కీచక ఆర్.ఎం.పి సమీర్ అరాచకాలు అరికట్టాలి న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేయాలని ధర్నా

-కచక ఆర్ఎంపిని ఫోక్సో కింద అరెస్టు చేయాలి 

-ఆస్పత్రిని సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు జరపాలి 

-ఆ నలుగురు కీచకులు ఎవరో బహిర్గతం చేయాలి 

-ఆర్.ఎం.పి సమీర్ ను కఠినంగా శిక్షించాలి 

-బాధిత మహిళలకు ప్రజా సంఘాలు,మహిళలు, మహిళా సంఘాల మద్దతు 

-ఆస్పత్రి ముందు రోడ్డుపై బైఠాయించి భారీ రాస్తారోకో 

-పోలీసులు, డి ఎం హెచ్ ఓ, కలెక్టర్లకు ఫిర్యాదు 

-న్యూ లైఫ్ ఆస్పత్రి సీజ్ చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్న మహిళలు

ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ఆర్.ఎం.పి మహమ్మద్ సమీర్ పై ఫోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించి ఆసుపత్రిని శాశ్వతంగా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం బాధిత మహిళ, అమే కుటుంబ సభ్యులు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎత్మతాపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి స్వప్న అనే మహిళ నాగర్ కర్నూల్ పట్టణంలోని సహస్తా న్యూ లైఫ్ ఆసుపత్రికి జ్వరంతో బాధపడుతూ బుధవారం వచ్చింది. ఆస్పత్రిలో ఉన్న ఆర్ఎంపి వైద్యుడు మహమ్మద్ సమీర్ మహిళను పరీక్షిస్తూ జ్వరం ఎప్పుటి నుంచి వస్తుందని మాటల్లో పెట్టి ఎంతమంది పిల్లలు అని... వివాహమై ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాడని పిల్లలు కాలేదని చెప్పడంతో నీ భర్త వల్ల పిల్లలు పుట్టరు నా వద్దకు మూడు నెలలు వరుసగా వచ్చి నాతోపాటు నా ముగ్గురు స్నేహితుల వద్ద సంసారం చేస్తే మూడు నెలల్లో గ్యారంటీగా గర్భం వస్తుందని చెప్పడంతో తనతో పాటు ఆమె తల్లి బాధితురాలు ఇద్దరు కలిసి ఆర్ఎంపి వైద్యుడు సమీర్ ను నిలదీయగా మెడికల్ షాప్ నిర్వాహకులు తప్పించినట్లు బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఐకి ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంటికి వెళ్లి విషయం భర్త నరేందర్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులకు కన్నీళ్ల పర్యంతమై చెప్పడం జరిగింది. గురువారం రెడ్డి సేవా సమితి బాధ్యులతో పాటు మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. 

 ఆస్పత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదు

నాగర్ కర్నూల్ పట్టణంలోని సమస్త న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేది లేదని బాధితులతో పాటు ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు భీష్మించు కూర్చున్నాయి. కేసు నమోదు చేస్తున్నామని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య చెప్పిన సీజ్ చేసే వరకు కదిలేది లేదని ధర్నాతో పాటు రాస్తారోకోను పెద్ద ఎత్తున కొనసాగించారు.

 న్యూ లైఫ్ ఆస్పత్రి పై సమగ్ర దర్యాప్తు జరపాలి

మహిళల పట్ల కీచకంగా వ్యవహరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న న్యూ లైఫ్ ఆసుపత్రి తో పాటు ఆస్పత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ పై సమగ్ర విచారణ జరపాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మహిళ లు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఆస్పత్రిలో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కానీ పోలీసు శాఖ అధికారులు కానీ పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు ఈ ఆస్పత్రి పై ఆరోపణలు వచ్చి పలుమార్లు సీజ్ చేసిన తిరిగి ఆసుపత్రిని కొందరు రాజకీయ నాయకుల పలుకుబడితో తెరిపించడం జరిగిందని ఇలాంటి అక్రమార్కలు, దుర్మార్గులు నిర్వహిస్తున్న ఆసుపత్రులను పట్టించుకోవాలని అధికారులను కోరారు.

 -అది ఆసుపత్రి యా... వ్యభిచార కూపమా

న్యూ లైఫ్ ఆస్పత్రి పై గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలు వస్తున్న పట్టించుకోవడంలేదని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పటికే అనేకమంది ఈ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోతే వారికి డబ్బుతో వెలకట్టి ఏలాంటి కేసులు కాకుండా చూసుకుంటున్నారని పలువురు విమర్శించారు. ఇటీవలే ఒక యువకుడికి సదరు ఆర్.ఎం.పి సమీర్ అతని ఫామ్ హౌస్ లో కిడ్నీ సంబంధిత వ్యాధికి నాటు వైద్యం చేసి అతని ఆరోగ్యం తీవ్రస్థాయిలో క్షీణించడానికి కారణం కాగా అతని కి కూడా కొందరు మధ్యవర్తుల సహాయంతో డబ్బులు ఇచ్చి పత్రాలు రాసుకుని తన ఆసుపత్రిని కాపాడుకున్నాడని పలువురు విమర్శించారు. ఒక మహిళను సంతానం కలగడానికి సమీర్ మాట్లాడిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. పిల్లలు కలగడానికి అనేక రకాల వైద్య సాంకేతికత ఉందని దాని ఆధారంగా పిల్లలు కలుగుతారా అని బాధిత మహిళ అడిగితే తనతో పాటు మరో ముగ్గురి స్నేహితుల వద్ద సంసారం చేస్తే కలుగుతారని నిర్లజ్జగా చెప్పడం బట్టి చూస్తే న్యూ లైఫ్ ఆసుపత్రిలో వైద్యం కంటే వ్యభిచారమే జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ నలుగురు ఎవరో డాక్టర్ సమీర్ ను విచారించి పోలీసులు అధికారులు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు.

 ఆస్పత్రిని మూయించిన సీఐ కనకయ్య

న్యూ లైఫ్ ఆసుపత్రి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ ను అరెస్టు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆందోళన కారులు పట్టుబట్టడంతో సీఐ కనకయ్య వైద్యశాఖ అధికారులను సంప్రదించారు. డి ఎం హెచ్ ఓ అందుబాటులో లేరని అధికారులకు సమాచారం అందించి 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆసుపత్రిని మెడికల్ షాపును బంద్ చేయించారు. 

 -న్యూ లైఫ్ ఆసుపత్రి ఆర్.ఎం.పి సమీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు

న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపి సమీ పై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడమే కాకుండా రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సభ్యుల కు ఫిర్యాదు చేసి వారిని నాగర్ కర్నూల్ కు రప్పించి ఈ దురాగతాలను బహిర్గతం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సీఐ కనకయ్య హామీతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలోబిజెపి నాయకులు జిల్లా జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్, రాజేష్ రెడ్డి, లోహిత్ రెడ్డి, ఆంజనేయులు, ఎలిమి రాము, బొట్టు శ్రీను, శకుంతల, బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న. జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణ

సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు అశోక్, రామయ్య, సురేష్

సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు వార్ల వెంకటయ్య, శివ, గోపి చారి,టిఆర్ఎస్ నాయకులు మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, లింగారెడ్డి,రెడ్డి సేవా సమితి సభ్యురాలు దొడ్ల ఇందుమతి, దొడ్ల రాధారెడ్డి, శకుంతల, నారాయణరెడ్డి, సుధాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు హబీబ్ తదితరులు పాల్గొన్నారు

ఖాళీ అవుతున్న వైసిపి జగన్ కు దెబ్బ మీద దెబ్బ షాక్ మీద షాక్ ఇస్తున్న వైసిపి ప్రముఖ నేతలు

పార్టీని వీడుతున్న ప్రముఖులు 

ఇప్పటికే పలువురు కీలక నేతలు రాజకీయ సన్యాసం 

అయోమయంలో వైసిపి శ్రేణులు 

మరికొంతమంది అజ్ఞాతం.. మరికొంతమంది సమయం చూసుకుని అవకాశం కోసం ఎదురు చూపులు. మరికొంతమంది ఇతర పార్టీలోకి చేర్చుకునే మార్గం లేక మౌనం. 

జగన్ పై ఆయన పాలనపై విరక్తి చెంది ఇక వైసిపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, జగన్ ఇక ఈ జన్మలొ మరోసారి సిఎం కాలేడని, వైసిపి ఇక సమాధి కానుందని భూస్థాపితం కానున్న వైసిపిని వదలి మరో మార్గాలు వెతుకుంటున్న ప్రముఖ నాయకులు 

ఇటీవల పరిణామాల్లో జగన్ అనుసరిస్తున్న వింత వైఖరిపై విసిగి పోతున్న వైసిపి అభిమానులు. 

రానున్న కాలంలో మరింత దిగజారే డామేజి స్థాయికి జగన్ ఇమేజి.. 

జగన్ పై సొంత పార్టీలో సొంత అభిమానులు నాయకులులో పెరుగుతున్న వ్యతిరేకత విరక్తి పుట్టిస్తున్న జగన్ నైజం 

కాంగ్రెస్ లో విలీనం దిశగా పావులు.. అడ్డుగా ఉన్న షర్మిల. ఫలితంగా జాప్యం అవుతున్న విలీన ప్రక్రియ 

జగన్ ను ఇక జనం నమ్మరు అని, అతను పాలనకు పనికిరాడని పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్న వారిలో ఇలా ఉన్నారు 

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస బేటీలు

 ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి 

 జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను 

 ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

 పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య 

 దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 

 పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

ఇంకా పలువురు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు 

చేసిన అవినీతి స్కాంలతో జగన్ జైలుకు వెళ్తే.. పార్టీకి దిక్కు ఎవరంటూ నాయకుల్లో అంతర్మధనం.. వైసిపి ని వీడి సొంత దారులు వెతుక్కుంటున్న నాయక గణం

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్

గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న డాన్స్ మాస్టర్ జానీ ని హైదరా బాద్ ఎస్ఓటీ, పోలీసులు బెంగళూరులో ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు...

ఓ మహిళా డాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడి పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ ఈ మేరకు ఆయనను హైదరాబాద్‌కు తీసుకొచ్చేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేసు నమోదైన నాటి నుంచి జానీ మాస్టర్ నెల్లూరుకు పారిపోయాడని, హైదరాబా ద్ నగరంలోనే ఓ స్నేహితు డి ఇంట్లో తలదాచుకుంటు న్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. 

అయితే, ఆయనను వెతికేందుకు మొత్తం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. అలాంటి వార్తలకు చెక్ పెడుతూ.. ఇవాళ సైబరా‌బాద్ పోలీసులు జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతోనే ఆయన గతంలో 6 నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్లుగా తెలుస్తోంది...

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది, మూడు నెలల్లో పూర్తి

యాదాద్రి ఆలయం సమీపంలో భక్తుల సౌకర్యార్థం 64 మీటర్లతో స్టీల్ లింక్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇది దేశంలోనే రెండో అతిపెద్దదని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మెకలై స్టీల్‌తో ఈ బ్రిడ్జి నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి వరకు కేవలం ఎగ్జిట్‌ ఫ్లైఓవర్‌ పైనే ఆధారపడి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ లింక్‌ బ్రిడ్జి ఉపశమనం కలిగిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. యాదాద్రి దేవాలయం సమీపంలో 64 మీటర్లతో నిర్మించనున్న ఈ వంతెనను రానున్న మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బంగారు తాపడం పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక యాదాద్రికి సమీపంలోని రాయగిరిలో దాదాపు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామన్నారు. రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వేద పాఠశాలకు గోవిందహరి ఛైర్మన్‌గా ఉంటారన్నారు.

ఇక తెలంగాణలోని మూడు టెంపుల్ టూరిజం సర్క్యూట్‌లలో త్వరలో భక్తులకు వీఐపీ దర్శనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటకశాఖ, దేవాదాయశాఖల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడు టెంపుల్‌ సర్క్యూట్‌లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్‌ కాగా.. మన్యంకొండ, శ్రీరంగాపూర్, అమ్మపల్లి, జోగులాంబ ఆలయాలు రెండో సర్క్యూట్‌లో.. డిచ్‌పల్లి ఆలయం, బాసర, కామారెడ్డిలోని ప్రముఖ ఆలయాలను మూడో సర్క్యూట్‌లో భాగం చేశామన్నారు. ఈ ఆలయాలను సందర్శించే వీఐపీ భక్తులకు వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్, గైడ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తులకు ఈ ఆలయాల్లో ఎక్కడికి వెళ్లినా ఆలయ జ్ఞాపికను అందించి సత్కరిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.

నేడు చలో ప్రజాభవన్‌.. రుణమాఫీ కాని రైతుల పిలుపు

రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు.

రుణమాఫీ అమలుకాని రైతులు పోరుబాట పట్టారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గురువారం చలో ప్రజాభవన్‌ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు, ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్న రుణమాఫీ కాని రైతులు సోషల్‌మీడియా వేదికగా ఏకమవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్‌మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌గా మారింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా రైతులంతా ఏకమై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 20న రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతులంతా తరలిరావాలని కోరారు. తమ పోరాటానికి అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. రుణమాఫీ కాలేదనే బాధ తో రైతులు చనిపోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఏకమవుతున్న రైతులు చలో ప్రజాభవన్‌ ఆందోళనకు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

ఎక్కడికక్కడ గ్రామాల వారీగా రుణమాఫీ కాని రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అయితే కఠిన నిబంధనలు, షరతులతో అర్హులైన రైతుల సంఖ్యలో కోత పెట్టారు. దాదాపు 70 లక్షల మంది రుణ గ్రహీతలు ఉండగా 42 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 23 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ప్రభుత్వం పేర్కొ న్న అన్ని అర్హతలు ఉన్న రైతుల్లో చాలామందికి ఇంకా మాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

జానీ మాస్టర్ అత్యాచార కేసులో కీలక పరిణామం.. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు..

ప్రస్తుతం టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఘటన వివాదస్పదంగా మారింది. ఈ క్రమంలో.. ఫెమస్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్.. లేడీ కొరియో గ్రాఫర్ ను అత్యాచారం చేసిన ఘటన రెండు తెలుగు స్టేట్స్ లలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ముంబైలో ప్రోగ్రామ్ కు వెళ్లినప్పుడు జానీ మాస్టర్ .. లాడ్జీలో యువతిపై బలవంతంగా అత్యాచారం చేశాడని కూడా ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి తన పట్ల జానీ మాస్టర్ ఏ విధంగా వేధించాడో అన్ని విషయాలను పోలీసులకు ఫిర్యాదులో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జానీ మాస్టర్ పై.. హైదరాబాద్ పోలీసులు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

లేడీ కొరియో గ్రాఫర్.. తనపై జానీ మాస్టర్ అత్యంత క్రూరంగా, అత్యాచారం చేశాడని కూడా కన్నీళ్లుపెట్టుకుంది. తన కోరిక తీర్చకుంటే.. ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని, యువతిని లొంగదీసుకున్నాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం..నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలో దిగినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ దగ్గర ఒక యువతికి.. 2017 లో పరిచయం ఏర్పడింది.

ఒక డ్యాన్స్ షోలో..సదరు యువతి మంచి ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు యువతి 2019 లో జానీ మాస్టర్ టీమ్ లో ఆమె చేరింది. ఒక ప్రొగ్రామ్ కోసం ముంబైకి వెళ్లినప్పుడు..యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట రాయదుర్గం పోలీసులు జీరో ఎఫైఐఆర్ నమోదు చేసి, నార్సింగ్ పీఎస్ కు కేసు బదిలీచేశారు.

జానీ మాస్టర్ భార్య కూడా.. వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ ను జనసేన సస్పెండ్ చేసింది. కొరియో గ్రాఫర్ సంఘం కూడా ఆయనను తాత్కలికంగా సభ్యత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళ సంఘాలు, తెలంగాణ మహిళ కమిషన్ కు కూడా.. సదరు ఘటనపై ఫిర్యాదు చేశాయి. బీజేపీ మహిళ మోర్చా సైతం.. ఈ ఘటనను ఖండించింది. ఇదిలా ఉండగా.. అల్లుఅర్జున్ బాధిత కొరియోగ్రాఫర్ కు అండగా నిలిచారని తెలుస్తోంది. తన మూవీస్ లో కొరియో గ్రాఫర్ గా యువతికి అవకాశంఇస్తానని కూడా ప్రకటించారు.

మళ్ళీ వర్షాల హెచ్చరిక పంపిన వరుణుడు!

ఋతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

సెప్టెంబర్ 20వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.

సెప్టెంబర్ 21న ఈ జిల్లాలలో వర్షాలు

ఆపై సెప్టెంబర్ 21వ తేదీన కూడా వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

సెప్టెంబర్ 22వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

సెప్టెంబర్ 21వ తేదీన కూడా ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ కూడా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. అయితే సెప్టెంబర్ 22వ తేదీన ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవని పేర్కొంది.

ఇక ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం చూసినట్లయితే సాయంత్రం వేళలలో కానీ, రాత్రి సమయంలో కానీ నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 15వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం అవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్పటివరకు రాష్ట్రంలో అనేక చోట్ల అడపా దడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

'వన్ నేషన్ వన్ ఎలక్షన్' కు మోడీ మంత్రివర్గం ఆమోదం

వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఈరోజు మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ మానత్ కోవింద్ చైర్మన్ గా ఉన్న కమిటీని ఏర్పాటు చేశారు. ఈరోజు మోడీ మంత్రివర్గానికి కోవింద్ తన నివేదికను అందించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ నివేదికపై కేబినెట్‌ సమావేశంలో చర్చించి, ఆ తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ఏడాది మార్చిలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ 'ఒకే దేశం ఒకే ఎన్నిక'కు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక సమర్పించింది.

ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం.

మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం హోంమంత్రి అమిత్ షా ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అంటూ పెద్ద ప్రకటన చేశారు. మోదీ ప్రభుత్వం ఈ హయాంలో ‘ఒక దేశం ఒకే ఎన్నికలు’ అమలు చేస్తుందని షా చెప్పారు. గతంలో బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ అనే హామీని చేర్చింది.

ఇంతలో, గత నెలలో తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' అని గట్టిగా వాదించారు మరియు తరచూ ఎన్నికలు దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని వాదించారు. ఎర్రకోట ప్రాకారంపై నుంచి మోదీ ప్రసంగిస్తూ.. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికల కోసం దేశం ముందుకు రావాలి’ అని ప్రధాని మోదీ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు సాక్షిగా ఎర్రకోట మరియు జాతీయ త్రివర్ణ పతాకం. జాతీయ వనరులను సామాన్యులకు వినియోగించేలా చూడాలని పార్టీలను కోరిన ఆయన, 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' కలను సాకారం చేసేందుకు ముందుకు రావాలన్నారు.

అంతకుముందు మార్చిలో, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' అవకాశాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 2 సెప్టెంబర్ 2023న ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను ఈ ఏడాది మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదికలో రానున్న కాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిఫార్సులు చేసింది. 191 రోజుల్లో తయారు చేసిన 18,626 పేజీల నివేదికలో 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను కమిటీతో పంచుకున్నాయని, అందులో 32 రాజకీయ పార్టీలు 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'కు మద్దతుగా ఉన్నాయని పేర్కొంది. "కేవలం 15 రాజకీయ పార్టీలు మినహా, మిగిలిన 32 పార్టీలు ఏకకాల ఎన్నికల విధానాన్ని సమర్థించడమే కాకుండా, పరిమిత వనరులను ఆదా చేయడానికి, సామాజిక ఐక్యతను కొనసాగించడానికి మరియు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ఎంపికను అనుసరించాలని గట్టిగా వాదించాయి."

అదనంగా, లా కమిషన్ 2029 నుండి మూడు అంచెల ప్రభుత్వం, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు మరియు మునిసిపాలిటీలు మరియు పంచాయతీల వంటి స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను సిఫారసు చేయవచ్చు. నిరవధికంగా మెజారిటీ రాని పక్షంలో ఆయన సభలో అవిశ్వాస తీర్మానం లేదా ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు సిఫారసు చేయవచ్చు.

సముద్రమార్గంలో విదేశాలకు పారిపోయిన గనుల దొంగ APMDC మాజీ ఎండీ వెంకటరెడ్డి

చెన్నై నుంచి కుటుంబసభ్యులతో సహా విదేశాలకు పరారైనట్లు గుర్తింపు

కోస్ట్ గార్డ్ లో పనిచేసిన అనుభవంతో షిప్‍లో విదేశాలకు వెళ్లినట్లు గుర్తించిన ఏసీబీ

వెంకటరెడ్డి ఏ దేశానికి వెళ్లారో గుర్తించేందుకు ప్రయత్నాలు

త్వరలో రెడ్‍కార్నర్ నోటీసు ఇవ్వనున్న అధికారులు

సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే విదేశాలకు వెళ్లినట్లు గుర్తింపు

తమ అక్రమాలను కూటమి ప్రభుత్వం వెలికితీస్తుందనే భయంతో ముందే వెంకటరెడ్డి మాస్టర్ ప్లాన్

జమ్మూ & కాశ్మీర్లో తొలి విడత ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక సందేశం..

జమ్ముకశ్మీర్‌లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు.

కాగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులు “పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ”ను జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.