"ఆదిలాబాద్: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ సమీపంలో ఇవాళ అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమదాంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురు గాయపడగా.. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రక్త సంబంధికులు నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లా్రు."

బ్యాంకు లోన్లపై హైడ్రా సంచలన నిర్ణయం

ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా..

రాష్ట్రంలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతల్లోె జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్న హైడ్రా (HYDRA) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు రెండు రోజుల్లో బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ (HYDRA Chief Ranganath) సమావేశంకానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. బ్యాంకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. లీగల్ టీంను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. ఇటీవల కూల్చిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు.

జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టిన హైడ్రా బ్రేకుల్లేండా దూసుకెళ్తోంది. హైడ్రాకు ప్రభుత్వం కూడా హైపవర్స్‌ ఇచ్చేసింది. ఇప్పటి వరకు దాదాపు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. ఆక్రమణకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువును పరిశీలించగా.. వెంటనే హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి కూల్చివేతలు చేస్తున్నాయి. హై రీచ్ జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్ల తో కూల్చివేతలు సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీతో పాటు జీహెచ్‌ఎంసీ ఓఆర్‌ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు కొనసాగింది.

ఇటీవల కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. రెవెన్యూ, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించినట్టు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు.

అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు17 గంటలపాటు హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలు చేపట్టింది. ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలను కూల్చివేసింది. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు ఆనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. సుమారు 17 గంటల పాటు హైరిస్క్ ఆపరేషన్‌ను హైడ్రా కొనసాగించింది.

ల్యాబ్ టెక్నీషియన్ లకు గుడ్ న్యూస్ ‼️

- 2,030 మంది స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి పది రోజుల్లో..

- ఈ నెలాఖరుకల్లా ఫార్మాసిస్టుల సెలక్షన్‌కు కూడా..

- మొత్తానికి ఈ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖలో 4వేల పోస్టులకు నోటిఫికేషన్లు

- జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు

- 1,280 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

వైద్య ఆరోగ్యశాఖలో 1,280 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

2,030 మంది స్టాఫ్‌ నర్సుల భర్తీకి పదిరోజుల్లోపే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపాయి.

వీటితో పాటు మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి ఈ నెలాఖరుకల్లా మెడికల్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖలో దాదాపు 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం లభించింది. కాగా, వైద్యశాఖలోని స్టాఫ్‌నర్స్‌లు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు, ఫార్మసిస్టుల పోస్టులకు సెప్టెంబరులో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వం జాబ్‌ క్యాలండర్‌లోనే ప్రకటించింది.

నేడే మహాత్కరా ఘట్టం ‼️*

- యాదాద్రి థర్మల్ ప్లాంట్ 800 మెగావాట్ల యూనిట్ కు సింక్ చేయడానికి సిద్ధం

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్‌ చేయనున్నారు.

దాదాపు 72 గంటల పాటు విద్యుత్‌ ఉత్పాదన చేసిన తర్వాత ప్లాంట్‌ కమిషన్‌ కానుంది. ఆ తర్వాత గ్రిడ్‌కు ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్‌ను అందించనున్నారు.

ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పాదన సజావుగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయన్తున్నట్లు(సీవోడీ-కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌) ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఇక్కడే ఉంది.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రెండో యూనిట్‌ సింక్రనైజేషన్‌ అనంతరం ప్లాంట్‌ నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు.

ఘనంగా చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి

•మోడరన్ దోబిఘాట్ ఉపాధ్యక్షుడు యలిజాల శంకర్ ఆధ్వర్యంలో

నల్లగొండ పట్టణంలో వీటి కాలనీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మోడరన్ దోబిఘాట్ ఉపాధ్యక్షుడు యలిజాల శంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి 39వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా యలిజాల శంకర్, దూదిగామ నాగరాజు గార్లు మాట్లాడుతూ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ గారని,

తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కనబరిచిన ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. ఐలమ్మ ప్రేరణతో అనేక మంది మహిళలు నాటి భూ పోరాటానికి ముందుకు వచ్చారని గుర్తు చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ పట్టణ రజక నాయకులు ఓరుగంటి ఐలయ్య, తుపాకుల ప్రసాద్, యలిజాల సంతోష్ కుమార్, మారగోని సుధాకర్, దూదిగామ శంకర్, భూతరాజు రాంబాబు, చిలకరాజు రాజు, పగిల్ల సైదులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి

గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.

తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు. సోమవారం గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో తక్షణమే కులగణన జరిగే విధంగా ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ సమగ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి గత 8 నెలలుగా రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ కులగణన పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.

కులగణనపై అఖిలపక్ష పార్టీలు, వివిధ ప్రజా స్వామిక సంఘాలు, ఉద్యమ సంఘాలు ముక్తకంఠంతో కులగణనను చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించడం చాలా దారుణమన్నారు. బీసీ కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల వ్యతిరేకతతో కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశాడని కెసిఆర్ బాటలోనే మేము కూడా నడుస్తామని కాంగ్రెస్ అనుకుంటే బీసీల అగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.

బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని లేకుంటే వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనన నిర్వహించి బీసీలకు జనాభా ప్రకారం వాటా దక్కాలని మాట్లాడుతుంటే ఆయన బొమ్మతో గెలిచిన ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై మీన మేషాలు లెక్కబెడుతుందన్నారు. రాష్ట్రంలో కులగణనను చేయకుండా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతిష్టకు బంగం కలిగే విధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.

ఈ పూజా కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు విశ్వనాధుల శివకుమార్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యువజన సంఘం నాయకులు కోట రమణ, వీరమల్ల ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు...

ఈ మేరకు AICC ప్రధాన కార్యదర్శి కె.సీ వేణుగోపాల్ ఒక‌ ప్రకటన విడుదల చేశారు.

Streetbuzz News

తెలంగాణ తల్లి దొరల కోటలో బందీకావొద్దు

ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవాళ సెక్రటేరియెట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఇవాళ శుభ దినమని పేర్కొన్నారు. పదేళ్ల నుంచి తెలంగాణ తల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2004 కరీంనగర్‌లో తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత అనేక రకాలుగా వెనుక బడ్డారన్నారు. తెలంగాణ తల్లిని వెనక్కి నెట్టి వారే సర్వం అన్నట్లు గత పాలకులు వ్యవహరించారన్నారు. ముళ్ళ కంచె ఏర్పాటు చేసుకొని రాజ భోగం అనుభవించారన్నారు. అది ఒకప్పుడు ఘడీల భవనమని.. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవనమని పేర్కొన్నారు.

పదేళ్లు ముఖ్యమంత్రి , మంత్రులు ఎవరూ అందుబాటులో లేరని.. అసలు సచివాలయంలోకి సామాన్యులకు ఎంట్రీయే లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి సచివాలయం నిర్మించిన వాళ్లకు కోటి రూపాయలు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపొయారని రేవంత్ విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదురుగా పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సచివాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో కొంతమంది తమ కోసం ఆపారన్నారు. తెలంగాణ తల్లి అంటే దర్పం, పోరాట పటిమకు స్ఫూర్తి అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి దొరల కోటలో బందీ కావొద్దన్నారు.

రేవంత్ నీ పౌరుషం ఏమైంది.⁉️

- ఎంపి ధర్మపురి అరవింద్ కీలక వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇన్ని రోజులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిదని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) అన్నారు. గత పదేళ్లలో అసెంబ్లీ ఇలా జరగలేదని చెప్పారు. తమ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని ప్రశంసించారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. రాద్దాంతం చేశారు కాబట్టే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుంచి బయట పడేశారని చెప్పారు.

రేవంత్ పౌరుషం ఏమైంది.. గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు ఏమైంది. కమిషన్లు వేయడం కాదు.. మీ చిత్త శుద్ధి నిరుపించుకోండి. రాష్ట్రానికి చీడ పురుగులా బీఆర్ఎస్ ఉండేది..దాన్ని వదిలించుకున్నారు.

గులాబీ పార్టీను భూస్థాపితం చేయాలి. బీఆర్ఎస్ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ బీజేపీలో ఐక్యత ఉంది. రైతు రుణమాఫీపై డేటా తీసుకుని ఆ తర్వాత స్పందిస్తాం. రుణ మాఫీ ఒకటే కాదు ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రైతులు, మహిళలు, యువకులు సీఎం రేవంత్‌ను విమర్శిస్తున్నారు’’ అని అరవింద్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ గురించి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయనేది అనవసరం. బడ్జెట్ దేశానికి మంచి చేసేలా ఉందని మేధావులు చెబుతున్నారు. తెలంగాణలో గడిచిన పదేళ్లలో రూ. 31 వేల కోట్ల రైల్వే పెట్టుబడులు పెట్టారు.

తెలంగాణ బడ్జెట్‌లో మైనార్టీలకు బడ్జెట్ పెంచారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ తగ్గించారు. అధ్యక్ష పదవికి మా పార్టీలో రేసులు ఉండవు. నాకు ఇస్తా అంటే నన్ను పిలిచి మాట్లాడుతారు.. అప్పుడు నా సమాధానం పార్టీ అధిష్ఠానానికి చెబుతా. బీజేపీ అధ్యక్ష పదవి హిందు సామాజిక వర్గానికి ఇస్తే బావుంటుంది. భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ హిందువే. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనేది నా అభిప్రాయం అడిగితే పార్టీకి చెప్తా’’ అని అరవింద్ పేర్కొన్నారు.

బండి సంజయ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ‼️

తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

బండి సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని అన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే భరించలేకపోతున్నారా...? అని నిలదీశారు. రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

 మంత్రి పొన్నం ప్రభాకర్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులకు ఇంతపెద్ద రుణమాఫీ జరుగుతుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ధ్వజమెత్తారు. దేశంలోనే ఒక రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ అమలు చేశారా అని ప్రశ్నించారు.

భారీ వర్షాలకు పంట నష్టపోయిన గుజరాత్ రైతులకు వందల కోట్లు కేటాయించిన మీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పంటలు నామా రూపాలు లేకుండా కొట్టుకుపోతే కనీసం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా....? 

రైతులకు నల్ల చట్టాలను తెచ్చి అణిచివేసే ప్రయత్నం చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు.. గుజరాత్‌లో భారీ వర్షాలు కురిస్తే రూ.100ల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగం భారీ వర్షాలకు పంట నామ రూపలేకుండా పోతే పంట నష్ట పరిహారం ఒక్క రూపాయి అయినా విడుదల చేశారా అని ప్రశ్నించారు.