జగనన్న నెరవేర్చిన దశాబ్దాల కల.. ప్రజల చిరకాల స్వప్నం శింగనమల చెరువు లోకలైజేషన్.. ఈ చారిత్రక విజయానికి నిదర్శనం స్థూపం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్
జగనన్న నెరవేర్చిన దశాబ్దాల కల.. ప్రజల చిరకాల స్వప్నం శింగనమల చెరువు లోకలైజేషన్.. ఈ చారిత్రక విజయానికి నిదర్శనం స్థూపం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
రాష్ట్రంలో అనేక ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు పరిపాలించినా శింగనమల చెరువు లోకలైజేషన్ చేసిన వారు లేరని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, నాలుగున్నర దశాబ్దాల ప్రజల కలను నెరవేర్చారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
శింగనమల రంగరాయల చెరువు లోకలైజేషన్ సాధించడంతో ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని మరువకొమ్మలో నియోజకవర్గ రైతులు ఏర్పాటు చేసిన స్థూపాన్ని ఆమె ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...శింగనమల రంగరాయల చెరువు జిల్లాలోనే అతి పెద్దదన్నారు. ఈ చెరువులో నీరు ఉంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల అనేక గ్రామాల రైతన్నలు వ్యవసాయం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందన్నారు. గతంలో లోకలైజేషన్ అనే వాటిని రాజకీయ పార్టీలు 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశారన్నారు. ఒకానొక దశలో టిడిపి హయాంలో లోకలైజేషన్ జీవో తెచ్చామని ప్రచారం చేసుకున్నారన్నారు. ప్రజలు వారిమాటలు నమ్మలేదన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పల బహిరంగ సభలో లోకలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదన్నారు. కనీసం నీరు విడిపించే దిక్కు లేకుండా పోయిందన్నారు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించే విధంగా జీవో తీసుకురావడం జరిగిందన్నారు. శింగనమల ప్రజల చిరకాల కోరిక లోకలైజేషన్ చేసి నెరవేర్చారన్నారు.
ఈ చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో హంద్రీ-నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి మిడ్ పెన్నార్ అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయన్నారు. ఈ లోకలైజేషన్ చేయడం ద్వారా చెరువులో నీరు ఉంటే 300 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో ఆధారం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, మత్స్యకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Mar 17 2024, 09:21