రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..

రాష్ట్రం అభివృద్ధి కావాలంటే.. బాబు రావాలి.. గ్రామాల్లో బండారు శ్రావణి శ్రీ కు అపూర్వ ఆదరణ..

గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో దాచుకో.. దోచుకో అన్న చందంగా శింగనమల నియోజకవర్గంలో పరిస్థితి ఉందని నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రోటరీపురం, కొర్రపాడు గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వారితో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు వసుపల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు కన్వీనర్ అశోక్ లు తో పాటు తదితరులు హజరై మాట్లాడడం జరిగింది. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా... అభివృద్ధి అడ్రస్ లేదన్నారు. చెరువులు, కొండ గుట్టలు ,  ఇసుక రీచ్ ల నుంచి అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా ఎర్రమట్టి యదేచ్చగా తరలించి లక్షలాది రూపాయులు సొమ్ము చేసుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయులు అక్రమంగా సొమ్ము చేసుకున్నారన్నారని ఆరోపించారు. అభివృద్ధి అమడం దూరంలో ఉందన్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారో.. చూపించాలన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే.. మరోసారి సీఎంగా చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రజలను మభ్యపెట్టడానికి ఇప్పుడు నుంచే ఓటర్లును ప్రలోబాలుకు గురి చేస్తోందన్నారు. వారి ఇచ్చే మద్యం, డబ్బుకు ఆశకు గురికావద్దన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏపీ అభివృద్ధి మరో పది సంవత్సరాల వెనక్కి పోయిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కన్వీనర్లు, అభిమానులు పాల్గొన్నారు.

 నువ్వు వస్తానే... శ్రావణమ్మ... నియోజకవర్గం మేలు

 నియోజకవర్గంకి నువ్వు వస్తానే... శ్రావణమ్మ నియోజకవర్గం అన్ని రకాలుగా మేలు జరుగుతుందని ఏ గ్రామానికి వెళ్లిన... ప్రజల మనుసులో ఉన్న మాట ... అప్యాయతగా చేబుతున్నారు. ఇంటింటా ప్రచారంకు వెళ్లిన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీకు.. గ్రామాల్లో అపూర్వ మద్దతు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీని నమ్మి మోసిపోయామని ఈ సారి తప్పకుండా నిన్ను గెలిపించుకునే బాధ్యత మాపై ఉందంటూ ఓటరులు

అమెతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళలు నీరాజానాలు పలుకుతున్నారు. ఎంతో సాంప్రదాయంగా మా ఇంటి అడ బిడ్డగా కుంకుమ

 దిద్ది.. వారి అభిమానంతో... చీరలు ఇచ్చి.. తమ అభిమానంను చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో రోజు రోజుకి బండారు శ్రావణిశ్రీ కు

ఆదరణ పెరుగుతుంది.

వైసీపీ మాజీ సర్పంచ్ తో సహ పలువురు టీడీపీలోకి చేరిక..

వైసీపీ మాజీ సర్పంచ్ తో సహ పలువురు టీడీపీలోకి చేరిక.. 

 *శింగనమల నియోజకవర్గంలో మొదలైన వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు 

బుక్కరాయసముద్రం, మార్చి 19: మండల పరిధిలోని కొర్రపాడు వైసీపీ మాజీ సర్పంచ్ చలపల లింగారెడ్డితో సహ పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బం డారుశ్రావణీశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు పసుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికారప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు టీడీపీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వనించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు టీడీపీలోకి చేరారు. వైసీపీ పార్టీలో అవినీతి అక్రమాలు తప్ప, అభివృద్ధి ఎక్కడ జరగలేదని, చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని భావనతోనే తిరిగి టీడీపీలోకి చేరినట్లు మాజీ సర్పంచ్ లింగారెడ్డి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుంది.. వీరాంజనేయులు ..

వైఎస్సార్సీపీతోనే పేదలందరికి మేలు.. శిగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందని వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రామిరెడ్డి, గాయత్రి, హమాలి కాలనీలలో పార్టీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.

ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా ఏర్పడిందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించాలని కోరారు. అమలు కాని వాగ్దానాలతో, ఉమ్మడి పొత్తులతో టీడీపీ ప్రజల్లోకి వస్తుందని వారిని నమ్మవద్దన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో అడ్డుకోవడానికి వస్తున్నారని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అలాంటి పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్న జగనన్నకు మరోసారి ఓటు వేసి గెలిపించాలన్నారు.

పెద్దమ్మ గుడి గోడ నిర్మాణానికి రూ.2.00 లక్షలు విరాళం

మండల కేంద్రంలోని హమాలీ కాలనీలో ఉన్న శ్రీ పెద్దమ్మ గుడి చుట్టూ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబ శివారెడ్డి సహకారంతో వైస్సార్సీపీ మండల నాయకులు ఆలూరు రమణారెడ్డి దాదాపు రూ.2.00 లక్షలు విరాళంగా అందజేశారు.

అడిగిన వెంటనే గుడి గోడ నిర్మాణానికి అందించిన ఎమ్మెల్యే దంపతులకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు..

సింగనమల నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి పార్టీల అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు.. ప్రచార కార్యక్రమంలో భాగంగా జంతులూరు గ్రామంలో విశేష జనం హాజరై ఘన స్వాగతం పలుకుతూ గ్రామంలోకి ఆహ్వానించారు 

త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీను భారీ మెజార్జీతో గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ టిడిపి, జనసేన,బీజేపీల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డిలు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జంతులూరు, కొత్తచెదళ్ల ,పాత చేదళ్ల గ్రామంలో టీడీసీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడిపీ ఉపాధ్యాక్షులు పనుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిది పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు హజరై మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలలో శింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి కంటే.. అవినీతి భారీగా జరిగిందన్నారు. టిడిపి గెలుపుతో.. శింగనమల నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా.. టీడీపీ అభ్యర్థికు అపూర్వ స్వాగతాలు పలుకుతున్నారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్లలేక పోతున్నారని ఆరోపించారు. రామన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

 ఏ గ్రామానికి వెళ్లిన... టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీ కు ఆపూర్వ స్పందన 

నియోజకవర్గంలో మీ అడ బిడ్డగా అని చెబుతూ... అందరి ఆదరా ఆభిమానలు సంపాదిస్తూ.. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ దూసుకెళ్తుంది. ఏ ఇంటికి వెళ్లి ఓటు అడిగినా.. మా ఓటు ఈ సారి నీకే... అంటూ మహిళలు గ్రామాల్లో కుంకమ దిద్ది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలులు శ్రావణిశ్రీ అభ్యర్థి ఎవరు ఆమె చూడటానికి ఉత్సాహంగా గ్రామాల్లోని ఉన్న వారు సైతం బయటికి వచ్చి ఎంతో అప్వాయతగా పలకరించి కరచనాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడిన కులాల వారు శ్రావణిశ్రీని ఒక్కసారి గెలిపించుకుందామని.. మన భవిష్యత్తుతో పాటు గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రజలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.

టీడీపీ నుంచి వైసీపీ లోకి చేరిక...

శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం దోసలేడు గ్రామంలో టీడీపీ 5 కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు సమక్షంలో వైసీపీలోకి చేరారు.

టీడీపీ చెందిన అంకె హరీష్ కుమార్, ఎ. రంగనాయకులు, ఎ. సీతారాముడు, ఎ.ఆంజనేయులు, ఎ.రమణయ్య లకు ఆలూరు సాంబ శివారెడ్డి వైఎస్సార్సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలే గెలుపు అస్త్రాలు.. మీ సేవకుడిగా ఉంటా..ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

సంక్షేమ పథకాలే గెలుపు అస్త్రాలు.. మీ సేవకుడిగా ఉంటా..ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

◆ నియోజకవర్గ వ్యాప్తంగా సాగిన పర్యటన..గ్రామాల్లో నీరాజనం పలికిన ప్రజలు

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నమ్మకంతో అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని వీరాంజనేయులు అన్నారు.

పుట్లూరు మండలం ఏ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి, కడవకల్లు, సంజీవపురం, ఓబుళాపురం, దోసలేడు, చెర్లోపల్లి, నారాయణరెడ్డిపల్లి, చాలవేముల, మడ్డిపల్లి, కుమ్మనమల, కొండుగారికుంట, రంగమనాయునిపల్లి, రంగరాజుకుంట, మడుగుపల్లి, జంగంరెడ్డిపేట, ఎల్లుట్ల గ్రామాల్లో పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్ఆర్సిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి పలకరించారు. గ్రామాల్లో ప్రజలను ఆప్యాయంగా పకరిస్తూ, సంక్షేమ పథకాలు వివరించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న అవకాశం కల్పించారని, రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి, సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ప్రజలను కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. పేదలు, పెత్తందారులకు మధ్య జరిగే ఎన్నికల యుద్ధంలో జగనన్న సంక్షేమ పథకాలే విజయానికి అస్త్రాలన్నారు. ప్రతి ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ అడ్డదారిలో అధికారంలోకి రావాలని కుటిల యత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబుకు జగనన్న భయం పట్టుకుంది కాబట్టే ఒంటరిగా పోటీ చేయడం చేతకాక కూటమి ఏర్పాటు చేసుకున్నారని అపహాస్యం చేశారు. రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పితే ప్రజలకు మంచి చేయాలని స్పృహ బాబు కు లేదని విమర్శించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అందించిన సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చడంతోపాటు పేదలకు నేనున్నా..అన్న భరోసా కల్పించి వారి ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, రంగాలకు పెద్దపీట వేశారన్నారు. జగనన్న చెప్పిందే చేస్తారని, చేయగలిగింది చెప్తారని స్పష్టం చేశారు. 

నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల పరిధిలోని ప్రతి గ్రామాల్లోని ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను, ప్రజలను పలకరించారు. ఆత్మీయ పలకరింపు పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

పుట్లూరు మండలం తిమ్మాపురం, శనగలగూడూరు, గాండ్లపాడు, తక్కళ్ళపల్లి, పుట్లూరు, పి.చింతలపల్లి, గోపరాజుపల్లి, సి.వెంగన్నపల్లి, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, చింతకుంట కందికాపుల గ్రామాలలో నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ పర్యటించారు.

గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతో ప్రజలు తమ అభిమానాన్ని ఊరూరా చాటుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అవ్వతాతలను, ప్రజలను ఆప్యాయంగా పలకరించి, రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇలాంటి గొప్ప పథకాలు అందుతాయని వివరించారు.

ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేసి మరోసారి వైస్సార్సీపీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. జగనన్న పరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలని ఇంటింటికి వెళ్లి వారికి వివరించామన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుందన్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంతో ప్రతిపక్ష పార్టీలు ఇళ్ల వద్దకు వచ్చి మోస మాటలు చెబుతారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీలను ఓడించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు, పల్లె పల్లె అభివృద్ధితో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న జగనన్నని మళ్లీ గెలిపించుకుందామన్నారు.

శంకర్ నారాయణ మాట్లాడుతూ.. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యాన్ని అందించారని, 2024 లో వైఎస్ఆర్సిపి ఏ పార్టీలతో పొత్తు లేకుండా సింగల్ గా ఎన్నికలకు వెళ్లి 175 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలి అంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

హాస్పిటల్ నందు చికత్స పొందుతున్న రాబిన్ శర్మ టీం లోని బాలు గారిని పరామర్శించిన శింగనమల నియోజకవర్గం

శింగనమల నియోజకవర్గంలోనీ ఆరోగ్యం సరిగా లేక ప్రవేట్ హాస్పిటల్ నందు చికత్స పొందుతున్న రాబిన్ శర్మ టీం లోని బాలు గారిని పరామర్శించిన శింగనమల నియోజకవర్గం (టీడీపీ-జనసేన -బీజేపీ) ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు, ఆలం నరసనాయుడు గారు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు*

రాజకీయ చరిత్రలో సంచలనాత్మకం సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యే టికెట్ శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఎం. వీరాంజనేయులు

సామాజిక సమీకరణలో భాగంగా.. శింగనమల మండలం సి. బండమీద పల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు(మాదిగ)ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్రకటించారు.

మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యం. వీరాంజనేయులను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్పారు. వీరాంనేజియులుకు సహకరిస్తామని, అదేవిధంగా 2019 లో అత్యదిక మెజారిటీతో గెలిచిన విధంగా 2024 లో అదే మెజారిటీతో గెలిపించుకొని  జగనన్నకు గిఫ్ట్ గా ఇస్తామని ఆమె అన్నారు.

జగనన్నకు రుణపడి ఉంటాము: యం. వీరాంజినేయులు

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా గొప్ప విషయమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వం విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానని వీరాంజనేయులు అన్నారు.

నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఈ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం అని, నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేస్తానన్నారు. 

నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో ప్రజలు పార్టీకి అపూర్వ స్వాగతం పలుకుతున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు.

యల్లనూరు మండలం కూచివారిపల్లి, బొప్పేపల్లి, వాసాపురం, బుక్కాపురం, ఆరవేడు, కొడవండ్లపల్లి, చింతకాయమంద, గొడ్డుమర్రి, సింగవరం, ఎస్.కొత్తపల్లి, కల్లూరు, దుగ్గుపల్లి, వెంకటాంపల్లి, దంతలపల్లి, నిర్జంపల్లి గ్రామాల్లో  నాయకులతో కలసి పర్యటించారు.

వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మరోసారి జరగాలంటే వైఎస్ఆర్సిపి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించామన్నారు. గత ప్రభుత్వాల హయంలో, ఇప్పుడు తమ కుటుంబాలకు జరిగిన మేలును ప్రజలు భేరీజు వేసుకోవాలన్నారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి టిడిపి రాగానే ఆ పార్టీ మేనిఫెస్టోను వెబ్ సైట్ లో నుంచి మాయం చేశారని, హామీలతో ప్రజలను వంచించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం మళ్లీ మాయమాటలతో వస్తున్నారని, ఈ పర్యాయం వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా ఉన్న పథకాలతోనే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని నానాయాగీ చేసిన వాళ్లు ఇప్పుడు ప్రజలను కోటీశ్వరులను చేస్తామంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా గొప్ప విషయమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.

నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అభిమాన సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు