సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
సంక్షేమ పాలనకు ప్రజల పట్టం.. శింగనమలలో వైఎస్సార్సీపీ జెండాను ఎగరేద్దాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు.
పుట్లూరు మండలం తిమ్మాపురం, శనగలగూడూరు, గాండ్లపాడు, తక్కళ్ళపల్లి, పుట్లూరు, పి.చింతలపల్లి, గోపరాజుపల్లి, సి.వెంగన్నపల్లి, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, చింతకుంట కందికాపుల గ్రామాలలో నియోజకవర్గ పరిశీలకులు రమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ పర్యటించారు.
గ్రామాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడంతో ప్రజలు తమ అభిమానాన్ని ఊరూరా చాటుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అవ్వతాతలను, ప్రజలను ఆప్యాయంగా పలకరించి, రానున్న ఎన్నికల్లో "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఇలాంటి గొప్ప పథకాలు అందుతాయని వివరించారు.
ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేసి మరోసారి వైస్సార్సీపీ జెండాను నియోజకవర్గంలో ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. జగనన్న పరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలని ఇంటింటికి వెళ్లి వారికి వివరించామన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుందన్నారు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడటంతో ప్రతిపక్ష పార్టీలు ఇళ్ల వద్దకు వచ్చి మోస మాటలు చెబుతారని, వారిని నమ్మవద్దన్నారు. ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీలను ఓడించాలన్నారు. సంక్షేమ పథకాల అమలు, పల్లె పల్లె అభివృద్ధితో ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్న జగనన్నని మళ్లీ గెలిపించుకుందామన్నారు.
శంకర్ నారాయణ మాట్లాడుతూ.. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలతో ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే ధైర్యాన్ని అందించారని, 2024 లో వైఎస్ఆర్సిపి ఏ పార్టీలతో పొత్తు లేకుండా సింగల్ గా ఎన్నికలకు వెళ్లి 175 గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలి అంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థి అయిన తనను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమాన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 19 2024, 06:57