నేను బడికి పోతా కార్యక్రమంలో ఎమ్యెల్యే బండారు శ్రావణి శ్రీ..
శింగనమల నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు బుక్కరాయసముద్రము మండలములో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొర్రపాడు గ్రామంలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్ పంపిణీ చేసి మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మరియు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు కుమారి బండారు శ్రావణి శ్రీ గారు విద్యార్థులను ఉద్దేశించి విద్యను బాగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అలాగే బడి బయట ఉండే పిల్లలందరిని బడిలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు మరియు ఎన్యూమరేటర్స్ అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPP దాసరి సునీత, సర్పంచ్, తహసిల్దార్, ఎంపీడీవో, MEO లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
వైద్యాఆరోగ్య శ్యాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కాటప్పగారి రామలింగారెడ్డి..
నూతనంగా బాధ్యతలు స్వికరించిన వైద్యాఆరోగ్య శ్యాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు
పెనకచెర్ల డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
పెనకచెర్ల డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..

శింగనమల నియోజకవర్గము: గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల డ్యాం ను శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డ్యాం కు సంబంధించిన 1,2, 13,14 రేడియల్ గేట్లు దెబ్బతిన్నాయి.గేట్లకు సంబంధించిన విద్యుత్ సరఫరా లేదు.జనరేటరు ఏర్పాటు చేశారు,ఇది కూడా మరమ్మతులు కు గురైంది.అంతేకాకుండా నార్త్,సౌత్ కెనాల్ కాలువలకు సంబంధించిన గేట్లు ఎక్కడికక్కడ పని చేయకుండా చిలిమిపట్టి ఉన్నాయి.ఈ గేట్లు ద్వారా కాలువలకు నీటిని వదలడం జరుగుతుంది.గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అధికారులు మిడ్ పెన్నారు పెనకచెర్ల డ్యామ్ కు సంబంధించి రూ.5.3 కోట్లు అంచనా తో అధికారులు నివేదిక అందించిన కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు,ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.వచ్చే వర్షా కాలం లోపు తక్షణ మరమ్మతులు కు వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు ఆదేశించారు.పూర్తిగా పునరుద్ధరణ పనులు కొరకు సంబంధించిన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి,పరిష్కరింప చేసేందుకు కృషి చేస్తానని శ్రావణి శ్రీ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కేశవరెడ్డి గారు,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమణ రెడ్డి గారు, ఎ. డబ్ల్యు.ఇ. సురేంద్ర గారు,ఇతర అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి ఘనంగా స్వాగతించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు..
అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహానికి మంగళవారం రాత్రి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ (జాయింట్ సెక్రటరీ & సిఈఓ, పి.ఎం.ఎఫ్.బి.వై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, న్యూఢిల్లీ) శ్రీ రితేష్ చౌహాన్ ఐ.ఏ.ఎస్ గారు చేరుకున్నారు. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం లీడర్ రితేష్ చౌహాన్ గారికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల..
అనంతపురం జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటాం.. పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం, జూన్ 18 : దేశంలోని వారణాసి నుంచి మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.* అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, రెడ్డిపల్లి సర్పంచ్ ఎస్. నరసమ్మ, ఎంపీపీ డి.సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ బి.సహదేవరెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.* - *జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేయడం జరిగిందని, జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. పీఎం కిసాన్ కింద 17 విడతలో భాగంగా రాష్ట్రంలో 40.91 లక్షల మంది రైతులకు 824.6 కోట్ల రూపాయల డబ్బును రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతోందని, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5.28 లక్షల మంది రైతులకు 106 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. అందులో అనంతపురం జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2.52 లక్షల మంది రైతులకు రూ.50.44 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి మన జిల్లా రైతులకు కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లో పంటతో పాటు ఆవు, మేక, కోళ్లు లాంటివి పెట్టుకోవాలని, పొలంలో రెండు మూడు రకాల ఎరువులు వేయడం, ఫారంపాండ్, ట్రెంచ్, బండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంట పెట్టడంతోపాటు పొలం చుట్టూ చెట్లను పెంచాలని, దాని ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించిన అంబికా లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే కరువు సీమ అని, ఇలాంటి ప్రాంతాల్లో అప్పు చేసి రైతులు పంటలు పెట్టినా నష్టపోతుంటారని, రైతులు పెట్టబడి నష్టపోకుండా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, భూమిలో ఎటువంటి పంట పండిస్తే ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యాన శాఖ కింద ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి సలహాలు అందించాలని అందజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పారని, దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందని, ప్రధానమంత్రి అందించిన సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లను, కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చూస్తామన్నారు. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుని రైతు పి.రాముకి జిల్లా కలెక్టర్, ఎంపీ అందజేశారు. అనంతరం ఐసిహెచ్ - 66 హైబ్రిడ్ విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ భార్గవి, రెడ్డిపల్లి కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎస్.ఎన్.మల్లేశ్వరి, ఎస్ఎంఎస్ హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సుధారాణి, క్రాఫ్ ప్రొటెక్షన్ శాస్త్రవేత్త శశికళ, వెటర్నరీ సైన్స్ శాస్త్రవేత్త మాధవి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ శాస్త్రవేత్త చందన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
శింగనమల మండల కేంద్రంలోని ఆత్మరామ దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని ఆత్మరామ దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్,

కలెక్టర్ ను ఘనంగా స్వాగతం పలికిన దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజ చేసిన అర్చకులు..
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శింగనమల నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ..
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించిన శింగనమల నియోజవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు.
తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక..
తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యుల ఆత్మీయ కలయిక..

అనంతపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల నుంచి *తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీం షేక్* గారి ఆధ్వర్యంలో *జి యం ఆర్ కన్వెన్షన్ హాల్* అనంతపూర్ నందు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో నయీం గారు మాట్లాడుతూ 2024 ఎన్నికల గెలుపుకు సంబంధించి చర్చించడం జరిగింది ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సాధించిన ఫలితాలు గురించి అలాగే రాబోవు రోజులలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ పాత్ర ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ *అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి గారు* పొట్ల రవి అన్న విశ్వనాథ్ అన్న బండారు రాఘవేంద్ర శింగనమల నియోజక వర్గ ఇన్చార్జి హేమంత్ యాదవ్ అనంతపూర్ అధ్యక్షులు జగన్ ఉరవకొండ ఇన్చార్జి సి ఎ వెంకటేష్ గుంతకల్ ఇన్చార్జి శివ తాడిపత్రి ఇన్చార్జి సోము, సి ఎ మురళీ, విష్ణు రాకేష్ వినోద్ కుషాల్ వెంకటేష్ తేజ అశోక్ మరియు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఆరు నెలల నుండి బోరు చెడిపోయి నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నందున బక్రీద్ సందర్భంగా మా సొంతం డబ్బులతో చేయించాము
సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జన చైతన్య కాలనీ నందు వైయస్సార్ ప్రభుత్వం లో ఆరు నెలల నుండి బోరు చెడిపోయి నీళ్లకు చాలా ఇబ్బందిగా ఉన్నందువల్ల  మా సొంతం ఖర్చులతో జన చైతన్య మహిళా నాయకురాలు బుక్కరాయసముద్రం మహిళా నాయకురాలు అంచల రంగమ్మ నార్పల వలి రఫీ ఖాదర్ వలి సంచుల భాష దాదు విటల్ ఆ బోరు చేయించాము బక్రీద్ సందర్భంగా మా సొంతం డబ్బులతో చేయించాము
1989-90 పదవతరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
1989-90 పదవతరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ZPH స్కూల్ లో 35 సంవత్సరాల తరువాత 1989-90 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది .ఈ కార్యక్రమంలో గురువులు రామప్ప, రమణ, ఆంజనేయులు, విమలమ్మ, మినా కుమారి మరియు పూర్వవిద్యార్థులు కాటప్పగారి రామలింగారెడ్డి,ప్రసాద్, మురళి, హనుమంతురెడ్డి, ప్రకాష్ రెడ్డి, విశ్వనాధ్ రెడ్డి, నాగమునయ్య,శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రంగయ్య, నాగరాజు, సుధాకర్ రెడ్డి,విజయ కుమారి, వరలక్ష్మి, సావిత్రి మరియు దాదాపు 120 మంది విద్యార్ధివిద్యార్థునులు హాజరుయినారు.