విపక్షాలన్నీ ఏకమైనా జగనన్నను ఓడించలేవు.. ఓటమి భయంతో టీడీపీ పొత్తులు..శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజి నేయులు..
విపక్షాలన్నీ ఏకమైనా జగనన్నను ఓడించలేవు.. ఓటమి భయంతో టీడీపీ పొత్తులు..
◆ సంక్షేమ పథకాల లబ్ధితో ప్రజలు నిరాజనం
శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజి నేయులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని చూసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందనే, ఓటమి భయంతో టిడిపి పొత్తులతో వస్తోందని ఎం వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం దుర్గం, సిద్దరాచెర్ల, బోయకొట్టాల, గొల్లపల్లి, బండ్లపల్లి, మాలవాండ్లపల్లి, బొమ్మకుంటపల్లి, పప్పూరు, మంగపట్నం, సోదనపల్లి, గుంజేపల్లి, నల్లపరెడ్డిపల్లి, గంగనపల్లి, ముచుకుంటపల్లి, గూగూడు, నడింపల్లి గ్రామాలలో వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పర్యటించారు.
ముందుగా స్థానికులు స్వాగతం పలిచారు. అనంతరం గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజలను అబద్ధపు హామీలతో టీడీపీ పొత్తులతో మోసం చేయటానికి వస్తోందని నమ్మొద్దని తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వపు సంక్షేమ పాలన మళ్ళీ కావాలి అంటే "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. 2014 లో అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదన్నారు. అదే కోవలో 2024 లో నెరవేర్చలేని హామీలతో ప్రజలని మోసం చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై మోసం చేయడానికి వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు చెప్పని హామీలను కూడా చేసి చూపించిన ఘనత దక్కుతుందన్నారు. గ్రామాల్లో వెళ్ళినప్పుడు జగనన్న పాలన ఏవిధంగా ఉందో ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే అర్థమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
గ్రామ సచివాలయాలతో గ్రామ స్వరాజ్యం సాకారం
సచివాలయ వ్యవస్థతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారని ఎం. వీరాంజనేయులు అన్నారు.
నార్పల మండలం హెచ్. సోదనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం, డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాల నూతన భవనాలను మరియు పి. బండమీదపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనాన్ని ప్రజా ప్రతినిధులు వైయస్సార్సీపి నాయకులు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటికే చేర్చిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు పాలన మరింత దగ్గర చేశారన్నారు. విలేజ్ క్లినికల్ ద్వారా గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే వైద్యాన్ని అందించారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాలు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
Mar 17 2024, 09:37