ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం.. పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని గెలిపిద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
◆ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ.
పేదల పక్షాన నిలిచిన వైస్సార్సీపీని రానున్న ఎన్నికలలో మెజారిటీతో గెలిపించుకొని ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని వీరాంజనేయులు, ఎం.శంకర్ నారాయణ అన్నారు.
బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లి గ్రామంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా, పార్టీ జెండా ఊపి ఎన్నికల ప్రచారాన్ని నాయకులు, కార్యకర్తల మధ్య ఎం. శంకర్ నారాయణ, ఎం. వీరాంజనేయులు, పైలా నరసింహయ్య ప్రారంభించారు.
ముందుగా గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నీలాంపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి పాత చెదళ్ల, కొత్త చెదళ్ల, రోటరీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇంటింటికీ తిరిగి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేయడం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగించుకుందామన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే శింగనమల నియోజకవర్గాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ కరపత్రం అందజేస్తూ ఓటు అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులను కళ్లారా చూసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదల అభ్యున్నతి కోసం నవరత్నాల పథకాలు అమలు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. గత టిడిపి పాలనలో ప్రజలకు ఫలానా చేసాము అని చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో జగనన్న మీద తప్పుడు ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విదంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అభివృద్ధి చేసి చూపించారన్నారు. కరోనా సమయంలో నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకున్న పాపాన పోని టీడీపీ నాయకులు కూడ అభివృద్ధి గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న పథకాల కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
శంకర్ నారాయణ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులకు అవకాశం కల్పించిన వైస్సార్సీపీ పార్టీ పేదల పార్టీగా జగనన్న నిరూపించారన్నారు. చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్నవారికి మాత్రమే టికెట్లు కేటాయించారన్నారు. గత టిడిపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదన్నారు. ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్తుంటే సంక్షేమ పథకాలు అందడంతో తమ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. గొప్ప పాలన ఇలాగే కొనసాగాలి అంటే మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ మాల్యవంతం మంజుల, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Mar 24 2024, 08:22