వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
వైఎస్సార్సీపీకి గ్రామాల్లో అపూర్వ స్వాగతం..మంచి చేసిన జగనన్నను గెలిపించండి.. శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లో ప్రజలు పార్టీకి అపూర్వ స్వాగతం పలుకుతున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు.
యల్లనూరు మండలం కూచివారిపల్లి, బొప్పేపల్లి, వాసాపురం, బుక్కాపురం, ఆరవేడు, కొడవండ్లపల్లి, చింతకాయమంద, గొడ్డుమర్రి, సింగవరం, ఎస్.కొత్తపల్లి, కల్లూరు, దుగ్గుపల్లి, వెంకటాంపల్లి, దంతలపల్లి, నిర్జంపల్లి గ్రామాల్లో నాయకులతో కలసి పర్యటించారు.
వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రజల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో మరోసారి జరగాలంటే వైఎస్ఆర్సిపి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుందామని కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించామన్నారు. గత ప్రభుత్వాల హయంలో, ఇప్పుడు తమ కుటుంబాలకు జరిగిన మేలును ప్రజలు భేరీజు వేసుకోవాలన్నారు. 2014లో ఎన్నికల్లో అధికారంలోకి టిడిపి రాగానే ఆ పార్టీ మేనిఫెస్టోను వెబ్ సైట్ లో నుంచి మాయం చేశారని, హామీలతో ప్రజలను వంచించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం మళ్లీ మాయమాటలతో వస్తున్నారని, ఈ పర్యాయం వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా ఉన్న పథకాలతోనే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని నానాయాగీ చేసిన వాళ్లు ఇప్పుడు ప్రజలను కోటీశ్వరులను చేస్తామంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారన్నారు.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా గొప్ప విషయమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపాదించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డికి రుణపడి ఉంటానన్నారు.
నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అభిమాన సంఘాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Mar 17 2024, 09:27