రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..
గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దాచుకో.. దోచుకో అన్న చందంగా శింగనమల నియోజకవర్గంలో పరిస్థితి ఉందని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రోటరీపురం, కొర్రపాడు గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు వసుపల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు కన్వీనర్ అశోక్ లు తో పాటు తదితరులు హజరై మాట్లాడడం జరిగింది. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా... అభివృద్ధి అడ్రస్ లేదన్నారు. చెరువులు, కొండ గుట్టలు , ఇసుక రీచ్ ల నుంచి అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా ఎర్రమట్టి యదేచ్చగా తరలించి లక్షలాది రూపాయులు సొమ్ము చేసుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయులు అక్రమంగా సొమ్ము చేసుకున్నారన్నారని ఆరోపించారు. అభివృద్ధి అమడం దూరంలో ఉందన్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారో.. చూపించాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే.. మరోసారి సీఎంగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పుడు నుంచే ఓటర్లును ప్రలోబాలుకు గురి చేస్తోందన్నారు. వారి ఇచ్చే మద్యం, డబ్బుకు ఆశకు గురికావద్దన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏపీ అభివృద్ధి మరో పది సంవత్సరాల వెనక్కి పోయిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కన్వీనర్లు, అభిమానులు పాల్గొన్నారు.
నువ్వు వస్తానే... శ్రావణమ్మ... నియోజకవర్గం మేలు
నియోజకవర్గంకి నువ్వు వస్తానే... శ్రావణమ్మ నియోజకవర్గం అన్ని రకాలుగా మేలు జరుగుతుందని ఏ గ్రామానికి వెళ్లిన... ప్రజల మనుసులో ఉన్న మాట ... అప్యాయతగా చేబుతున్నారు. ఇంటింటా ప్రచారంకు వెళ్లిన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకు.. గ్రామాల్లో అపూర్వ మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీని నమ్మి మోసిపోయామని ఈ సారి తప్పకుండా నిన్ను గెలిపించుకునే బాధ్యత మాపై ఉందంటూ ఓటరులు
అమెతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు నీరాజానాలు పలుకుతున్నారు. ఎంతో సాంప్రదాయంగా మా ఇంటి అడ బిడ్డగా కుంకుమ
దిద్ది.. వారి అభిమానంతో... చీరలు ఇచ్చి.. తమ అభిమానంను చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకి బండారు శ్రావణిశ్రీ కు
ఆదరణ పెరుగుతుంది.
Mar 20 2024, 15:04