ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల..
అనంతపురం జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటాం.. పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం, జూన్ 18 : దేశంలోని వారణాసి నుంచి మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.* అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, రెడ్డిపల్లి సర్పంచ్ ఎస్. నరసమ్మ, ఎంపీపీ డి.సునీత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ బి.సహదేవరెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.* - *జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్* - *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సమ్మాన నిధి 17వ విడుత నిధులు విడుదల చేయడం జరిగిందని, జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. పీఎం కిసాన్ కింద 17 విడతలో భాగంగా రాష్ట్రంలో 40.91 లక్షల మంది రైతులకు 824.6 కోట్ల రూపాయల డబ్బును రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతోందని, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 5.28 లక్షల మంది రైతులకు 106 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరనుందన్నారు. అందులో అనంతపురం జిల్లాలో 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2.52 లక్షల మంది రైతులకు రూ.50.44 కోట్ల లబ్ధి కలుగుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ లబ్ధి మన జిల్లా రైతులకు కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు పొలాల్లో పంటతో పాటు ఆవు, మేక, కోళ్లు లాంటివి పెట్టుకోవాలని, పొలంలో రెండు మూడు రకాల ఎరువులు వేయడం, ఫారంపాండ్, ట్రెంచ్, బండ్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంట పెట్టడంతోపాటు పొలం చుట్టూ చెట్లను పెంచాలని, దాని ద్వారా ఆదాయం లభిస్తుందన్నారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల పొలాల్లో శాస్త్రవేత్తలు పర్యటించాలని, సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించిన అంబికా లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనంతపురం జిల్లా అంటే కరువు సీమ అని, ఇలాంటి ప్రాంతాల్లో అప్పు చేసి రైతులు పంటలు పెట్టినా నష్టపోతుంటారని, రైతులు పెట్టబడి నష్టపోకుండా శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి, భూమిలో ఎటువంటి పంట పండిస్తే ఉపయోగకరంగా ఉంటుంది, ఉద్యాన శాఖ కింద ఎలాంటి పంటలు సాగు చేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి సలహాలు అందించాలని అందజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రైతులకు 20 వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పారని, దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పీఎం కిసాన్ కింద 2 లక్షల 76 వేల మంది రైతులకు రూ.55.58 కోట్ల లబ్ధి కలుగుతోందని, ప్రధానమంత్రి అందించిన సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాసెసింగ్ యూనిట్లను, కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేలా చూస్తామన్నారు. రైతన్నలకు అన్ని విధాల అండగా ఉంటామని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో పలుచోట్ల, మున్సిపాలిటీలలో చెట్లను నరకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డుని రైతు పి.రాముకి జిల్లా కలెక్టర్, ఎంపీ అందజేశారు. అనంతరం ఐసిహెచ్ - 66 హైబ్రిడ్ విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఏ.ఆర్.ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు హెడ్ భార్గవి, రెడ్డిపల్లి కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. ఎస్.ఎన్.మల్లేశ్వరి, ఎస్ఎంఎస్ హోమ్ సైన్స్ శాస్త్రవేత్త సుధారాణి, క్రాఫ్ ప్రొటెక్షన్ శాస్త్రవేత్త శశికళ, వెటర్నరీ సైన్స్ శాస్త్రవేత్త మాధవి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ శాస్త్రవేత్త చందన, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Jun 19 2024, 07:41