పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు...
పాచి పట్టిన పాత్రలో త్రాగునీరు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు.
శింగనమల నియోజకవర్గం,బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులను ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు పరిశీలించారు. వసతి గృహ గదులలో పైకప్పు సిమెంట్ స్లాబ్ పెచ్చులు ఊడిపోయి ఉండడం చూసి సంబంధించిన వసతి గృహ వార్డెన్ ఫై అసహనం వ్యక్తం చేశారు.స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడిన సంగతి గురించి సంబంధించిన అధికారులకు తెలిపినారా లేరా అని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు అధికారిని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద మరమ్మత్తుల కోసం పంపించామని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారి దృష్టికి కాగితాలు చూపుతూ వసతి గృహ అధికారి రామ్ నాయక్ తెలిపారు.గడిచిన నాడు నేడు కింద వైసీపీ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా నిర్లక్ష్యం చేయడం విద్యారంగానికి సంబంధించిన విద్యార్థుల వసతి గృహాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం చేసి వ్యవస్థలను ఎక్కడి గొంగళి అక్కడేఅన్న చందంగా పరిపాలన చేశారని ఎద్దేవా చేశారు.ఇంకొకసారి స్లాబ్ పై కప్పు సిమెంట్ పెచ్చులు ఊడి పోయాయని,మరమ్మతులు కోసం సంబంధించిన అధికారులు కు పంపండని సూచించారు. వంట గదిని పరిశీలించి,శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.ఆ తర్వాత అరుగు పై ఉంచిన స్టీల్ పాత్రను పరిశీలించారు. పాత్రలో నిల్వ ఉంచిన నీటిని విద్యార్థులు ఎల్లవేళలా త్రాగుటకు ఉపయోగిస్తారని సిబ్బంది ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారికి తెలిపారు.పాత్ర పై ఉంచిన మూత తీసి,పాత్రలోపలి భాగం చూశారు.నీటి అడుగున పాచిపట్టి,దోమలు పడి అపరిశుభ్రంగా ఉండటం చూసి,సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ ఇండ్లలో త్రాగడానికి ఇలాగే పాత్రలు ఉంటాయా అని మండిపడ్డారు.వెంటనే పాత్ర ను మార్చాలని ఆదేశించారు. వసతి గృహంలో ని గదులు పరిశీలించే క్రమంలో నలుగురు విద్యార్థులు పాఠశాల కు వెళ్లకుండా ఉండటం చూసిన ఎమ్మెల్యే గారు,విద్యార్థులుకు ఆరోగ్యం బాగా లేదని,అందుకు వెళ్ళ లేదని సిబ్బంది తెలిపారు. సిబ్బంది ని పక్కకు పంపి,ఎమ్మెల్యే గారు విద్యార్థుల ఆరోగ్యం గురించి వివరాలు అడిగి,వైద్య సేవలు అందాయా లేవా అని అడిగారు.విద్యార్థులు వైద్య సేవలు అందాయాని ఎమ్మెల్యే గారికి తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య విషయం లో జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి ఎమ్మెల్యే శ్రావణి గారు సూచించారు. అలాగే గదులలో విద్యుత్ ఫ్యాన్లు,బల్బులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపించి,గాలి వెలుతురు ఉండేటట్లు చూడాలని అధికారికి ఎమ్మెల్యే తెలిపారు.
Jun 29 2024, 06:49