నల్లగొండ; బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం...

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ కు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులు హిందువులపై జరుగుతున్న మారణకాండ హిందూ ఆడపడుచుల మానప్రాణాలతో ఆర్చిలగాటమాడుతున్నటువంటి రోహింగ్ ముస్లింలు పైన బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ వెలికి తీసి వారి స్వదేశానికి తరిమేయాలని తెలియజేశారు. ఒకవేళ వారిపై తగ్గిన చర్యలు తీసుకోకుండా ఉన్నట్టయితే భవిష్యత్తులో హిందువులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా హిందూ మహిళలపై ఏవైనా సంఘటనలు జరుగుతే జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సింది ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగ స్వామి యాదవ్, యాదమ్మ, వెంకన్న, సురేష్. రాజు. జైశ్రీరామ్ తరుణ్, సాయి, మరియు రాష్ట్రీయ శ్రీరాంసేన కార్యకర్తలు మరియు ఇందు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్ల కోసం క్లిక్‌ చేయండి..

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్ల కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా కీ, రెస్పాన్స్‌షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ అధికారిక 

లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఆగస్టు 20వరకు తెలపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

http://tgdsc.aptonline.in/tgdsc/

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడం లక్ష్యమన్నారు దీనికి అందరూ సహకరించాలన్నారు గంజాయి కి సంబంధించినటువంటి సమాచారమైన 87126 70266 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.ఈ సందర్భంగా యువత విద్యార్థులను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ని అభినందించారు.భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానికి జిల్లా యంత్రాంగం తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటీ శంకర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్యఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రమావత్ లక్ష్మణ్ నాయక్ బుడిగ వెంకటేష్ స్పందన పావని సంపత్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

TS: ముదిరాజ్ జె ఏ సీ మత్స్యకారుల రాష్ర్ట అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్

తెలంగాణ ముదిరాజ్ జె ఏ సీ మత్స్యకారుల రాష్ర్ట అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్

*తెలంగాణ ముదిరాజ్ జెఏసి అధ్యక్షులు పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఈ రోజూ జేఏసీ తరపున పలు నియామకాలు చేశారు ,

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్, జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా బండి గోపాలకృష్ణ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చింతల దశరథ ముదిరాజ్ & జింకల కృష్ణ ముదిరాజ్ లను నియమించడం జరిగింది,

 ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ మహిళా రాష్ర్ట అధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్, జేఏసీ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ ముదిరాజ్, జేఏసీ సభ్యులు బోయిని నరేష్ ముదిరాజ్, రెడ్ల గణేష్ ముదిరాజ్, పిట్ల ఉదయ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, ఇప్ప కనకయ్య ముదిరాజ్, మరియు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ అధ్యక్షులు దారం యువరాజు ముదిరాజ్ పాల్గొన్నారు.

నల్లగొండ: మండల మహిళా సమాఖ్య లో పనిచేస్తున్న అటెండర్స్ అందరికీ కనీస వేసిన 18వేలు అమలు చేయవలసిందిగా డిఆర్ డిఓ పిడి శేఖర్ రెడ్డికి వినతి పత్రం..

 మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి. 

   సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ

     

      మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

     మండల మహిళా సమైక్యలో పనిచేస్తున్న అటెండర్స్ కు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డి ఆర్ డి ఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు . ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి కొంతమంది,20 సంవత్సరాలుగా కొంతమంది తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

       ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. 

      ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

TS: సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ నిత్యం వార్తలలో నిలిచే వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ..

HYD : వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు. ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశం. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు. తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్‌ చేసిన వేణుస్వామి భార్య వాణి. మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం.

బ్రేకింగ్ న్యూస్: TS:రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌..

రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

ధరణిలో మార్పులకు రూ.8 లక్షలు డిమాండ్‌

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డితో పాటు..

సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డి నివాసంలో రూ.16 లక్షలు సీజ్‌

Ts: సర్పంచి ఎన్నికలు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి

వీలైనంత త్వరగా పూర్తి చేయండి

రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వయిజరీ జారీ

కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర అధికారులు

పంద్రాగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఆ మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ దాడి.. కొనసాగుతున్న తనిఖీలు...

మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసంలో ఏసీబీ తనిఖీలు

ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ నివాసంలో తనిఖీలు

అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు

తనిఖీలు చేస్తున్న 15 మంది ఏసీబీ అధికారులు

నల్లగొండ: బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీ ఎన్నిక.. నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సిరి ప్రగడ శ్రీనివాస శర్మ..

బ్రాహ్మణ సేవాసమితి జిల్లా కమిటీ ఎన్నిక

తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా కమిటీని సోమవారం జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రామాలయంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా సిరి ప్రగడ శ్రీనివాస్ శర్మ, జిల్ల ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణ చరణ్ చార్యులు, ఉపాధ్యక్షులు పసునూరి రాంబాబు,సిరిప్రగడ ఆనందరావు,గాదె గిరిధర్ రావు, సహాదు కార్యదర్శ్మి గా కంజర్ యశ్వంత్ చార్యులు, కోశాధికారిగా కలాహలం సంజయుచార్యులు, ప్రచార కార్యదర్శి రంగరాజు జగదీష్, కార్యవర్గ సభ్యులు మారేవల్లి వెంకటాచార్యులు, గాదె మురళి కృష్ణ మడపు సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ ఆదేశాల మేరకు ఈరోజు కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీ జిల్లా పేద బ్రాహ్మకుల కోసం ఎల్లవేళలు అందుబాటులు ఉండి అందరికి సహయ సహకారలు అందించి కమిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీ లు రాష్ట్ర మంత్రులు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎంతోమంది బ్రాహ్మణులు వెనకబడి ఉన్నారని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అవకాశం కల్పించి బ్రాహ్మణ కులానికి చెందిన విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ఆర్థికంగా ప్రోత్సహించాలని కోరారు.