*వారంలో టాయిలెట్స్ నిర్మాణం చేయాలి కాంట్రాక్టర్ పై ఆగ్రహం ..MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *గాంధీ పార్క్ ప్రాథమికోన్నత పాఠశాలలో* అకస్మికంగా ఉదయం ప్రైర్ లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.పాఠశాలలో టాయిలెట్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఉపాధ్యాయులు తెలియజేయడంతో .. వెంటనే కాంట్రాక్టర్ ని పిలిపించి వారం రోజుల్లో టాయిలెట్స్ పూర్తిచేయాలని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ ఆనందంతో MLA గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ నేరుగా.. శ్రీవారి దర్శనం.. ఎంత లక్కో?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది.
సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వచ్చిన భక్తులకు వెంటనే స్వామి వారి దర్శనం అవుతుంది. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారిని చూసే వీలు నేడు కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం వల్ల భక్తుల సంఖ్య తిరుమలలో అంతగా లేదు. వసతి గృహాలు కూడా వెంటనే భక్తులకు దొరుకుతున్నాయి. క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. గంటల తరబడి వేచి చూడకుండా స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది సహజంగా శుక్ర, శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే స్వామి వారి దర్శనానికి వెళ్లడానికి వీలవుతుంది. నేరుగా లైన్ కదులుతుండటంతో వెంటనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,356 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,815 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ **
BLR నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *వైష్ణవి ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*మిర్యాలగూడలో BC వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ నందు గల *MJPT.BC Welfare Residential Girls School ను* *MEO గారితో* కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* . హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .
అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు.అలాగే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు అదే విధంగా మీరు అంతా చదువుకొని ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపేలా ఆదర్శ వంతంగా మారాలి అని అన్నారు..
**పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు**
గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి నుంచి పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు!

గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి నుంచి గ్రామపంచాయతీ స్థాయి వరకు రోజు వారీ వాతావరణ వివరాలను అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సమాచారాన్ని అందించే బాధ్యతలను 2.69 లక్షల స్థానిక సంస్థలకు అప్పగించనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. తద్వారా రైతులకు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుస్తాయని, దీంతో వారికి సాగు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే భారత వాతావరణ విభాగం ‘పంచాయతీ మౌసమ్‌ సేవ’ పోర్టల్‌ను ప్రారంభించింది. బ్లాక్‌(మండల) స్థాయిలో వాతావరణ పరిస్థితిని ఎప్పకటిప్పుడు అందిస్తోంది. దీనిని మరింత విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా 6లక్షలకు పైగా గ్రామాల్లో రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోంది

 
 
   ఈరోజు లక్ష యాభై రూపాయల రుణ మాఫీ అమలు మరియు ఆగస్టు 15 లోగా రెండు లక్షలు శ్రీకారం చుట్టిన 
* *ముస్లిం మత పెద్దలలో..MLA -BLR**
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం *మస్జీద్ అర్ఫాత్ (చిన్న మసీద్ )* నందు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం , పర్యావరణ పరిరక్షణ కోసం *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్చంధ కార్యక్రమాలకు మిర్యాలగూడ నియోజకవర్గ మైనారిటీ సోదరుల సహాయ సహకారాలు అందించాలని .. *ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ* కార్యక్రమంలో , *వన మహోత్సవం* కార్యక్రమంలో వారు కూడా భాగస్వామ్యులు కావాలనీ కోరడం జరిగింది.. వెంటనే స్పందించిన పెద్దలు MLA గారు చేపడుతున్న ప్రతీ అభివృద్ది కార్యక్రమంలో తమ వంతుగా వారు కూడా భాగస్వామ్యులు అవుతామని . ఆగస్టు 11 ఆదివారం రోజు తమ బాధ్యతగా అవంతిపురం లోని *ఈద్గా* పరిసరాలలో 2వేల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. వారి విన్నపాన్ని స్వాకరించడంతో MLA గారు ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఆగస్టు 15 ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  *78వ స్వాతంత్ర్య దినోత్సవ* వేడుకల్లో కూడా ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత గురువులు , పెద్దలు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*పంచాయతీ పోరుకు కసరత్తు*
పంచాయతీ పోరు కసరత్తు ప్రారంభంతో జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ వేడి రాజుకొంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారానికి కొత్త ఓటర్ల జాబితా పూర్తిచేసి, నిర్ణీత గడువులో రిజర్వేషన్‌ వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్‌ను కోరారు. బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుం దని స్పష్టం చేయడంతో పల్లెల్లో పంచాయతీల ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పం చాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ప్రాథమిక కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు సెక్రటరీ అశోక్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులు కలెక్టర్లు, జిల్లా ఎలక్షన్‌ అథారిటీస్‌కు అందాయి. ఆగస్టు రెండు, మూడు తేదీల్లో వివిధ జిల్లాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు రెండో తేదీన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటరు జాబి తాను సిద్ధం చేసేందుకు జిల్లాలోని ఐదు మం ది డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇప్పటికే పంచాయతీ పోరు సందడి ఆరంభమైంది.
*మార్కెట్ యార్డు కీ వచ్చే రైతులకు ఇబ్బంది కలగకూడదు..MLA -BLR*
ఈరోజు మంగళవారం సంత సందర్భంగా అవంతిపురం *మార్కెట్ యార్డు* సందర్శించిన మిర్యలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మార్కెట్ యార్డ్ అంతా తిరిగి పరిశీలించారు అలాగె అక్కడి రైతులతో మాట్లాడి ఇక్కడి సదుపాయాలు మరియు అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ మిర్యాలగూడ మార్కెట్ యార్డ్ పెద్దది కావున వారంలో రెండు సార్లు మంగళవారం మరియు శనివారం జరిగే సంతలు కూడా చాలా పెద్దవి అందుకే రైతులు, వ్యాపారులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు.. కావున వారికి ఏలాంటి ఇబ్బంది లేకుండా వారికి త్రాగు నీరు లాంటి అన్ని సదుపాయాలు కల్పించాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు .
*హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు భారత మార్కెట్లోకి ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి ఇన్‌క్లిసిరాన్‌*
ఎల్‌డీఎల్‌ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందంటున్న వైద్యులు *హార్ట్‌ ఎటాక్‌లు డబుల్‌.* గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌) కారణంగా ఎక్కువగా హార్ట్‌ఎటాక్స్‌ వస్తున్నాయి. *అసలేంటీ మందు..?* ఇన్‌క్లిసిరాన్‌ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్‌ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్‌ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్‌ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్‌ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు *ఎలా పనిచేస్తుంది?* సాధారణంగా ఇన్‌క్లిసిరాన్‌ (సింథటిక్‌ ఎస్‌ఐ ఆర్‌ఎన్‌ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్‌డీఎల్‌)ను నియంత్రించే సెరిన్‌ ప్రోటీన్‌ అయిన ప్రోప్రోటీన్‌ కన్వర్టేజ్‌ సబి్టలిసిన్‌ కెక్సిన్‌-9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్‌ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్‌డీఎల్‌ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.



ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై-గ్లిజరైడ్స్‌ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. - శ్రీనివాస్‌ కుమార్, ఇంటర్వెన్షనల్‌అపోలో హాస్పిటల్స్‌ *ఎవరెవరు వాడొచ్చు?* సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్‌ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్‌ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్‌ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. *అనుమతులు వచ్చాయా?* ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.



నేటి నుంచి హృద్రోగ సమస్యలపై కాన్ఫరెన్స్‌ గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ కాన్ఫరెన్స్‌ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్‌ ఫౌండేషన్‌ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరు కానున్నారు.