జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ, లక్ష్మీ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు


మాజీ ఎంపీపీ తుమ్మల నరసయ్య గారి జ్ఞాపకార్థం వలిగొండ మండల కేంద్రంలో జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ లక్ష్మీ ల్యాబ్ సంయుక్తంగా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచితంగా బిపి షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది దాదాపు 75 మంది ఈ సేవలను వినియోగించుకున్నారు జీవన శ్రీ జనరిక్ ఫార్మసీ నిర్వాహకులు పిట్టల సుధాకర్ లక్ష్మీ ల్యాబ్ నిర్వాహకులు పసుల సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రతి నెల మొదటి ఆదివారం ఈ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించబడతాయని నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారాలు


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మోత్కూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య అధ్యక్షతన అవార్డుల ప్రధాన ఉత్సవం కొనసాగింది. నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న ప్రజా సేవకులను గుర్తించి మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం అభినందనీయమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు నరహరి తెలుగు ప్రాత్య కళాశాల విశ్రాంత ప్రధాన చార్యులు, గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. ట్రస్టు కార్యకలాపాలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను సన్మానించారు.

రాబోయే ఎన్నికల్లో ఫాసిస్టు బిజెపిని ఓడిద్దాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్


భువనగిరి: ఈ దేశం మూలవాసులైన దళితులపై దాడులను తీవ్రతరం చేసిన బిజెపిని రాబోయే ఎన్నికల్లో ఓడిద్దామని డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి( డి హెచ్ పి ఎస్)   యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ సమావేశం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కాశపాక దయాకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ బిజెపి మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాక దేశంలో మత సామరస్యం తీవ్రంగా దెబ్బతింది. దళితుల పైన దాడులు పెరిగినాయి. లౌకిక దేశాన్ని హిందూ రాజ్యాంగ మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంది.ప్రజలలో మత ప్రతిపాదికన చీలికలు తెచ్చి మతం ప్రజల వ్యక్తిగత జీవితాల నుండి రాజకీయాల్లోనికి చొరబడడం మూలంగా ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం. అంతేగాక మోడీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని తన గుప్పట్లోకి తీసుకుంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ కన్ను సన్నుల్లోని బిజెపి పదేండ్ల పరిపాలనలో దేశం సరిహద్దు ఉద్రిక్తతలు, దేశంలోపల మత విద్వేషాలు, గ్రామాల్లో కుల ఘర్షణలు మినహా బిజెపి దేశ ప్రజలకు చేసింది ఈ సమంతా మేలు జరగలేదు. పైగా దేశ ప్రజలందరి గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి పూనుకుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఒక పథకం ప్రకారంగా సకల ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలి.ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే దేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్‌ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్‌ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు అని అన్నారు.

దేశంలో 20% దళితులు ఉండగా వారికి బడ్జెట్లో కేటాయింపులు 20 శాతం ఎందుకు కేటాయించట్లేదని విమర్శించారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై 300 రేట్లు దాడులు పెరిగాయన్నారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులు అభద్రతలో జీవిస్తున్నారన్నారు.బిజెపి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఖాయమన్నారు మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి జొప్పించి రాజకీయాల్ని కలుషితం చేయడం విద్వేషాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం వంటి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతున్నారని విమర్శించారు బిజెపి పాలనలో దళితులు గిరిజనులు మహిళలు ఆదివాసీలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు రాజ్యాంగ రక్షణకు బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాస్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాశపాక దయాకర్, ఎర్రోళ్ల లింగస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సిలిగంజి వీరస్వామి,

ఎల్లంకి మహేష్, ఉప్పుల శాంతి కుమార్,ఇంజా హేమలత,కొమ్ము బాలు నరసింహ, చుక్క చంద్రశేఖర్, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల శాఖ ఆధ్వర్యంలో టిఫిన్ బైటక్ కార్యక్రమం


బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏప్రిల్ 6, సందర్భంగా భారతీయ జనతా పార్టీ 44 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి నాయకులు,కార్యకర్తలు ఇండ్ల ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు పార్టీ పిలుపుమేరకు ఈరోజు బూతులలో నాయకులు కార్యకర్తలు టిఫిన్ బైటెక్ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థగతంగా పార్టీ నిర్మాణం గురించి మరియు వచ్చే లోకసభ ఎన్నికల్లో భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్ గారిని ఏ విధంగా గెలిపించుకోవాలో ప్రణాళికలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భోళ్ళ సుదర్శన్, బందారపు లింగ స్వామి గౌడ్ , రాచకొండ కృష్ణ కొప్పుల యాదిరెడ్డి, దంతూరి సత్తయ్య, కనతాల అశోక్ రెడ్డి,లోడే లింగస్వామి, బందారపు రాములు,అప్పిషెట్టి సంతోష్, దయ్యాల వెంకటేష్, మందుల నాగరాజు, రేగురి అమరేందర్, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.

మునిపంపుల గ్రామంలో తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ నివాసి కునూరు పాండు తండ్రి సత్తయ్య వయసు 48 ఈరోజు ఉదయం రోజువారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారి కింద పడడం జరిగింది నడుము వెన్నుపూస మరియు ఎడమ కాలు కు దెబ్బలు తగిలినవి తోటి గీత కార్మికులు కుటుంబ సభ్యులు కలిసి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు .

విషయం తెలవగానే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పులిబిక్షం మండల నాయకులు తూర్పునూరు శ్రీనివాస బావుండపల్లి బాలరాజు బాలగోని మల్లయ్యగంగాపురం సైదులు మామిండ్ల రవి తేజ బాధితుని కునూరు పాండును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.  మాట్లాడుతూ పాండుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారుఎక్స్ గ్రేషయా నెలరోజుల లోపే వారి కుటుంబానికి అందించాలని కోరారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరగని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, కలెక్టర్ ఆదేశాలిచ్చి సాయంత్రంలోగా జరుగుటకు చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించలేదని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు అన్ని ఆఫీసులలో జయంతులు నిర్వహించేదని, ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున స్టాచు దగ్గరే జయంతి జరిపాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. బాబు జగ్జీవన్ రావ్ మహనీయుని వలనే ఈరోజు సెలవు తీసుకుని ఒక గంట సేపు జయంతి కోసం కేటాయించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చి సాయంత్రం వరకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ తదితర కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు. లేనియెడల దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని అన్నారు..

ఈనెల 6న మోత్కూరులో మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేదీ 6-04-24 శనివారం ఉదయం 10 గంటలకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం మోత్కూరు లో నిర్వహిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య ఆన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఉగాదికి నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న మహనీయులకు ఉగాది పురస్కారాలను అందించాలని, ఈ క్రోధినామ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఉగాది పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ భువనగిరి, గుర్రం కవిత లక్ష్మీ నరసింహారెడ్డి మోత్కూరు మున్సిపల్ చైర్మన్, మోత్కూరు నరహరి తెలుగు ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, అభినయ శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత, ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి తదితరులు హాజరై ఉగాది పురస్కార గ్రహీతలకు పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వేములకొండ మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత ...కేసు నమోదు చేసిన ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ శివారులో గల మూసి పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ని పక్కా సమాచారంతో గురువారం వలిగొండ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వేములకొండ గ్రామానికి చెందిన పులిపలుపుల శివకు చెందిన ట్రాక్టర్ గా పోలీసులు గుర్తించారు. ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి, నర్సయ్య గూడెం గ్రామాలలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వలిగొండ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏ పి ఎమ్ జానీ , రవీందర్, పంచాయతీ సెక్రెటరీ నరేందర్ , ఏఈఓ సాయి, వెల్వర్తి మహిళా సంఘం సభ్యులు అధ్యక్షురాలు ఎడవెల్లి పోచమ్మ,సభ్యురాలు పల్లె వాణి, బూడిద శ్రీలత,కల్కూరి నరసింహ, నర్సాయిగూడెం మహిళా సంఘం సభ్యులు అధ్యక్షులు మాదాని రోజా, పసల రాణి, పసల శ్రీదేవి. సింగాని పర్వతమ్మ ,పసల బాల రవి పాల్గొన్నారు.

ఈనెల 5 న భువనగిరిలో తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమం జయప్రదం చేయాలి: రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకిరికంటి మొగులయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వలిగొండ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శన్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగలయ్యాగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 6/4/ 2024 రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు అదే రోజు టిఫిన్ బైటెక్ లను బూతుల వారిగా నిర్వహించి విజయవంతం చేయాలని వారు కోరారు ,మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 45 రోజులపాటు ప్రతి బూతులలో ఇంటింటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరాలని వారు అన్నారు అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వీకరించరో వారి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా నాయకులు సత్తయ్య గౌడ్ స్టేట్ కౌన్సిల్ మేంబర్ ఏలే చంద్రశేఖర్ ,ప్రధాన కార్యదర్శి లోడ లింగస్వామి,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానేష గౌడ్, దయ్యాల వెంకటేష్ ,గంగదారి దయాకర్, డోగుపర్తి సంతోష్, మంద నరసింహ ,అప్పిశెట్టి సంతోష్, కొంతం రామచంద్రం ,మందాడి రంజిత్ రెడ్డి , మందుల నాగరాజు ,సంతోష్,బర్ల మల్లేశం దంతురు అరుణ్ ఎల్లంకి మురళి తదితరులు పాల్గొన్నారు.