NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన సిపిఎం మండల కార్యదర్శి

మర్రిగూడ మండల కేంద్రంలో, సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, మంగళవారం సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రచారం నిర్వహించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయ నాయకులను, దేశ విచ్ఛిన్నకర శక్తులను, రాజకీయ వ్యాపారస్తులను ఓడించాలని, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థి జహంగీర్ను గెలిపించాలని యాదయ్య కోరారు. నక్క సిరియాల, పల్లెటి లోకేష్, దుబ్బ ఎల్లెష్ తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: నామినేషన్ వేసిన బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

నల్లగొండ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తన నామినేషన్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కుమార్, కటికం సత్తయ్య గౌడ్, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ కు అధిక సంఖ్యలో తరలిరండి: బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపటి నామినేషన్ కార్యక్రమానికి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. భువనగిరి కోట మీద ఎగిరేది బిజెపి జెండానే అని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్. జయశంకర్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు,ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా నుండి బిజెపి, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నామినేషన్ ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

మే' డే ను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ

138వ 'మే' డే ను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి పిలుపునిచ్చారు. సోమవారము నల్లగొండ లో జరిగిన ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం లో మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాడానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశం లో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సయీద్ , సుమతమ్మ, దోటీ వెంకన్న, కొశాదికారి వెంకన్న జిల్లా నాయకులు జానీ, శంకర్,గుండె రవి, వెంకట్ రాములు, కోట్ల శోభ, లెనిన్, మల్లయ్య , నీల వెంకటయ్య, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

లారీ క్రిందికి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు.

వివరాలు ఇలా.. మునగాల మండలం, ముకుందపురం వద్ద ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసు కెల్లడం తో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

SB NEWS TELANGANA

SB NEWS SRPT

ఘనంగా సిపిఐ (ఎమ్ఎల్) ఆవిర్భావ దినోత్సవం

NLG: ఏప్రిల్ 22 న సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం, లెనిన్ 154 వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్ లు అరుణ పతాకాలను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి చారి, ఐఎఫ్టీయు జిల్లా, పట్టణ నాయకులు రావుల వీరేశ్, జానపాటి శంకర్, దాసరి నర్సింహా, బొమ్మపాల అశోక్, మాగి క్రాంతి, కత్తుల లింగుస్వామి, మహేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

మే 26 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

నల్గొండ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుండి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కో ఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ ఒక ప్రకటనలో తెలిపారు. 

ప్రధమ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ మే 6, మరిన్ని వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించగలరని సూచించారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: నామినేషన్ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి

ఈనెల 24న జరిగే నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా, నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించి కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీపీ మనిమద్ది సుమన్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: సాగర్ జలాశయంలో రోజురోజుకు పడిపోతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ రోజు సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 507.30 అడుగులు ఉంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీ లకు గాను 127.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6398 క్యూసెక్కులు ఉంది. కాగా ఇన్ ఫ్లో లేదు. గత సంవత్సరం ఇదే సమయంలో 523. 70 అడుగులు, 156.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది

SB NEWS TELANGANA

SB NEWS NLG

STREETBUZZ NEWS

.

సరంపేట లో చలివేంద్రం ఏర్పాటు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం సరంపేట గ్రామంలో, శ్రీ మహలక్ష్మి మీసేవ కోడల వెంకట్ రెడ్డి మరియు గ్రామ ప్రజల సహకారంతో మర్రిగూడ మండల ప్రజా గొంతుక రిపోర్టర్ నక్క సిరియాళ ఆధ్వర్యంలో, శనివారం సరంపేట ప్రధానోపాధ్యాయులు చింత శ్రీనివాసులు తో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సిరియాళ మాట్లాడుతూ.. మీసేవ వెంకట్ రెడ్డికి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు కు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలకు మరికొంతమంది ముందుకు రావాలని కోరారు.

SB NEWS NLG

STREETBUZZ NEWS NALGONDA DIST