VijayaKumar

Sep 11 2024, 19:17

వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగంలో ఘనంగా ఓరియంటేషన్ డే వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 11 యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం లో గల వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఓరియంటేషన్ డే ను యాజమాన్యం ఘనంగా నిర్వహించడం జరిగింది. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్, కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ వాత్సల్య కళాశాలలో గత 24 సంవత్సరాలుగా చక్కని సాంకేతిక విద్యను అందించి ఎంతోమంది గొప్ప ఇంజనీర్లను అందించామని చాలామంది అధ్యాపకులు దశాబ్దాలుగా కళాశాల అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారని అన్నారు. మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఉద్దేశించి కళాశాలలో చక్కటి సాంకేతిక సదుపాయాలు చాలా అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల సలహాలతో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని ప్రాంగణ నియామకాలు పొందాలని, విదేశాలలో విద్యా అవకాశాలు పొందాలని సూచించారు. వాత్సల్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ దరిపల్లి అనంత రాములు గారు 2001 వ సంవత్సరంలో స్థాపించిన ఈ విద్యాసంస్థ ఎన్నో వేలాదిమంది జీవితాలకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యను నాలుగు సంవత్సరాలు సరైన మార్గంలో పయనిస్తూ సాంకేతిక విద్యను అభ్యసించాలని ఇందుకు అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని అన్నారు. క్రమశిక్షణ తోటి విద్యను అభ్యసిస్తే ఖచ్చితంగా పై స్థాయికి ఎదుగుతారని అన్నారు. ప్రాంగణ నియామకాలకు కావలసిన నైపుణ్యాల గురించి విద్యార్థులు వారి తండ్రులకు వివరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపల్ చక్కటి సమాధానం అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో అకాడమిక్ ఇంచార్జ్ గొల్లెపల్లి సురేష్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కక్కెర్ల రామకృష్ణ, గోగురి వెంకటేష్, సరుగు కరుణాకర్, బేతాళ నర్మద, గోధుమల ప్రతిభ, మధిర పరమేశ్వరి, రామాంజనేయులు, కొంక రేఖ, బత్తిని నర్మద, ముంజంపల్లి శృతి నాన్ టీచింగ్ స్టాఫ్ స్నాపిక, కావ్య కల్పన, గోపాలకృష్ణ, శంకర్, చంద్రశేఖర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 11 2024, 17:56

బునాది గాని కాలువను వెడల్పు చేసి ధర్మారం వరకు నీళ్లు అందించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్

బునాదిగాని కాలువను వెడల్పు చేసి ధర్మారం వరకు సాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. బుదవారం భువనగిరి మండల పరిధిలోని యర్రంబెల్లి, నమాత్ పల్లి, నందనం, అనాజిపురం గ్రామాలలో బునాదిగాని కాలువ పూర్తి చేయాలని, మోసినీళ్లకు బదులుగా ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ ఆయా గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు గడిచిన నేటికీ బునాదిగాని కాలువను పూర్తి చేయక పోవడం పాలకుల నిర్లక్ష్యం అనే విమర్శించారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి వెంటనే కాలువను పూర్తి చేసి సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ మూసీ జల కాలుష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి ఉన్నదని మూసీ జలాలతో పండిన పంటలు, కూరగాయలు, పాలు, చేపలు, కళ్ళు విషముగా మారుతున్న పరిస్థితి ఉన్నదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నీళ్లకు బదులుగా గోదావరి నది జలాలు బసవపురం రిజర్వాయర్ నుండి వడపర్తి కత్వ నింపి వాటి ద్వారా అన్ని గ్రామాలకు గోదావరి జిల్లాలు అందించడంతో ప్రజల బతుకులు మార్పులు వస్తాయని, ఆరోగ్యంగా జీవిస్తారని దీని కోసం ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొమటిరెడ్డి చంద్రారెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మూసీ ప్రక్షాళన - గోదావరి కృష్ణ జలాల సాధన వేదిక మండల కన్వీనర్ ఏదునూరి మల్లేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, అనాజిపురం నీటి సంఘం మాజీ చైర్మన్ గునుగుంట్ల శ్రీనివాస్, అనాజిపురం పాల సంఘం చైర్మన్ లక్ష్మి, సిపిఎం మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, ఎదునూరి వెంకటేశు, వడ్డే బోయిన వెంకటేష్ సుర్పంగ ప్రకాష్, ముచ్చపతి బాలయ్య, ఎండి. జహంగీర్, అయితరాజు కిష్టయ్య, ముత్యం ప్రకాష్, సిద్దిరాజు, కడారి కృష్ణ, తోటకూరి మల్లేష్, బొల్లెపల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 11 2024, 16:28

రామన్నపేట: స్నేహితురాలి కుటుంబానికి అండగా స్నేహబలం

స్నేహితురాలి కుటుంబానికి అండగా స్నేహబలం - భర్త మరణాంతరం ఇబ్బందుల్లోకి వెలిన కుటుంబం - సొంత గూడులేక అద్దె ఇల్లే గతిలా....స్థితి - ఆర్ధిక సహాయం అందజేసి ఆదుకున్న స్నేహితులు స్నేహితురాలికి అండగా స్నేహితుల బలం చేకూరింది. భర్త మరణాంతరం ఇబ్బందుల్లోకి వెళ్ళిన కుటుంబాన్ని చిన్ననాటి స్నేహితులే ఆదరించారు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని బోగారం గ్రామానికి చెందిన గుర్రం పారిజాత, వారి భర్త నరేందర్ ఇటీవల కాలంలో అనారోగ్యం కారణంగా మరణించారు. భర్త మరణాంతరం భార్య పారిజాత, ఇద్దరు పిల్లలను కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా మారీ తీరని కష్టాల్లోకి వెళ్ళింది. విషయం తెలిసిన చిన్ననాటి స్నేహితులు స్పందించి అండగా ఉంటామని తెలిపి రూ.10000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేసి, అండగా ఉంటామని తెలిపారు. వారికి అండగా నిలిచిన స్నేహితులలో రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గాదె శోభారాణి, గోగు ఝాన్సీ రాణీ, రాపోలు హేమలత, కూరేళ్ళ నవనీత లు ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్న తన స్నేహితురాలి కుటుంబాన్ని ఆడుకోవడానికి ఎవరైనా ముందుకు వేస్తే 6302945122 ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా అందజేయగలరని కోరారు.

VijayaKumar

Sep 10 2024, 20:23

ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను జయప్రదం చేయాలి

ఈనెల 15వ తేదీ ఆదివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నల్లగొండ, సూర్యపేట జిల్లాలలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం కు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, 25 వేల రూపాయల పెన్షన్ తో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ, ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మండల అధ్యక్షులు మారగొని శ్రీనివాస్ గౌడ్, భువనగిరి నియోజకవర్గ అధ్యక్షులు జోగు అంజయ్య శీలం.స్వామి,. గంధమల్ల బాలయ్య, గంధమల్ల మల్లమ్మ, కదిరేని స్వామి, ఐటిపాముల పుష్ప, కన్నకంటి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 10 2024, 19:13

నేత కార్మికులకు 30 కోట్ల రుణమాఫీ... సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన చేనేత కార్మికులు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేతలకు అభయ హస్తం పథకం ద్వారా వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి వలిగొండ మండల చేనేత కార్మికులు క్షీరాభిషేకం చేశారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు రాపోలు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేతల కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ హ్యాండ్ లూం టెక్నాలజీ ద్వారా శిక్షణ ఇస్తూ ప్రతి విద్యార్థికి నెలకు 2500 స్టైఫండ్, చేనేతల అభివృద్ధి కోసం రూ" 200 కోట్లు, త్రిప్ట్ సేవింగ్ బకాయిల కోసం రూ" 90 కోట్లు, నేతన్నల రుణమాఫీ కోసం రూ" 30 కోట్లు ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డిగారికి చేనేత మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మరియు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరిగారు IIHT ఇనిస్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుని పెట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కృష్ణయ్య, కొండూరు భాస్కర్, గంజి నారాయణ, జెల్ల నందయ్య, ఆటిపాముల కుమార్, గంజి బాలనరసింహ, మిర్యాల వెంకటేశం, జెల్ల నరహరి, ఐటి పాముల మీనయ్య, దొంత శ్యాంసుందర్, పారిపెల్లి నరసింహ, విగ్నేష్, ఆంజనేయులు, రాజు, లింగస్వామి, ఈశ్వర్ మరియు తదితర చేనేత కార్మికులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 10 2024, 18:33

చాకలి ఐలమ్మనే తెలంగాణ తల్లి, చాకలి ఐలమ్మ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహా రూపంగా ప్రకటించాలి: ఎమ్ఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ

ఆత్మకూర్ (యం) మండల కేంద్రం లో చాకలి ఐలమ్మ 39 వ వర్థంతి సందర్బంగా గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం పెద్దలు ,అఖిల పక్ష నాయకులు , ప్రజా సంఘాల నాయకులు , జర్నలిస్ట్ నాయకులు, ఉద్యోగులతో కలసి ఘనంగా నిర్వహించి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీయ పక్షాన ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, పట్టణ నాయకులు గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ లు భాగస్వామ్యం అయ్యి ఐలమ్మ గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం ప్రత్యేకంగా మీడియా తో మాట్లాడుతూ ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు - యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆధిపత్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని మోస్తూ భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ దొరలను గడీలనుంచి ఉరికించిన వీరవనిత, తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని,పోరాటాన్ని, భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు, తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని కాపాడిన ఈస్వరాష్ట్ర ఆకాంక్షకు ఆయుషు పోసిన తెలంగాణతల్లి చాకలి ఐలమ్మ నే అని అందుకే ఎమ్మార్పీయస్ సూత్రప్రాయంగా చాకలి ఐలమ్మ త్యాగాన్ని,పోరాటాన్ని గుర్తిస్తూ ఈ తరానికి తన చరిత్రను చాటిచెప్పేందుకు మొట్టమొదటి సారిగా ఐలమ్మ గారి రూపమే సరిగ్గా లేని తరుణంలో చరిత్ర విస్మరణకు గురై ఆమె భౌతికరూపం కనుమరుగైన స్థితిలో ఏరూపంలో ఉన్నదో ఎవ్వరికీ కూడా తెల్వని సమయంలో "ఐలమ్మ పోరాట రూపాన్ని" సమాజానికి పరిచయం చేసింది దండోర ఉద్యమమే అని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆతల్లి స్ఫూర్తివంతమైన పాత్రను తెలియపరిచేలా 2003లొనే 'తల్లి తెలంగాణ' పుస్తకాన్ని రాసి చాకలి ఐలమ్మే మాకు తెలంగాణ తల్లి అని సగర్వంగా చాటిన చరిత్ర మందకృష్ణ మాదిగదే అని . మన మహానీయురాలి పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించింది, సిద్ధాంతాపరంగా తల్లి రూపాన్ని పీడితవర్గాల ఆత్మగౌరవ చైతన్య పోరాట ప్రతీకగా భావిస్తూ దండోరోద్యమ ఫ్లెక్సీలో ఐలమ్మ గారి చిత్రపటాన్ని పెట్టుకొని స్ఫూర్తిని ఇచ్చిన సంఘం దండోరే అని అన్నారు. అన్నిరంగాల్లో వెనుకబడిన తెలంగాణకు, మట్టి,వెట్టి బ్రతుకులు బ్రతికిన తెలంగాణకు, పోరాటం, తిరుగుబాటు, చైతన్యం కల్గిన తెలంగాణకు ప్రతిరూపంగా పట్టు చీరలు,బంగారు నగలు, కిరీటాలు పెట్టుకున్న రూపంలో ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా చిత్రీకరించి బొమ్మలు పెట్టి కొలుస్తుంటే పట్టుచీరలు, బంగారు నగలు, కీరిటాలు పెట్టుకున్న దొరసాని కాదు తెలంగాణ తల్లి..దొరలను గడిలా నుంచి ఉరికించిన వీరనారి చాకలి ఐలమ్మే "తెలంగాణ తల్లి" అని సంచలనాత్మక ప్రకటనతో తల్లి త్యాగాన్ని ఆచరణాత్మకంగా అమలు పరిచిన ఘనత, రజకులను,అన్నివర్గాలను చైతన్యం చేస్తూ ఆమె జయంతి,వర్ధంతిలను నిర్వహించే స్పృహను కల్గచేసింది పలు డిమాండ్లను పెట్టి ఆమె జీవిత చరిత్రను అందరికి తెలిసేలా చేసింది ఎమ్మార్పియస్ పోరాటమే అని అందుకు చాకలి ఐలమ్మ ని ప్రస్తుత ప్రభుత్వం "తెలంగాణ తల్లిగా" ప్రకటించి గౌరవించాలని,చాకలి ఐలమ్మ రూపాన్నే తెలంగాణ తల్లీ రూపంగా ప్రజల ముందుకు అధికారికంగా తీసుకురావాలని అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి,వర్ధంతిలను అధికారికంగా అన్నీ గ్రామాల్లో నిర్వహిస్తూ ఆమె పోరాట చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసెలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని, ట్యాంక్ బండ్ పై ఐలమ్మ గారి విగ్రహాన్ని నెలకొల్పుతూ ఆమె చరితను తెలంగాణ పోరాట చరిత్రగా లిఖిస్తూ కీర్తించాలని అదే అసలైన నివాళి అని గుర్తుచేస్తున్నామని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం అని ఆధిపత్యం,అణిచివేతలతో దొరల చేతుల్లో బందీగా మారిన తెలంగాణను విముక్తి చేసేందుకు దొరల గుండెల్లో సింహా స్వప్నమై నిలిచి తన ధైర్య సహసాలతో పోరాట పటిమతో దొరలను గడిల నుంచి ఉరికించిన చాకలి ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. అందుకు అణగారిన కులాలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తూ తెలంగాణలోని అన్నివర్గాలకు మేలు చేసే రాజ్యాన్ని ఆకాంక్షిస్తూ ఐలమ్మ త్యాగాన్ని స్మరిస్తూ..పోరాటాన్ని గుర్తుచేస్తూ సామాజిక ఉద్యమ జోహార్లు ప్రకటిస్తున్నాం..!! అని అన్నారు.

VijayaKumar

Sep 10 2024, 18:28

నీర్నెముల గ్రామంలోసాయిరాం యూత్ గణపతి కి ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో సాయి బాబా మందిరంలో సాయిరాం యూత్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహం వద్ద విగ్రహ విగ్రహ ధాత చిప్పలపల్లి ఉపేందర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు,రైతులు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటూ వేడుకున్నారు. నిత్యం ప్రత్యేకపూజలు జరిగేలా నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహారించాలని సూచించరు.ఈ కార్యక్రమంలో భక్తులు ముత్యాల రమేష్, నోముల విష్ణు, నోముల కృష్ణ, నోముల యాదగిరి,ముత్యాల శివ కుమార్,చిప్పలపల్లి పరశురాములు,నోముల శివ కుమార్, చిప్పలపల్లి సంతోష్ తదితర భక్తులు పాల్గొన్నారు.

VijayaKumar

Sep 09 2024, 17:02

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా కు వినతి పత్రం అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదుల నగేష్

తెలంగాణ రాష్ట్ర జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో భారత ప్రభుత్వ 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ అరవింద్ పానగర్న్  సమక్షంలో 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం సోమవారం  జరిగినది .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పిటిసి డాక్టర్ కుడుదుల నగేష్  16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ యూని కలిసి 1). 13వ ఫైనాన్స్ తీర్మానం ప్రకారం గ్రామపంచాయతీలకు 50% మండల పరిషత్లకు 30% జిల్లా పరిషత్తులకు 20% నిధులు కేటాయించాలని.2) బి ఆర్ జి ఎస్ నిధులు కూడా కేటాయించాలని.3) మ్యాచింగ్ గ్రాంట్ నిధులు కూడా రెన్యువల్ చేయాలని. 4) పంచాయతీరాజ్ శాఖ ద్వారా అభివృద్ధి పనులకు కేటాయించే నిధులకు 5 లక్షల వరకు కేటాయించే పనులకు జీఎస్టీని 18 శాతం నుండి జీరో శాతానికి చేయాలని.5) జిల్లా పరిషత్లకు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే హెల్త్ గ్రాండ్ వర్క్ సెలక్షన్ హక్కు జిల్లా పరిషత్లకే కేటాయించాలని.6) కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్లకు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనాగార్న్ గారికి వినతి పత్రాన్ని అందజేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుగల్ నగేష్ అందజేశారు.

VijayaKumar

Sep 09 2024, 16:41

మూసి ప్రక్షాళన - గోదావరి కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

మూసీ జల కాలుష్యాన్ని అరికట్టి, ప్రక్షాళన చేపట్టి గోదావరి, కృష్ణా జలాలను ప్రత్యామ్నాయంగా అందించాలని భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సులో మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండల కన్వీనర్ గా ఏదునూరి మల్లేశం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని జిల్లా కో- కన్వీనర్ దయ్యాల నర్సింహ తెలియజేసినారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామం తో పాటు పది గ్రామాలకు మూసీ జలాలు అందించాలని కోరుతూ ఆనాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భునాదిగాని కాల్వ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి కాలువను సాధించడం జరిగిందని వారు తెలియజేశారు. కానీ నేటికీ ఆ కాలువ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదని, ఇంకా రైతులకు నష్టపరిహారం మరియు అన్ని గ్రామాలకు సాగునీరు అందించే దాంట్లో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా నిర్వాసితులకు నష్టపరిహారం, కాలువను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని అన్ని గ్రామాలకు నీరు అందించాలని, మూసీ జల కాలుష్యాన్ని అరికట్టాలి ప్రత్యమ్నయంగా గోదావరి జలాలను వడపర్తి కతత్వ నుండి భువనగిరి, బీబీనగర్ చెరువులను నింపి అందించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. భునాదిగాని కాల్వ పూర్తి కోసం, ప్రత్యామ్నాయంగా గోదావరి జలాల కోసం 11 తేదీన ఎర్రంబెల్లి నుండి నమాత్ పల్లి, నందనం, అనాజిపురం మీదుగా బీబీనగర్ మండల కేంద్రంలో నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్రను అనంతరం జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న మహాధర్నాను రైతులు, కూలీలు, వృత్తి దారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మల్లేశం పిలుపునిచ్చారు. ఇంకా కమిటీలో కో- కన్వీనర్లుగా గునుగుంట్ల శ్రీనివాస్, బొల్లెపల్లి కుమార్, జిట్టా అంజిరెడ్డి, కొండాపురం యాదగిరి, గుండెనబోయిన దానయ్య, కమిటీ సభ్యులుగా ఏదునూరి వెంకటేష్, కడారి కృష్ణ, గంగనబోయిన పాండు, బొల్లేపల్లి పరమేష్, తోటకూరి మల్లేష్, ముత్యం ప్రకాష్, ఎల్లంల ఐలయ్య, కొల్లూరు సిద్ధిరాజు, సింగిరెడ్డి భూపాల్ రెడ్డి, రాసాల శ్రీశైలం, హైతరాజు కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని మల్లేశం తెలియజేశారు. ఇట్లు ఏదునూరి మల్లేశం కన్వీనర్ మూసీ ప్రక్షాళన - గోదావరి, కృష్ణా జలాల సాధన వేదిక భువనగిరి మండలం

VijayaKumar

Sep 08 2024, 17:56

ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎస్ కే చాంద్ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్

రామన్నపేట:  తెలంగాణ ఉద్యమకారుడు యానాల లింగారెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రామన్నపేట మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు నోముల శంకర్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్.కె చాంద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు డాక్టర్ నకిరెకంటి అశోక్ కుమార్ ఉద్యమ నాయకులు బొడ్డుపల్లి లింగయ్య బోగారం మాజీ ఉపసర్పంచ్ ఎండి ఇమామ్ నక్క శంకర్ పాండురంగ చారి మోటే రమేష్ ఉద్యమ నాయకులు రెబ్బాస్ రాములు రేపాక లింగస్వామి రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ సిపిఐ నాయకులు గంగాపురం యాదయ్య తదితరులు పాల్గొన్నారు