బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు..
సింగనమల నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి పార్టీల అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ కి బ్రహ్మరథం పడుతున్న బుక్కరాయసముద్రం మండల ప్రజలు.. ప్రచార కార్యక్రమంలో భాగంగా జంతులూరు గ్రామంలో విశేష జనం హాజరై ఘన స్వాగతం పలుకుతూ గ్రామంలోకి ఆహ్వానించారు
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీను భారీ మెజార్జీతో గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గ టిడిపి, జనసేన,బీజేపీల ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, ద్విసభ్యకమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటి మడుగు కేశవరెడ్డిలు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండల పరిధిలోని జంతులూరు, కొత్తచెదళ్ల ,పాత చేదళ్ల గ్రామంలో టీడీసీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడిపీ ఉపాధ్యాక్షులు పనుపుల హనుమంతురెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిది పర్వతనేని శ్రీధర్ బాబు, కన్వీనర్ అశోక్ లు హజరై మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలలో శింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి కంటే.. అవినీతి భారీగా జరిగిందన్నారు. టిడిపి గెలుపుతో.. శింగనమల నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా.. టీడీపీ అభ్యర్థికు అపూర్వ స్వాగతాలు పలుకుతున్నారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికీ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లోకి వెళ్లలేక పోతున్నారని ఆరోపించారు. రామన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
ఏ గ్రామానికి వెళ్లిన... టీడీపీ అభ్యర్థి శ్రావణిశ్రీ కు ఆపూర్వ స్పందన
నియోజకవర్గంలో మీ అడ బిడ్డగా అని చెబుతూ... అందరి ఆదరా ఆభిమానలు సంపాదిస్తూ.. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ దూసుకెళ్తుంది. ఏ ఇంటికి వెళ్లి ఓటు అడిగినా.. మా ఓటు ఈ సారి నీకే... అంటూ మహిళలు గ్రామాల్లో కుంకమ దిద్ది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలులు శ్రావణిశ్రీ అభ్యర్థి ఎవరు ఆమె చూడటానికి ఉత్సాహంగా గ్రామాల్లోని ఉన్న వారు సైతం బయటికి వచ్చి ఎంతో అప్వాయతగా పలకరించి కరచనాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనకబడిన కులాల వారు శ్రావణిశ్రీని ఒక్కసారి గెలిపించుకుందామని.. మన భవిష్యత్తుతో పాటు గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రజలు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు.
Mar 20 2024, 06:50