ఆంధ్రప్రదేశ్ :- ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.
ఆంధ్రప్రదేశ్ :-
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం::రెండో ప్రమాద హెచ్చరిక జారీ.
జలదిగ్భందంలో పలు గ్రామాలు
![]()
అమరావతి :, జులై 23
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది. ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగు తుంది. సోమవారం అర్ధ రాత్రి 2గంటల సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.
కాటన్ బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని వదులు తున్నారు. సుమారు 13లక్షల14వేలు క్యూసెక్కు ల నీటిని దిగు ప్రాంతానికి వదులుతున్నారు.
ఈరోజు ఉదయం ఏడు గంటల వరకు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14 అడుగులకు నీటి మట్టం చేరింది. ఏజెన్సీలో గంటగం టకు వరద ప్రభావం పెరగ డంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
చింతూరు జాతీయ రహదారి (NH)30పై వరద నీరు చేరింది. చింతూరు నుండి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వి.ఆర్.పురం మండలం చింతరేవుపల్లి, తుష్టివారి గూడెం గ్రామాల వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద బ్రిడ్జిని ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుంది. నాలుగు మండలాల్లో సుమారుగా 250 గ్రామాలకు రాకపోక లకు పూర్తిగా నిలిచిపో యాయి.
లోతట్టు గ్రామాల ప్రజలను అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిం చడానికి 18 లాంచీలను అధికారులు ఏర్పాటు చేశారు.


.
.

.






Jul 23 2024, 21:48
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
21.4k