జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ సమావేశం..
అనంతపురం, జూన్ 20 : అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం రాత్రి జాంబియా దేశానికి చెందిన డెలిగేట్స్ తో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాంబియా దేశము నుంచి 16 మంది డెలిగేట్స్ ఈనెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లాలలో ప్రకృతి వ్యవసాయంలో ఏ గ్రేడ్ మోడల్, ఏటీఎం మోడల్, DRPM మోడల్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వచ్చే నెలలో మన జిల్లా నుండి బాగా ప్రావీణ్యం పొందిన సుకన్యా, రవిచంద్ర, శివ శంకర్, సుధాకర్ లు జాంబియాలోని వ్యవసాయ విధానాలు వారికి నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జాంబియా టీం కు చెందిన సెబాస్టియన్, మాంజా, ముండియా, సెలిషియన్, సిటీ&ఎల్ఓ డిపిఎం లక్ష్మీ నాయక్, తదితరులు పాల్గొన్నారు..
Jun 22 2024, 10:49