మృతి చెందిన జర్నలిస్టు రమణ కుటుంబానికి బాసటగా నిలిచిన.తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్
సూర్యాపేట జిల్లా :-
మృతి చెందిన జర్నలిస్టు రమణ కుటుంబానికి బాసటగా నిలిచిన
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్
6వేలరూపాయల నగదు 25 కేజీల బియ్యం అందజేత
.
.
గత ఏడు సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు రమణ కుటుంబానికి తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆర్థికంగా తోడ్పాటును అందించారు.మంగళవారం సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామంలో గల ఆయన నివాసానికి చేరుకొని దశదినకర్మల ఖర్చుల నిమిత్తం రమణ భార్య కు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. సందర్భంగా అసోసియేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ తోటి జర్నలిస్టులకు కు ఏదైనా ఇబ్బందులలో ఉన్న క్రమంలో తమకు తోచిన విధంగా సహకరించేదుకు ముందుకు వస్తామని ప్రస్తుతం రమణ అంత్యక్రియలకు అదేవిధంగా దశదిన కర్మ కార్యక్రమానికి సహకరించిన ఇతర యూనియన్ మిత్రులకు అదే విధంగా తమ అసోసియేషన్ మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ అసోసియేషన్ నుండి 6వేల రూపాయల నగదు 25 కేజీల బియ్యం ఇవ్వటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, హుజూర్నగర్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు,సూర్యాపేట నియోజకవర్గ కమిటీ సభ్యులు తాప్సి అనిల్,దేశగాని వెంకట్ గౌడ్,వల్దాసు శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


.

.
.
.





.
Jul 09 2024, 15:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k