ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్..

ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* అనంతపురం, జూన్ 22 : *జాతీయ రహదారి 544-డికి సంబంధించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారి 544-డికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో భూ నష్టపరిహారం పంపిణీపై ఆర్బిట్రేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.* *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 544-డి జాతీయ రహదారికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 112-2లో 0.60 ఎకరాల భూమికి అవార్డు అయ్యాక నష్టపరిహారం అందించలేదని, గ్రామానికి చెందిన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. గ్రామానికి చెందిన భూమి, ఇళ్లు కోల్పోయిన పట్టాదారులతో మాట్లాడి వారికి ఏం కావాలో తెలుసుకొని ఎన్.హెచ్.ఏ.ఐ పిడి, ఆర్డీఓ, తహసీల్దార్ లతో చర్చించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్ట ప్రకారం వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి తరుణ్ కుమార్, అనంతపురం ఆర్డిఓ జి.వెంకటేష్, బుక్కరాయసముద్రం తహసిల్దార్, సింగనమల సబ్ రిజిస్టర్, బోడిగానిదొడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..

Breaking... తండ్రి చేతిలోనే దారుణ హత్య కు గురైన ఆరేళ్ల బాలిక..
అనంతపురం నార్పలలో దారుణం ఆరేళ్ల బాలిక పావనిని దారుణంగా హత్య చేసి బావిలో పడేసిన తండ్రి గణేష్ మూడు రోజుల క్రితం అంగడికి వెళ్లి కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి గణేష్ జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు బాలిక తండ్రి గణేష్ ను అదుపులోకి ప్రశ్నించిన పోలీసులు పోలీసుల విచారణలో బాలికను హత్య చేసి బావిలో పడేసినట్లు అంగీకరించిన బాలిక తండ్రి గణేష్ బాలిక మృతదేహాన్ని చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు
ప్రపంచ యోగా దినోత్సవములో మండల ఎంపీపీ దాసరి సునీత..
బుక్కరాయసముద్రం మండలంలోని సిద్దరాంపురం గ్రామపంచాయతీ నందు గత సంవత్సరంలో చేపట్టినటువంటి అమృత్ సరోవర్ పని దగ్గర ప్రపంచ యోగా దినోత్సవమును జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షులు దాసరి సునీత గారు హాజరు కావడం జరిగినది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శోభారాణి గారు, ఈవో పి ఆర్ డి దామోదరమ్మ గారు, గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ నారాయణస్వామి గారు, ప్రజా ప్రతినిధి బుల్లే నారాయణస్వామి గారు, ఉపాధి సిబ్బంది ఏపిఓలు, టిఏలు, పంచాయతీ లెవెల్ ఆఫీసర్లు, ఉపాధి కూలీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నడం జరిగినది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే దస్తగిరి మరియు కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు కాటప్పగారి రామలింగారెడ్డి..
అమరావతి అసెంబ్లీ సెక్రటరియేట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి (కోడుమూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు) కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ప్రస్తుతం శింగనమల నియోజకవర్గంలోనీ పరిస్థితులపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారితో చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు*
దశాబ్దాలు తర్వాత.. తాత కల నేటికి సఫలీకృతం.. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈరోజు శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన శింగనమల నియోజకవర్గం శాసన సభ్యురాలు బండారు శ్రావణీ శ్రీ.. ఈ అవకాశాన్ని కల్పించిన శింగనమల నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
అమరావతి సచివాలయం లో అనంతపురం జిల్లా మంత్రులను కలిసిన కోడుమూరు ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి
అమరావతి సచివాలయం లో ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారిని మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కోడుమూరు నియోజకవర్గం MLA బొగ్గుల దస్తగిరి గారు మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు..
జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ సమావేశం..

అనంతపురం, జూన్ 20 : అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం రాత్రి జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాంబియా దేశము నుంచి 16 మంది డెలిగేట్స్ ఈనెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాలలో ప్రకృతి వ్యవసాయంలో ఏ గ్రేడ్ మోడల్, ఏటీఎం మోడల్, DRPM మోడల్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చే నెలలో మన జిల్లా నుండి బాగా ప్రావీణ్యం పొందిన సుకన్యా, రవిచంద్ర, శివ శంకర్, సుధాకర్ లు జాంబియాలోని వ్యవసాయ విధానాలు వారికి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జాంబియా టీం కు చెందిన సెబాస్టియన్, మాంజా, ముండియా, సెలిషియన్, సిటీ&ఎల్ఓ డిపిఎం లక్ష్మీ నాయక్, తదితరులు పాల్గొన్నారు..

ఆరేళ్ల బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు..
ఆరేళ్ల బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన నార్పల పోలీసులు.. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలచే గాలింపు చర్యలు నార్పల మండల కేంద్రానికి చెందిన ఆరేళ్ల బాలిక పావని మిస్సింగ్ పై కేసు ( క్రైం నంబర్ 108/2024) నమోదు చేశామని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈరోజు మధ్యహ్మాం అంగడికి వెళ్లొస్తానని చెప్పి బయటికెళ్లిన తన కూతురు పావని సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదని ఆ అమ్మాయి తండ్రి గణేష్ ఫిర్యాదు చేశాడన్నారు. బాలిక మిస్సింగుపై దర్యాప్తు ప్రారంభించామని... జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆ అమ్మాయి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఎవరికైనా ఆ బాలిక ఆచూకీ తెలిసినా, కనిపించినా వెంటనే తన ఫోన్ నంబర్ 9490107853 కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి..
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి..

గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల నుండి మడకశిర నియోజకవర్గ ప్రజలు మాజీ ప్రజా ప్రతినిధులకు ఎన్ని అర్జీలు ఇచ్చిన విద్యుత్ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన పట్టణంలోని రెండు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫర్లను మార్చలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కేవలం పది రోజులలోపే ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ప్రమాణస్వీకారం కాకముందే నిన్నటి రోజు మంగళవారం పట్టణంలో పలుచోట్ల సుడిగాలి పర్యటన చేసి ప్రధాన సమస్యలుగా ఉన్న ప్రధాన రహదారిపై రెండు విద్యుత్ ట్రాన్స్ఫర్లను వెంటనే తొలగించి రోడ్డు పక్కన పెట్టండి అని విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సూచించారు. ఈరోజు బుధవారం విద్యుత్ కాంట్రాక్టర్ లోకేష్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే రాజీవ్ గాంధీ సర్కిల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు రోడ్డు పక్కన పెట్టే విధంగా పనులు జెసిపి ద్వారా చేపడుతున్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లకు ప్రజలు కృతజ్ఞాతలు తెలిపారు
నేను బడికి పోతా కార్యక్రమంలో ఎమ్యెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు బుక్కరాయసముద్రము మండలములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్రపాడు గ్రామంలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ చేసి మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు విద్యార్థులను ఉద్దేశించి విద్యను బాగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే బడి బయట ఉండే పిల్లలందరిని బడిలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఎన్యూమరేటర్స్ అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPP దాసరి సునీత, సర్పంచ్, తహసిల్దార్, ఎంపీడీవో, MEO లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.