఆమె ఇంటికి కరెంట్ కట్ చేస్తారా? నీటి కనెక్షన్ కట్ చేస్తారా? ఇంటి ముందే చెత్తకుండీ పెడతారా? టివి కేబుల్స్ తెంపేస్తారా? 

ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడవా?

ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనారిటి జర్నలిస్ట్ ను ఫోన్ లో చంపుతానని బెదిరించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేసారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. 

అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?



ట్విట్టర్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

Andrapradesh

Oct 05 2019, 13:10

బీసీలకు కూడా కట్ఆఫ్ మార్కులు తగ్గించాలి

సచివాలయం పోస్టులకి సంబంధించి అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులకి ఎస్సి, ఎస్టీలకు ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులు తగ్గించి జిల్లాలో 1334 పోస్టులను వారితో భర్తీకి పూనుకుంది. అలాగే జనాభాలో 50 శాతం కి పైగా ఉన్న బీసీలకు కట్ఆఫ్ మార్కులను ￰ప్రభుత్వం￰ తగ్గించక పోవడం శోచనీయం, ప్రభుత్వం బీసీలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని బీసీ ప్రజానీకం ఆవేదన వెల్ల బుచ్చుతుంది. బీసీ రిజర్వ్ పోస్టులను ఎస్సి, ఎస్టీలతో భర్తీ చెయ్యడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం జరిగిన పొరపాటును గ్రహించి బీసీలకు   కూడా కట్ మార్కులను 5 మార్కులను తగ్గించి బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసాగా నిలవాలని ఆ వర్గాల వారు కోరుతున్నారు. ఈ మేరకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి బీసీ వర్గాల నిరుద్యోగులకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.

Andrapradesh

Oct 05 2019, 13:01

ఇవాళ ప్రధానితో సీఎం శ్రీ జగన్ భేటీ..

రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై చర్చించేందుకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 

ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తదితర అంశాలను ప్రధాని మోదీకి మరోమారు సీఎం నివేదించనున్నారు. 

ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా సాధించిన విజయాలను కూడా ప్రధానికి వివరించనున్నట్టు సమాచారం. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి ఎప్పటికప్పడు నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాల్సిందిగా నివేదించే అవకాశముంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో ప్రత్యేకంగా నిధుల విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా సీఎం కోరనున్నారు. 

ఏపీకి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయటంతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదించనున్నట్టు తెలుస్తోంది. 

పీపీఏల సమీక్షకు సంబంధించి కేంద్రం నుంచి వస్తున్న లేఖలకు రాష్ట్ర ప్రభుత్వ స్పందనను కూడా వివరించనున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రధానికి వివరిస్తారని సమాచారం.

Andrapradesh

Oct 05 2019, 12:59

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,190, విజయవాడలో రూ.37,800, విశాఖపట్నంలో రూ.39,230, ప్రొద్దుటూరులో రూ.37,000, చెన్నైలో రూ.38,010గా ఉంది. 

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,370, విజయవాడలో రూ.35,000, విశాఖపట్నంలో రూ.36,090, ప్రొద్దుటూరులో రూ.34,900, చెన్నైలో రూ.36,440గా ఉంది. 

వెండి కిలో ధర హైదరాబాదులో రూ.45,500, విజయవాడలో రూ.46,300, విశాఖపట్నంలో రూ.46,000, ప్రొద్దుటూరులో రూ.46,300, చెన్నైలో రూ.49,100 వద్ద ముగిసింది.

Andrapradesh

Oct 05 2019, 12:40

నర్సీపట్నం నియోజకవర్గ రాజానా వీర సూర్యచంద్ర గారి ఆదర్వ్యంలో  చేరిన జనసేన పార్టీలో చేరిన వైసిపి,టిడిపి కార్యకర్తలు 
 

నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల మాకవరపాలెం మండలం, రామన్నపాలెం పంచాయతీ, నందు  నర్సీపట్నం నియోజకవర్గ రాజానా వీర సూర్యచంద్ర గారు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది "వైసిపి, టిడిపి" నుండి జనసేన పార్టీలో చేరారు. అక్కడ స్థానిక నాయకులు చుక్క ప్రశాంత్, వై. నూక రాజు, కే.రాజు సమక్షంలో వారందరూ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ  చేరినటువంటి వారు గత ప్రభుత్వం,ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూసి విసిగిచెంది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మేము ఈ పార్టీలో చేరుతున్నాము అని తెలియజేశారు. మేమే కాకుండా ఇంకా కొంతమందిని అతి త్వరలో మా గ్రామం నుండి జనసేన పార్టీలోకి అధిక సంఖ్యలో చేరబోతున్నారు అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర ఇలా అన్నారు జనసేన పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేశారు. మా పార్టీ నర్సీపట్నం నియోజకవర్గంలో ముఖ్యంగా బలపరచడం, గ్రామంలో ఉన్నటువంటి  సమస్యలపై పోరాటం చేయడం సేవా కార్యక్రమాల్లో సేవా భావం కలిగిన వ్యక్తులను కలుపుకుంటూ వివిధ వర్గాల ప్రజలను పార్టీలో చేర్చుకుంటూ జరగబోయే 2024 ఎలక్షన్ లో  జనసేన పార్టీని విజయతీరాలకు చేర్చే విధంగా కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నాము అని అన్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు సమస్యలు సూర్యచంద్ర దృష్టికి తెచ్చారు మా గ్రామంలో మంచినీటి సమస్య ,కాలువలో పూడిక తీయక పోవడం వలన ఎక్కడ ఎక్కడ నీరు అక్కడే ఉంటుందని మరియు మా ఊరిలో దాదాపు చాలా వరకు మా భూమి తాలూకా వివరాలు వెబ్ల్యాండ్ లో నమోదు కాలేదని,వెబ్ల్యాండ్ లో నమోదు కాని వారికి భూమి అమ్మలన్న అప్పు తెచ్చుకోవాలన్న కనీసం రైతు భరోసా పథకానికి అర్హులు కాలేక పోయాము అని వాపోయారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళమని జనసేన పార్టీ తరఫున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వి. చక్రవర్తి, మారిశెట్టి రాజా, చుక్క రాజబాబు, చుక్క ప్రశాంత్, వై .నూక రాజు, కే. రాజు తదితరులు......

Andrapradesh

Oct 05 2019, 12:34

జగన్ సార్... పీవీపీ నుంచి కాపాడండి: బండ్ల గణేశ్ 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏపీ సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెట్టారు. "గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పీవీపీ బారి నుంచి కాపాడండి" అని ఆయన ట్వీట్ చేశారు. 

దాని తరువాత "రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్" అని, "ఓడిపోయిన కేసులలో కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే... ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు" అని ఆరోపించారు.

 "అందరూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనందపడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు. వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి, నీకు చెడ్డ పేరు వస్తుంది" అని మరో ట్వీట్ ను కూడా బండ్ల గణేశ్ పెట్టారు. "మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు, దయచేసి కట్టడి చేయండి" అని కోరారు.

Andrapradesh

Oct 05 2019, 11:36

మంత్రిగారి అత్యుత్సాహం. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధం.

విశాఖలో వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించటానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జరిగిన ఆటో ర్యాలీలో స్వయంగా టూరిజం మంత్రి అవంతీ శ్రీనివాస్ గారే రవాణాశాఖ నిబంధనలను అతిక్రమించారు.

ఆటోలో డ్రైవరుతో సహా నలుగురు మాత్రమే ప్రయాణిచాలి. డ్రైవరు పక్కన ఎవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు.
కానీ అవంతీ ఈ‌రెండు నిబంధనలనూ అతిక్రమించారు. ఆటో‌ డ్రైవరుకు లైట్ కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. మంత్రి గారికి ఇది ఉండే అవకాశం లేదు.
 అయితే ట్రాఫిక్ పోలీసులు ఆయనను వారించకపోగా సైరన్లు కొడుతూ ఆయన వెంట పగరయాణించటం విశేషం.

ఇటీవలి కాలంలోనే బిజెపి, టిడిపిలు బైక్ ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నించినపుడు బైకులు నడిపేవారికి హెల్మెట్లు లేవంటూ ఆ ర్యాలీలని పోలీసులు భగ్నం చేశారు. మరి ఇపుడు  ప్రమాదకరమైన ఆటో డ్రైవింగుకు మంత్రిని ఎలా అనుమతించారో ఆ పోలీసులే చెప్పాలి

Andrapradesh

Oct 05 2019, 11:35

విజయవాడ

సరస్వతీదేవి అలంకారం లో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్న Apiic ఛైర్మన్, ఎమ్మెల్యే  రోజా

రోజా

సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు

గత యేడాది ఇదే రోజు అమ్మను దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ని సిఎం ను చేయాలని కోరాను

ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి  అయ్యారు.. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారు

ఆయనకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నా

గతంలో‌ కొండ  పైకి రావాలంటే ఎన్నో అంక్షలు..

ఈసారి అందరూ ప్రశాంతంగా ప్రజలు  దర్శనం చేసుకుంటున్నారు

మనసున్నవాడు సిఎం అయితే ఎలా ఉంటుందో గతంలో‌వైయస్ పాలన చూశాం

ఇప్పుడు కూడా మనసున్న జగన్ ను ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుతున్నా

అన్ని‌వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలనేదే సిఎం తపన

మా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు  దసరా ఏర్పాట్లు బాగా చేశారు

Andrapradesh

Oct 05 2019, 11:34

ఏపీ ఐ ఐ సీ ఛైర్ పర్సన్ రోజాకు రూ.3.82 లక్షల జీతభత్యాలు

ఏపీ ఐ ఐ సీ చైర్పర్సన్ హోదాలో ఉన్న రోజాకు జీతభత్యాల క్రింద నెలకి 3.82 లక్షల రూపాయలు ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది...

రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం..

వాహన సౌకర్యానికి 60000 వేలు..

అధికార క్వార్టర్స్ లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి 50000 వేలు

మొబైల్ ఫోన్ చార్జీలకు 2000 వేలు

వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70000 వేలు

Andrapradesh

Oct 05 2019, 11:34

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి నిర్మాత బండ్లగణేష్ హల్చల్

అనుచరులతో కలిసి వైస్సార్సీపీ విజయవాడ ఎంపీ గా నిలిచిన పొట్లూరి వరప్రసాద్ ని బెదిరించిన బండ్ల గణేష్..

జూబ్లీహిల్స్ పి ఎస్ లో పివిఆర్ పిర్యాదు

నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదు

420, 448, 506 r/w 43 ipc సెక్షన్స్ కింద కేసు నమోదు

పరారీలో బండ్ల గణేష్, గాలిస్తున్న పోలీసులు