సూర్యాపేట జిల్లా:-జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి ఆర్డీవో కు వినతి పత్రం అందించిన హుజూర్నగర్ టీఎస్ జేఏ జర్నలిస్టులు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్డీవో కు వినతి పత్రం అందించిన హుజూర్నగర్ టిఎస్ జేఏ జర్నలిస్టులు

నల్గొండ జిల్లా :-

...

ఎన్నో సంవత్సరాలుగా వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు ఉచిత సేవ అందిస్తూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా నియోజకవర్గ కమిటీ సభ్యులు ఆర్డీవోకు సోమవారం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్ మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎంతోకాలంగా జర్నలిస్టులుగా కొనసాగుతున్న తమకు ఇంటి స్థలాలు లేదా ప్రత్యేక ఇండ్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇప్పించాలని ఇంకా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ఆదేశానుసారం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్లు దేవరం రామకృష్ణారెడ్డి, బరిగెలవిజయ్ కుమార్, త్రిపురారం లక్ష్మారెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు అల్వాల రవికుమార్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చిలక సైదులు, ప్రధాన కార్యదర్శి పిడమర్తి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాతంగి రవి, కోశాధికారి మలోతు శంకర్ నాయక్ , కమిటీ సభ్యులు పల్లె సుధాకర్, మీసాల వీరబాబు, బేత శివారెడ్డి తదితర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు

తెలంగాణ :-రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.తొలత తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట.రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లల పర్యాటకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఏపీ:పేలిన బాయిలర్.. 15 మందికి తీవ్రగాయాలు

ఏపీ: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది.

ఏపీ : ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం ఎప్పటి కాలం నాటివి అంటే

నంద్యాల జిల్లాశ్రీశైలం

శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం ఎప్పటి కాలం నాటివి అంటే

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది.

యాంఫి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా, శివలింగం బయటపడింది. పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం వెలుగులోకి వచ్చింది.

శివలింగంతోపాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది.

శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

యాంఫి థియేటర్ నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ పనులు చేస్తుండగా శివలింగం కంట పడటంతో దేవస్థానం అధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసన లిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కు దేవస్థానం అధికారులు పంపించారు. బయట పడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసన లిపి 14,15 వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు

శిలాశాసనం పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కంపిలయ్య శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పేర్కొన్నారు. చక్ర గుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుడిని ప్రతిష్టించినట్లు లిపిలో నమోదు చేసి ఉంది. ఈ మేరకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు, వెండి నాణేలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడటం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

*గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..!*
*గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్..!* హాస్టల్‌లో కేర్ టేకర్‌తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంది.. బీర్లు తాగుతోంది. సూర్యాపేట - బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ‌

వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు.

వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు నకిలీ విలేకరుల అరెస్టు.

 వెంకటాపురంలో ముగ్గురు నకిలీ విలేకరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం సీఐ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామచంద్రపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి నకిలీ ప్రెస్ లోగోను పట్టుకొని విలేకరులమని పేర్లు చెబుతూ వచ్చిపోయే లారీలను ఆపి వసూళ్లకు పాల్పడుతూ డబ్బులు ఇవ్వని లారీ డ్రైవర్లను కత్తులతో బెదిరిస్తూ విలేకరులమని చలామణి అవుతున్న ముగ్గురుని శనివారం వెంకటాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద రూ.32 వేల నగదు, 3 ఐడి కార్డ్స్, నకిలీ ప్రెస్ లోగో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.

ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు

న్యూ ఢిల్లీ :జులై 06

జూన్ 18వ లోక్‌సభ కొలు వుదీరిన విషయం తెలిసిం దే. జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌ సభ స్పీకర్‌ గా ఎన్నికయ్యారు. 

ఇక తొలి సమావేశాలు ముగియడంతో ఇప్పుడు కేంద్రం బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభం కానున్న ట్లు పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు శనివారం ప్రకటించారు. 

ఆగస్టు 12 వరకూ ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్ట నున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యం తర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఎన్నిక ల అనంతరం పూర్తిస్థాయి లో బడ్జెట్‌ ప్రవేశపెట్టను న్నట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. 

ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశ పెట్టనున్నారు...

టిఎఎస్ జేఏ బృందాన్ని పీర్ల పండుగకు ఆహ్వానించిన ముజావర్లు

టిఎఎస్ జే ఏ బృందాన్ని పీర్ల పండుగకు ఆహ్వానించిన ముజావర్లు

నల్గొండ జిల్లా :-

.

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని హుజూర్నగర్ లో ముస్లిం పెద్దలు స్థానికంగా జరుపుకునే పండుగ పీర్ల పండుగ ఇట్టి పీర్ల పండుగ రేపు జూలై 07 నుండి జూలై 17 వరకు వరుసగా పది రోజులు వైభవంగా జరుపుకునే ఈ పీర్ల పండుగకు స్థానిక ముస్లిం పెద్దలు ముజావర్లు అయినటువంటి షేక్ సైదాభి,షేక్ మోయినొద్దిన్, షేక్ నాగూల్ మీరా మొదలైన ముస్లిం మైనారిటీ సోదరులు ఆహ్వాన పత్రిక అందించి ఆహ్వానం అందించి తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరు ఇట్టి పీర్ల పండుగ కార్యక్రమం లో పాల్గొని మొక్కుబడులు చెల్లించి పీర్లకు దట్టిలు గంధం కొబ్బరి కుడకలు బెల్లం సమర్పించుకొని ఆహ్వానించడం జరిగింది అని తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు టి ఎస్ జే ఏ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గొట్టే నాగరాజు యాదవ్, టి ఎస్ జే ఏ నియోజకవర్గ నూతన అధ్యక్షులు అల్వాల రవికుమార్, టి ఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ మాజీ ప్రస్తుత గౌరవ అధ్యక్షుడు చిలక సైదులు తెలిపినారు.

సూర్యాపేట లో బాలెంల సాంఘీక సంక్షేమ గురుకులలో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రూంలో బీరు సీసాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*సూర్యాపేట లో బాలెంల సాంఘీక సంక్షేమ గురుకులలో మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రూంలో బీరు సీసాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

ప్రజలు అప్రమత్తంగా  ఉంటూ ఎలాంటి అనుమానం వచ్చిన పోలీసులకు సమాచారం ఇవ్వాలి.నకిరేకల్ సిఐ రాజశేఖర్

నల్గొండ జిల్లా:-

 నల్లగొండ జిల్లా ఎస్పి  శరత్ చంద్ర పవార్    ఆదేశానుసారం నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో కొత్త చట్టాలపై అవగాహన కలిగించుటకు రోడ్డు ప్రమాదాలు నివారణ  గంజాయి మత్తు పదార్థాల నివారణ సైబర్ నేరాల పట్ల అప్రమత్తత బాల కార్మికులు సోషల్ మీడియా స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలా నివారణ కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు దొంగతనాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎస్పీ  ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యంపుటకు పోలీస్ కళాబృందల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ,, ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నకిరేకల్ పిఎస్ పరిధిలోని చందంపల్లి గ్రామంలోసీఐ  రాజశేఖర్,ఎస్సై  గోపిక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీస్ కళాకారుల బృందం షేక్ హుస్సేన్, శేఖర్ పురుషోత్తం, సత్యం, మురళి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,  ఈ సందర్భంగా,సీఐ రాజశేఖర్,ఎస్ఐ గోపిక్రిష్ణ లు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చిన అనుమానిత వ్యక్తులు కనిపించిన 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసువారికి  సమాచారం ఇవ్వాలని ప్రజలకు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు,