హనుమాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా గుంతలు, మరమ్మత్తులు చేపట్టాలన్న ములాయం సింగ్ యాదవ్ బి గ్రేడ్ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని హనుమపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద రోడ్డు గుంతలుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్రయాణికులు,వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి పై ఇనుప చూవ్వలు తేలడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని ములాయం సింగ్ యాదవ్ యూత్ బి గ్రేడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేకల బాలు యాదవ్ ఆరోపించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యా కమిషన్ సలహాదారులుగా ఆర్ వెంకట్ రెడ్డి నియామకం ,హర్షం వ్యక్తం చేసిన ప్రజాసంఘాలు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యాహక్కు పరిరక్షణ, బాల్య వివాహాల సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణంలో గత రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న ఎం.వి.ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్ రెడ్డిని తెలంగాణా రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులుగా నియమిస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్. వెంకట్ రెడ్డి పిల్లల విద్య కోసం తెలంగాణ తో పాటు జాతీయ స్థాయిలో స్వచ్చంద సంస్థలతో అంతర్జాతీయంగా “స్టాప్ చైల్డ్ లేబర్ కాంపెయిన్" భాగస్వామ్య దేశాలైన ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఘన, మాలి, మొరాకో తదితర దేశాల్లో ఆయన పని చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో రాష్ట్రంలోని సామాజిక కార్యకర్తలను ఒక వేదికగా ఏర్పాటు చేసి చురుకైన పాత్ర పోషించారు. బాలల పక్షపాతిగా ఉంటూ నాణ్యమైన విద్య పిల్లల హక్కు అని, పిల్లలు మన జాతీయ సంపద అంటూ , నిరంతరం పిల్లల కోసం పనిచేస్తున్న ఆర్. వెంకట్ రెడ్డి సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ సలహాదారులుగా నియమించిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్, తల్లుల సంఘం, అమ్మ ఆదర్శ కమిటీల సభ్యులు ఎర్ర శివరాజ్, కొడారి వెంకటేష్, ఆవుల వినోద్ కుమార్, బొక్క రాంబాయి, వగ్గు క్రిస్టోఫర్, పురుషోత్తం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
AJR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ పట్టణానికి చెందిన గుంజ చిన్న నరసింహ అకస్మాత్తుగా మరణించారని సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి వారిని పరామర్శించి నా AJRఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి , టీముని పంపించి ఆ కుటుంబ సభ్యులకి వారి యొక్క కుమారుడికి గుంజ రాంబాబు గారికి (AJR సేవ ఫౌండేషన్) ఎలిమినేటి జంగారెడ్డి సహకారంతో వారి దశదినకర్మ కు (5000వేల రూపాయలు ) అందజేశారు.. ఈ కార్యక్రమంలో వలిగొండ గ్రామ ప్రజలు AJR Team పాల్గొన్నారు.
తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

అరూరు గ్రామం వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు గొడుగు లక్ష్మయ్య మరణించడం జరిగినది .వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తుమ్మల నరసయ్య సేవా సమితి అధ్యక్షులు కసరబోయిన లింగయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మాజీ సర్పంచ్ చెమ్మయ్య వలిగొండ మండల కార్యదర్శ యాదయ్య కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఆవుల సత్యనారాయణ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేశా ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్ బత్తి వెంకటేశం మీసాల మచ్చి కాంగ్రెస్ నాయకులు కసర బోయిన నరసింహ వేముల ఎట్టయ్య ఎరుపుల స్వామి సత్తయ్య అబ్బాయి రాజు యాట రమేష్ నరాల మహేష్ జక్కుల లక్ష్మయ్య జిలకర బాల నరసింహ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వద్దని జాయింట్ కలెక్టర్ కు వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఆదాని గ్రూప్ ఏర్పాటు చేయబోయే అంబుజా సిమెంట్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వద్దని కోరుతూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా జాయింట్ కలెక్టర్ వెన్ షాలోమ్ కి రామన్నపేట అఖిలపక్ష పార్టీల నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
ద కంట్రీ సైడ్ పోర్ట్రైట్ సినిమాలో ప్రేక్షకుల హృదయాలను దోచిన నీలం నరేష్ నటన

17-10-2024 రోజునా ద కంట్రీసైడ్ పోర్ట్రైట్" సినిమా లో నీలం నరేష్ నటన ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది... సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి, రెండో అంతస్తు, పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా "ద కంట్రీసైడ్ పోర్ట్రైట్" తెలుగు డెమో ఫిల్మ్ ప్రదర్శన జరిగింది ... వచ్చి నన్ను మా టీమ్ ను ఆశీర్వదిఛీ నందుకు మీ అందరికి ధన్యవాదాలు ఇ సినిమా లో ని ముఖ్య ఉదేశ్యం నిరుద్యోగవల్ల పేదరికం ఏర్పడితే పేదరికం వల్ల దొంగతనం జరుగుతాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా.. దర్శకుడు సందీప్ జెండా అద్భుతంగా తీయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ,మైమ్ మధు నటుడు,అంజి వల్గమాన్ నటుడు దర్శకుడు, అజయ్ మకెనేపల్లి నటుడు దర్శకుడు, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలో 8వ వార్డులో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో డ్రైడే - ఫ్రైడే కార్యక్రమం

భువనగిరి జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఆధ్వర్యంలో దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వార్డులో అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో కలియతిరిగిన కౌన్సిలర్..నీటి నిల్వ ఉన్న వాటర్ సంపులు, కుండీలు, నీటి తొట్టిలను పరిశీలించారు. నిల్వ ఉన్న నీటిని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. విష జ్వరాలకు కారణమయ్యే…దోమల నివారణకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. వారం రోజులకు ఒకసారి నీటితొట్టిలను శుభ్రపర్చుకోవాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమం లొ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ వైజర్ Dr. భాషీరద్ధిన్ ఏ యన్ యమ్. తార. ఏ యన్ యం ప్రేమలత ఆశా వర్కర్ ఇందిరా జ్యోతి అంగన్వాడీ టీచర్ నాగమణి.సబితా గోపాల్. పావని విజయ. లక్ష్మి అనిత ఆశీఫ్ రమేష్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు
విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాలను ఉదృతం చేస్తాం : PDSU రాష్ట్ర కార్యదర్శిలు శ్రీకాంత్ ,నాగరాజు

రాష్టంలో ఉన్న విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యూ. రెండు రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శులు ఎస్.వి. శ్రీకాంత్, నాగరాజులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలేరు బస్టాండ్ నుండి దినేష్ గార్డెన్స్ వరకూ విద్యార్థులతో భారీ ర్యాలీ తీసి, అనంతరం పి.డి.ఎస్.యూ.జిల్లా అధ్యక్షులు ఆర్.ఉదయ్, మామిడాల ప్రవీణ్ ల అధ్యక్షతన అర్థ శతాబ్దోత్సవపు సభ నిర్వహించారు . ఈ సందర్భంగా శ్రీకాంత్, నాగరాజులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. జంపాల చంద్రశేఖర ప్రసాద్, రంగవల్లి, మారోజు వీరన్న, కొలనుపాక ప్రాంతానికి చెందిన కోలా శంకర్ లాంటి ఎందరో అమరవీరుల త్యాగాలతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతూ, ఎన్నో అక్రమ నిర్బందాలను కేసులను భరిస్తూ ప్రభుత్వాలను ఎదురిస్తూ విద్యార్థులకు అండగా నిలిచిందనీ, సొంత రాష్టం తెచ్చుకున్నా విద్యార్థుల జీవితాలు మాత్రం మారలేదని, 10ఏళ్ల బి.ఆర్.ఎస్. ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తే, మేం న్యాయం చేస్తాం, విద్యార్థుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10నెలలు గడుస్తున్నా విద్యార్థులను పట్టిచ్చుకోవడం లేదనీ, 6నెలలుగా గురుకుల హాస్టల్ అద్దె బకాయిలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు హాస్టళ్లకు తాళాలు వేస్తే విద్యార్థులను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని, 3ఏళ్లుగా ఇంటర్ విద్యార్థులకు, 4ఏళ్లుగా డిగ్రీ విద్యార్థులకు ఫీ-రీఎంబెర్స్ మెంట్స్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ప్రైవేటు డిగ్రీ యాజమాన్యాలు సమ్మెకు దిగాయని, స్కాలర్ షిప్పులు రాక యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బడ్జెట్లో విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని పి.డి.ఎస్.యూ. గా డిమాండ్ చేసినా కేవలం 7శాతం కేటాయించి, విద్యార్థులకు అన్యాయం చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ కార్పొరేట్ స్కూళ్లకి కొమ్ముకాస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్పులను వెంటనే విడుదల చేయాలనీ, శ్రీ చైతన్యా నారాయణ లాంటి కార్పొరేట్ సంస్థల ఫీజుల నియంత్రణకై చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించాలనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా రంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 24న ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర స్థాయి అర్థ శతాబ్దోత్సవ సభకు జిల్లా నుండి పూర్వ ప్రస్తుత విద్యార్థులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు ఆర్.జనార్దన్, ఎం.భిక్షపతి,పూర్వ అధ్యక్ష కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ , సహదేవ్, తొలితరం పి.డి.ఎస్.యూ. నాయకులు పూల నాగయ్య, కడకంచి కిష్టయ్య, మంద సోమరాజు, గడ్డం సిద్ధులు, ప్రజా సంఘాల నాయకులు ఇక్కిరి శ్రీనివాస్, ఇ. కుమార్, పడాల శివ, కుమారస్వామి, బాలకృష్ణ, ఎం.మహేష్, ఆకుల కృష్ణ, మురళి, పరమేష్, ఇక్కిరి బీరయ్య, స్వేచ్ఛ, మధు, బర్మా బాబు, సిద్ధులు, సిహెచ్ రాజయ్య, నేరేడు స్వామి, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 27 28న పెద్దపల్లి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ను జపం చేయండి: AIYF జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

భువనగిరి: అక్టోబర్ 27,28 న పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరిగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఏఐవైఎఫ్ వర్క్ షాప్ కరపత్రికను విడుదల చేశారు. వలిగొండ మండల కేంద్రంలో అదేవిధంగా దుప్పల్లి గ్రామంలో ఏఐవైఎఫ్ కరపత్రం ఆవిష్కరించి ఈ సందర్భంగా *ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ* భారతదేశంలో యువజన సామర్థ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రధానంగా దేశంలో నిరుద్యోగ సమస్య అధికమయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కాలయాపన చేయడం మూలంగానే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవడం లేదని వారు విమర్శించారు. ఉపాధి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని వారు అన్నారు. పాలకులు ఎంతసేపటికీ ప్రైవేట్, కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలపైనే ఆధారపడటం ద్వారా దేశ ఆర్థిక సమతుల్యత సాధ్యం కాదని వారు అన్నారు. ఈ చర్యల మూలంగా దేశంలో గత 10సంవత్సరాలుగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని, దేశంలో రోజురోజుకూ నిరుద్యోగ సైన్యం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 ఇంటర్ కళాశాలల్లో 9 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 944 డిగ్రీ కళాశాలలో 6 లక్షల మంది విద్యార్థులు, 262 ఇంజనీరింగ్ కళాశాలలో ఒక లక్ష ఇరవై వేల మంది విద్యార్థులు, 200 పీజీ కళాశాలలో 20 వేల మంది విద్యార్థులు ఉన్నారని వీరిలో ప్రధానంగా ఉపకార వేతనాల మీదే ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు అని అన్నారు ఉన్నత విద్యారంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు న్యాయం చేయాలని 7700 కోట్ల కు పైగా బకాయిలు చెల్లించాలి డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ అంటూ ప్రైవేట్ కళాశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తున్నదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఎండి షాబుద్దీన్ మేడి దేవేందర్, మారోజు నరసింహ చారి, మెట్టు లక్ష్మీనారాయణ, కన్నబోయిన పృథ్వి, ఎల్లంకి చంద్రశేఖర్,వీరస్వామి,ఐలేష్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం ఏర్పాటు చేసే  హాని కలిగించే కాలుష్య భరితమైన కంపెనీని పూర్తి వ్యతిరేకిస్తూ మా ధర్మసమాజ్ పార్టీ నుండి త్రీవమైన తీవ్రమైన నిరసన తెలుపుతూ ఆ కంపెనీని రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకనగా దాని వలన ఏర్పడే విష వానికి వాయువుల వలమైన గాలి నీరు భూమి కాలుష్యం ఏర్పడుతుంది వాటి ద్వారా ప్రజలకు వివిధ రకాలైన శ్వాస గోస గర్భగోష మరియు అంగవైకల్యం వంటి అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి పంటల దిగుబడి తగ్గుదల ఏర్పడే అవకాశం ఉంది అదే విధంగా ధ్వని కాలుష్యం వలన ఈ చుట్టుపక్క ల ఉన్న గ్రామాలలోని మరియు పట్టణ కేంద్రంలో ఉన్న స్కూల్స్ మరియు హాస్పటల్ కి చాలా ఆరింతరాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఈనెల 23న ఏర్పాటు చేసే ప్రజాభిప్రాయం సేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ అంబుజా ఆదానే కంపెనీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం ధర్మ సమాధి పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ మండల అధ్యక్షుడు:బందెల అశోక్ గోవర్ధన్ మల్లేష్ నరేందర్ రవి నవీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.