VijayaKumar

Jul 19 2024, 16:22

ఔరవాణి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్ట మొదటి సారిగా మహిళలకూ ఉచిత ప్రయాణం, రెండోదిగా ఉచిత కరెంటు బిల్లు గృహ జ్యోతి నేడు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణ మాఫీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామంలో పాలాభిషేకం చేశారు. ముందు ముందు సామాన్య ప్రజల హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పేదోడి కి న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యమన్నారు. తెలంగాణ మార్పు అంటే పేదోడి దగ్గరికి వచ్చిన ఫలితమే నేడు ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం వెలుగుతుందన్నారు.అదే విధంగా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిగోటి శేఖర్, ముప్పిడి రవి, సింగం నర్సింహా, ముక్కముల నాగరాజు, రూపాని రాములు, నడిగోటి అంజయ్య, ఎల్లయ్య, మాధగోని శ్రీను, జక్కిలి గణేష్, శేఖర్, రఘు, నర్సింహా చారి, శివ, జలంధర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Jul 19 2024, 07:30

వలిగొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయుచున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి మండల కేంద్రంలోని రైతు వేదిక వరకు ఎడ్లబండి పై ఊరేగింపుగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు రైతులు , రైతు వేదిక కు చేరుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే . జండగే తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో, మండల అధికారులు, మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్ , కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి , గరిసె రవి, పలుసం సతీష్ గౌడ్ ,బత్తిన లింగయ్య, కాసుల వెంకన్న, బత్తిని సహదేవ్, పాలకూర్ల వెంకటేశం, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 22:04

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: వలిగొండ ఎస్సై డి మహేందర్

వలిగొండ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఎదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగో తో *వాట్స్ యాప్ లో APK files పంపిస్తున్నారు. దీన్ని మనము accept చేస్తే మన వాట్స్ యాప్ వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుంది, అంతే కాకుండా మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళ్తున్నది.* దీని ద్వారా *సైబర్ నేరస్థులు మన Google Pay / Phone Pay మరియు UPI ద్వారా డబ్బులు దోచేస్తున్నారు.* ట్రేండింగ్ లో వున్న టాపిక్ ద్వారా APK Files పంపి డబ్బులు కొట్టేస్తున్నారు. కాబట్టి అందరికి మనవి చేసేది ఏమంటే ఏదయినా apk files వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదు. మీ వాట్స్ యాప్ పనిచేయకుంటే వెంటనే రిఇంస్టాల్ చేసి report ఆప్షన్ లో రిపోర్ట్ చెయ్యండి. ఎవరైనా ఏదయినా నేరానికి గురి అయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా #1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని వలిగొండ ఎస్సై డి మహేందర్ తెలిపారు.

VijayaKumar

Jul 18 2024, 20:10

ఈనెల 20న ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరుద్యోగ మహా ధర్నా విజయవంతం చేయండి: దిండు భాస్కర్ BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోనీ BJYM కార్యలయంలో బీజేవైయం మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి ఆద్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  బీజేవైయం జిల్లా ప్రధానకార్యదర్శి దిండు భాస్కర్ గారు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...జూలై 20 న ఇందిరాపార్క్ దగ్గర జరిగే నిరుద్యోగ మహాధర్నాలో పాల్గోన వలసిందిగా బీజేవైయం నాయకులు, నిరుద్యోగులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రేగూరి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్, BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్, మండల ప్రధానకార్యదర్శి అమనగంటి శివ, బుంగ మట్ల పెద్ద మహేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 19:58

భువనగిరి పట్టణంలో శానిటేషన్ పనులను పరిశీలించిన 8వ వార్డు కౌన్సిలర్ పంగరెక్క స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణములో రాంనగర్ లో జెసిపి ద్వారా మోరీ జాము తిపిస్తున్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మోరీ లో నీళ్లు వెళ్లకుండా జాము  కావడంతో నీళ్లు  నీలిచి  దోమలు మరియు దూర్వసన   వచ్చి ఇండ్లముందర. జా మై ప్రజలకు జ్వరాలకు ఆరోగ్యములు  క్షీనించి తీవ్ర ఇబ్బందులకు  గురివుతున్నారు  అని అన్నారు. కావున ..ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మోరిలను వెంటనే శుభ్రం చేయాలని పారిశుద్ధ్య  కార్మికులకు తెలియజేశారు మరియు. మెయిన్ రోడ్డు. మీద స్కూలుకు. వెళ్లే. దారిలో. వర్షపు. నీరు నీలిచి స్కూల్ పిల్లలకి  ప్రజలకు  తీవ్ర ఇబంది కలుగుతుంది . కావున  గుంతలో మొరము పోసి ప్రజలకు  ఇబ్బంది  కాకుండా చేయించారు .ఈ కార్యక్రమంలో.కౌన్సిలర్ బొర్రా రాకేష్ , జవాన్ సునీల్, జవాన్ నర్సింగరావు, గిరి , పారిశుద్ధ్య  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 16:59

ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదు , దాతల సహకారం ను సద్వినియోగం చేసుకోవాలి : కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త

గ్రామీణ విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో బస్వాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కీ! శే! బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన వారసులు అందించే మెరిట్ స్కాలర్ షిప్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. గురువారం భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెరిట్ విద్యార్థులకు, గ్రామ మాజీ సర్పంచ్ బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి వారసులు బెజ్జంకి నరోత్తంరెడ్డి, బెజ్జంకి మాణిక్ రెడ్డి, సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న లు అందించిన యాబది వేల రూపాయల నగదును నల్గురు విద్యార్థులకు (ఒక్కొరికి పన్నెండు వేల ఐదు వందలు) అందజేశారు. ఈ సందర్బంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పుట్టిన ఊరును, చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్ షిప్ లు అందించి, విద్యార్థులను ప్రోత్సహించే దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతల సహకారంను సద్వినియోగం చేసుకుని, ప్రయోజకులు కావాలని ఆయన కోరారు. అనంతరం దాతలను పాఠశాల ఉపాధ్యాయుల ఆద్వర్యంలో సన్మానం చేశారు. పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ డి. కృష్ణవేణి అద్యక్షతన జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కొండ మడుగు బాలమణి, మెరిట్ స్కాలర్ షిప్ దాతలు సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న, కుమారి రుచిక, గ్రామానికి చెందిన వికలాంగుల హక్కుల నాయకులు మచ్చ ఉపేందర్, మెరిట్ స్కాలర్ షిప్ లు పొందిన విద్యార్థులు చందన, వైశాలి, శ్రవంతి, అభిలాష్, బస్వాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 14:58

భువనగిరి : అర్బన్ కాలనీ రైల్వే బ్రిడ్జి మోరి డిజైన్ మార్చాలి : గడ్డం వెంకటేష్ DYFI జిల్లా కార్యదర్శి

భువనగిరి మున్సిపల్ కేంద్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరు తెచ్చుకున్న అర్బన్ కాలనీలో ప్రస్తుతం నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి నిర్మాణాన్ని డిజైన్ మార్చి ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడేలా నిర్మించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మోరి నిర్మాణ పనులను పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశంలోని అతిపెద్ద కాలనీగా గుర్తింపు తెచ్చుకున్న అర్బన్ కాలనీ అనేక సమస్యలకు నిలయంగా మారిందని, అర్బన్ కాలనీ నుండి భువనగిరి కేంద్రానికి రావడానికి గల రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద నూతనంగా నిర్మిస్తున్న మొరి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి డిజైన్ మార్చి భవిష్యత్తులో కాలనీ ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది జరగకుండా నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. అర్బన్ కాలనీ నుండి భువనగిరి కేంద్రానికి రావడానికి ప్రత్యామ్నాయంగా రైల్వే అండర్ బ్రిడ్జి ద్వారా వెసులుబాటుగా ఉన్నది. రాత్రి సమయాల్లో ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు సమయభావంతో తొందరగా వెళ్లడానికి అట్టి రోడ్డు కాలనీవాసులకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం వేస్తున్న మొరి ద్వారా వర్షాకాలంలో కాలనీ నీళ్లు మొత్తం రోడ్డుపై చేరి భువనగిరి నుండి వరంగల్ వెళ్లే రహదారి పైకి వచ్చి వాహనదారులకు, కాలనీ ప్రజలకు అనేక ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నది. దాదాపు ఒకటవ వార్డు, 13వ వార్డు, 16వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ నీళ్లు మొత్తం అట్టి మోరి ద్వారానే బయటికి రావాలి దాన్ని గమనించకుండా అనుభవం లేని ఇంజనీర్లతో సలహా తీసుకొని నిర్మాణాన్ని చేపట్టడం వల్ల భవిష్యత్తులో కాలనీ ప్రజలు వాహనాదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి పనులను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా మోరీ నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలతో ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు అన్నారు. వీరితోపాటు నాయకులు రియాజ్, తరుణ్, సాజిద్, విక్రమ్,పవన్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 18 2024, 13:46

వలిగొండ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్డును సిసి రోడ్డుగా నిర్మించాలి: సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా  వలిగొండ చెరువు కట్ట నుండి రైల్వే స్టేషన్ కు వెళ్ళు రోడ్డు కు సిసి రోడ్డు మంజూరు చేసి వెంటనే నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్ లు డిమాండ్ చేశారు గురువారం సిపిఎం పోరుబాట లో భాగంగా వలిగొండ చెరువు కట్ట నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే గుంతల మయమైన మట్టి రోడ్డు ను సిపిఎం బృందం పరిశీలించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి కూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ నిత్యం వందలాది మంది వలిగొండ పట్టణానికి చెందిన రైతులు తమ పంట పోలాలకు వెళ్లడానికి, లింగరాజు పల్లి గ్రామానికి చెందిన ప్రయాణికులు ప్రయాణం చేయడానికి ధాన్యం మార్కెట్లోకి తీసుకురావడానికి అనువుగా ఉన్న ఈమట్టి రోడ్డు పూర్తిగా గుంతల మయమై రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం స్థానిక భువనగిరి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సీసీ రోడ్డును మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కోరారు అదేవిధంగా వలిగొండ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, నాయకులు కొండూరు సత్తయ్య,ఎండి షహీద్, రైతులు మైసోళ్ల కిష్టయ్య,రవి,నరేందర్ లు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 17 2024, 19:26

వలిగొండ : నాగారం గ్రామంలో ప్రత్యేకత సంచరించుకుంటున్న... మొహర్రం వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నాగారం గ్రామంలో మొహరం వేడుకలు  ప్రత్యేకత సంచరించుకుంటుంది.ప్రత్యేకంగా మొహరం పండుగ చివరి రోజు మొహరం పండుగ రోజు మూడు గ్రామాల పీర్ల బంధాలు తెలియజేస్తాయి. నాగారం గ్రామంలో వెలిసిన వలి భాషకు నెమలి కాల్వ లాల్ సాబ్తమ్ముడు.అందుకు ప్రతి సంవత్సరంఅన్నను కలవడానికి నెమలి కాల్వ లాల్ సబ్ మొహరం రోజు నాగారం వచ్చి కలుస్తాడు. అదేవిధంగా గొల్నే పల్లి వలి భాష నాగారం వలి భాషకు అన్న. అన్నను కలవడానికి ప్రతి మొహరం రోజు నాగారం నుండి గొల్నేపల్లి కి వెల్లి కలుస్తాడు. సాయంత్రం తమ్ముడు వచ్చి అన్నను పలకరిస్తేనే అన్న లేస్తాడు, ఇది ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం.

VijayaKumar

Jul 17 2024, 19:09

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: TJU జిల్లా అధ్యక్షులు ఎండి షానుర్ బాబా

యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కోసం 'తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ బాబా ఆధ్వర్యంలో డాక్టర్.సుమంత్ కంటి హాస్పిటల్ సహకారంతో ఈ నెల 21న ఆదివారం రోజున నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షానూర్ మాట్లాడుతూ జిల్లా లొ పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏదైనా కంటి సమస్యలు ఉన్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నిర్వహించిన అనంతరం డాక్టర్ సూచన మేరకు కంటి అద్దాలు,మందులు ఉచితంగా ఇవ్వబడునని, సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు, విజయ్ భార్గవ్ హాస్పటల్ పక్కన, మీనా నగర్, భువనగిరిలొ ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు . ఈ కార్యక్రమంలో టీజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.