రామన్నపేటలో జరిగిన పర్యావరణ పరిరక్షణ వేదిక సదస్సులో పాల్గొన్న ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మహారాజ్
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యావరణ పరిరక్షణ వేదిక రామన్నపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబుజా ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన సదస్సులో ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మహారాజు గారు పాల్గొని అబద్ధాల ఆదాని - అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ఉన్నటువంటి మన రామన్నపేట ప్రాంతంకి అతి దగ్గరలో ఈ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంమరియు అదేవిధంగాభూగర్భ జలాలు తగ్గిపోవడం ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు చుట్టుపక్కల 10,15 కిలోమీటర్లమేర ఉన్నగ్రామాల్లోని ప్రజలందరికీఊపిరితిత్తుల క్యాన్సర్,మరియు చెవుడు మరియు వాటర్ కంటామినేషన్ ద్వారా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దీనిని కచ్చితంగా మన ప్రాంతం నుండి తరిమే విధంగా ఈనెల 23వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణకు రామన్నపేట ప్రాంతం చుట్టుపక్కలఅన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరడం జరిగింది.DSP ఆధ్వర్యంలో వ్యతిరేకంగాపోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రామన్నపేట మండల అశోక్ మహారాజ్ మల్లేష్ గోవర్ధన్ నరేందర్తదితరులు పాల్గొన్నారు.

PDSU 50 ఏళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న ఆలేరులో , 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభలను ప్రస్తుత,పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ. పూర్వ జిల్లా అధ్యక్షు,కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 18న ఆలేరులోని దినేష్ గార్డెన్స్లో జరిగే పి.డి.ఎస్.యూ. అర్థ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయాలని ఆలేరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాగరాజు, కుమార్ లు మాట్లాడుతూ ఉస్మానియాలో 1972లో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. గత 50ఏళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ, విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపుకోసం, స్కాలర్ షిప్పుల విడుదల కోసం, ఆలేరులో ఐ.టి.ఐ. కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని, తెలంగాణ ఉద్యమంలో పి.డి.ఎస్.యూ. ముఖ్య పాత్ర పోషించిందనీ, ఆ పోరాటాల్లో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించిందని, కోలా శంకర్ లాంటి నాయకులు తన విలువైన ప్రాణాలు సైతం అర్పించారనీ, తన 50ఏళ్ల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ నెల 18న ఆలేరులో జిల్లా సభ, 24న ఓయూలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నామనీ, ఈ సభకు ప్రస్తుత పూర్వ విద్యార్థులు , మేధావులు హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. నాయకులు ఆర్.ఉదయ్, ప్రవీణ్, ఇ. శ్రీనివాస్, ఇ. కుమార్, బాలకృష్ణ, ఆకుల కృష్ణ, మహేష్, కుమారస్వామి, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి: AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

తెలంగాణలో విద్యా శాఖ మంత్రిని నియమించాలి*

*రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న డిగ్రీ మరియు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ లను విడుదల చేయాలి*

*తెలంగాణ లో అద్దె భవనాలలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు 8 నెలల అద్దెను వెంటనే విడుదల చేయాలి*                                  *ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్*

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అద్దె భవనాలకు కిరాయి చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు
గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్దిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంధు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు
ఇప్పటికే విపరీతమైన వర్షాలు,వరదలు కారణంగా సెలవులు రావడం వలన ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు వెనుకబడ్డారని మళ్లీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు నిరవధిక బంద్ చేస్తే విద్యార్థులకు తరగతుల నిర్వహణ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతుందని దీనివల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలను మొత్తం ఒకేసారి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు
ఆనాటి పిసిసి అధ్యక్షులు నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు
వెంటనే ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యజమాన్యాలతో చర్చలు జరిపి వారికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అదేవిధంగా రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుతున్నటువంటి సాంఘిక సంక్షేమ , మహాత్మ జ్యోతిబాపూలే,ఎస్ టి , మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని ఆ భవనాలకు 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలకు తాళాలు వేసి నిరసన తెలియజేస్తున్నారని వారికి వెంటనే అద్దె చెల్లించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడంతోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని వెంటనే విద్యా శాఖ మంత్రి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని , రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అరూరు లో బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గా మాత పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆరూరు గ్రామంలో బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజా కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి గారు తుమ్మల శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ సెల్ చిలకమర్రి కనుక చారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపిటిసి బైక్ కానీ ముత్యాలు, పోలేపాక చంద్రయ్య సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ ఆరూరు గ్రామ గీత కార్మిక సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల సంతోష్ కుమార్ క్యా దారి శ్రీనివాస్ ఆవుల సత్యనారాయణ మాజీ ప్రైమరీ స్కూల్ చైర్మన్ ఆవుల అంజయ్య కాంగ్రెస్ నాయకులు బండార్ మైపాల్ రెడ్డి గురునాథ్ పల్లి మల్లేష్ అముద సాయిబాబా జక్కుల లక్ష్మయ్య జడ నవీన్ జీనుకల అశోక్ బోద్రబోయేన రాజు చిల్కమార్రి లక్ష్మణ్ బైకాని మల్లేష్ బొల్ల లింగాస్వామి కళ్లెం వీరాస్వామి లోతుకుంట నాగరాజుపాల్గొన్నారు తధానంతరం బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది
అరూరు శివాలయం పునః నిర్మాణ పనుల గురించి చర్చించిన మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి

వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అరూరు గ్రామంలో శివాలయం పునర్ నిర్మాణము గురించి మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి  మేస్త్రీలతో చర్చించి త్వరగా పూర్తిచేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు బండారు నరసింహారెడ్డి, వలిగొండ మండలం ఓబిసి సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ ,మాజీ సర్పంచ్ చెమ్మయ్య ,ఓరుగంటి స్వామి, రామచంద్రం, పోలేపాక నరసింహ, సుక్క రామచంద్రం ,బోగారం యాదయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయాలి : బుగ్గ ఉదయ్ కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు

తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం చదువుని దూరం చేస్తుందని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ నాయకులు బుగ్గ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను సకాలంలో విడుదల చేయకపోవడం వలన పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. విద్యార్థులు పూర్తిస్థాయి విద్యను అభ్యాసించిన తర్వాత వారి సర్టిఫికెట్స్ కోసం కళాశాలకు వెళ్లగా... ఫీజులు కట్టాలని ప్రవేట్ కళాశాలల యజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. నేటికీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు సుమారు 8200 కోట్ల రూపాయల స్కాలర్షిప్ లో పెండింగ్ లో ఉన్నాయన్నారు . గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో స్కాలర్షిప్ లు ఇవ్వక విద్యార్థులను ఇబ్బంది పెట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ ల గురించి మాట్లాడడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తే విద్యార్థులతో భారీ ఎత్తున ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు.
రామన్నపేట మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 67 ఏళ్లు ప్రయాణంలో సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్రంలోని ఈ పది సంవత్సరాలు కాలంలో సంఘం చేసిన కార్యక్రమాలను యాది చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు బాటలు వేసేందుకు ఈనెల 18న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ , ఎక్సైజ్ శాఖ మంత్రి, జూపల్లి కృష్ణారావు , బీసీ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం ఐఏఎస్ , పాల్గొంటున్నారు . ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కరపత్రం ఆవిష్కరణ చేస్తున్న *తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘo రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు  అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1957 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం గార్లలో ఆవిర్బవించింది. చెట్టుపై హక్కు నౌకరు నామ రద్దు ఎక్స్ గ్రేషియా పెన్షన్ తదితర హక్కులు పోరాడి సాధించుకున్నాం బొమ్మగాని ధర్మాభిక్షం, ఎస్ ఆర్ దాట్ల దేశిని, చిన్న మల్లయ్య, తొట్ల మల్సూర్, బైరు మల్లయ్య, పెరుమాళ్ళ జగనాదం, బోలగాని పుల్లయ్య లాంటి ఎందరో అమరవీరుల స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధించాము. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు నామకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బాండ్లపల్లి బాలరాజు మండల కార్యదర్శిపులిబిక్షం మండల అధ్యక్షుడు ఎర్ర రవీందర్ బాలగోని నరసింహ అంతటి సత్తయ్య బావుండ్లపల్లి సత్యం బోయపల్లి శ్రీశైలం కూనూరు వెంకటేశం భీమ గాని యాదయ్య ఆకిటి గణేశ తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారులకు నాణ్యత ప్రమాణాలు ముఖ్యమే: కొడారి వెంకటేష్ వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు

ఏదైనా వస్తువు కొనాలంటే దాని యొక్క నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా వినియోగదారుడు గమనించాలని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ కోరారు . సోమవారం "ప్రపంచ నాణ్యతా ప్రమాణాల దినోత్సవం" సందర్భంగా ఆయన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మన దేశంలో ఐ.ఎస్.ఐ మార్క్ (ISI Mark ), బి.ఐ.ఎస్ మార్క్ (BIS Mark), ఆగ్ మార్క్ (AG Mark), ఎఫ్ పి ఓ మార్క్ (FPO Mark) లాంటి ప్రభుత్వ సంస్థల పర్యవేక్షణలో వస్తువుల తయారీ మరియు నాణ్యతా ప్రమాణాలను ఆయన అన్నారు. ప్రతి వస్తువు యొక్క బాక్స్ లపై పై మార్కు లను చూసి కొనుగోలు చేయాలన్నారు. ప్రతి వినియోగదారుడు ఖర్చు పెట్టిన "డబ్భుకు తగిన నాణ్యమైన వస్తువులు పొందటం అనేది వినియోగదారుల హక్కు" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాల దినోత్సవం ను 1946 అక్టోబర్ 14 న ప్రారంభమై ప్రతి ఏటా జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్కెట్ లో కల్తీ, నకిలీ వస్తువుల తయారీ, రవాణా మరియు అమ్మకాలు పెరిగిపోయాయని , దీంతో అమాయక వినియోగదారులు ఆర్ధికంగా మరియు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు (1986, 2018) ఉన్నప్పటికీ, చాలా మందికి ఈ చట్టాలపై అవగాహన లేదని, ఒకవేళ వున్నా మనకు ఎందుకులే అని మౌనంగా ఉండిపోతున్నారని ఆయన అన్నారు. కొంతమంది వినియోగదారులు యూట్యూబ్ ల్లో వచ్చే వీడియోలు ఆధారంగా అమెజాన్ , ప్లిప్ కార్డ్ లాంటి ఆన్లైన్ సంస్థల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర సౌందర్య సాధనలను కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. వీటి లో ఎంత వరకు నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయో చెప్పలేమని, అందుకే నిపుణుల సలహాలు లేకుండా మందులు కొనకూడదని ఆయన సూచించారు . అదే విధంగా చర్మ సౌందర్య సాధానాల విషయంలో కూడా వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం, వస్తువుల నాణ్యతా ప్రమాణాల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, నకిలీ వస్తువులు అమ్మే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వినియోగదారుల హక్కులను, పాలకులు చిత్తశుద్ధితో కాపాడాలని ఆయన కోరారు.
జిల్లా కాంగ్రెస్ నాయకులు పూస బాలకిషన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన బందెల క్రిస్టఫర్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామం అభివృద్ది ప్రదాతలు పూస బాలకృష్ణ జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఇంద్రపాల నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బందెల క్రిస్టఫర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .ప్రజల బాగోగుల గురించి నిబద్ధత తో పనిగంగమ్మ తల్లి ఇంద్రాపాల ముత్యాలమ్మ తల్లి మరియు తల్లీ తండ్రుల దీవెనలతో మీరు నిండు నూరేళ్ళు సుఖ సoతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు.
కురెళ్ళ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గొడవలు, వాహనాలు దగ్ధం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్ళ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామంలోని గడి మైసమ్మ వద్ద సాయంత్రం 6 గంటలకు 30 నిమిషములకి పూజా కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బా షబోయిన ఉప్పలయ్య పూజ నిర్వహించుచుండగా మీరు మాజీ సర్పంచ్ కదా మీరు ఎలా పూజ నిర్వహిస్తారు మీరు కూడా ఇప్పుడు సాధారణ వ్యక్తి అని మారుపాక వెంకటేష్ అడుగగా నన్ను కింద పడేసినారు అడ్డుగా నా కుమారుడు రాగా వారిని కూడా కొట్టారని మారుపక వెంకటేష్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సర్పంచ్ తో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.