కాంగ్రెస్ కోట గేట్లు తెరిచాం ఇక బిఆర్ఎస్ ఖాళీ

చేరికలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా కాంగ్రెస్‌‌కు నష్టం లేదని తెలిపారు. తాము గేట్లు తెరిచాం.. ఇక బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.

కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే కుట్రలు చేసి.. ఓడగొట్టుకున్న ఘనత బీఆర్ఎస్‌దే అని ఎద్దేవా చేశారు.

కాగా, రెండ్రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహిం చిన సభలో సరిగ్గా ఇదే హెచ్చరికను బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

పదే పదే ప్రభుత్వం కూలి పోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే కల్వ కుంట్ల కుటుంబ సభ్యులు తప్పా ఆ పార్టీలో ఎవరూ ఉండబోరు అని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు.

అయితే, తాజాగా.. తాము గేట్లు ఆల్రేడీ తెరిచామని బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని సీతక్క చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి...

తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.

ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.

ఆయా తేదీల్లో పరీక్షలకు హాజర య్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశిం చేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నట్లు గురు వారం మార్చి 14 ప్రకటిం చింది.టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

తాజా నిబంధనతో 9.35 గంటల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి స్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపో జిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించ నున్నారు.

ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలా జికల్ సైన్స్ పరీక్షలు జరిగే రెండు రోజులలో ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జరుగు తాయి.

పదో తరగతి పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఐదు నిమి షాల గ్రేస్ టైమ్ ఉంటుం ది.కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయ నున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణా రావు తెలిపారు.

ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

పరీక్షలను పర్యవేక్షించేం దుకు ఒక్కో పరీక్ష కేంద్రంలో విద్య, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో అధికారి, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబు ళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమిం చారు.

విద్యార్థులకు తప్పు ప్రశ్న పత్రాలు జారీ చేస్తే ఇన్విజి లేటర్లనే బాధ్యులుగా చేయా లని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరిం టెండెంట్‌ వివరణలు కోరాలని ఆదేశించారు.

అటువంటి వారిపై తెలం గాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్స్‌ ఆఫ్‌ మాల్‌ప్రా క్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 1997 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికా రులు తెలిపారు..

యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియామకం

యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావుపై ప్రభు త్వం బదిలీ వేటువేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్య టనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోప ణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమ యంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు.

దీంతో ఉపముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని... తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు.

అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై చర్యలు తీసుకు న్నారు. యాదాద్రి ఈవోగా భాస్కర్ రావును నియమి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రేపటి నుంచి వెహికిల్స్ రిజిస్ట్రేషన్ TG మీదనే: మంత్రి పొన్నం ప్రభాకర్

శాసన సభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తు న్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ… గత కేసీఆర్ ప్రభు త్వం ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను అణిచి వేసిందని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమం సమ యంలో అందరూ టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల ఆకాం క్షలను కాలరాసి టీఎస్ అని పెట్టారన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక శాసనసభ తీర్మానం మేరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా టీఎస్‌ ను టీజీగా మారుస్తున్నట్లు తెలిపారు.

ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖను పంపించామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికిల్స్ అన్నీ టీజీ మీదనే అవుతాయన్నారు...

ఇంటి వద్దకే ఆర్టీసీ పార్సల్ డెలివరీ

ఆదాయం పెంచుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌ విభాగ నెట్‌వర్క్‌ను మరిం తగా విస్తరిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థటీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

వినియోగదారులకు వేగ వంతమైన సేవలందిం చేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌ మోడల్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. కొత్త కౌంటర్‌ లో ఒక పార్శిల్‌ ను బుకింగ్‌ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు.

అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరిం చారు. పార్శిళ్ల హోం పికప్‌, డెలివరీ కోసం వినియోగిం చే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లా డుతూ..టీఎస్‌ఆర్టీసీ లాజి స్టిక్స్‌ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు.

ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయిం చిన సంస్థ.. ప్రయివేటు మార్కెట్‌కు ధీటుగా లాజి స్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నదని తెలిపారు.

లాజిస్టిక్స్‌ సేవలకు సంబం ధించి సలహాలు, సూచన లు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు.

కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి : మల్లారెడ్డి ❓️

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తు న్నాయి తాజా పరిణామా లు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది.బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌ తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరు వురు దాదాపు సిద్ధమ య్యారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్ర వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమిం చారు.

ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రి యను చేపట్టింది. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు.దీంతో రెండు ఎన్నికల కమి షనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి.

తాజాగా ఆ పదవులనే భర్తీ చేశారు. దేశంలో మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్ని కలు జరగాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిషన్ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిష నర్‌లు ఉంటారు.

రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో వెంటనే వాటిని భర్తీచేయాల్సి వచ్చింది. సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషనర్లగా నియామకం అయ్యారు

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

అమరావతి: తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది..

1 గాజువాక-పల్లా శ్రీనివాసరావు

2. మాడుగుల- పైల ప్రసాద్

3. రంపచోడవరం - మిర్యాల శిరీష

4. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

5. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

6. దెందులూరు-చింతమనేని ప్రభాకర్

7. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజ్జీర్

8. గిద్దలూర్-అశోక్ రెడ్డి

9. పెద్దకూరప్రాడు-భాష్యం ప్రవీణ్

10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

12. కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు

13. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

14. కోవూర్- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

16. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

17. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి

18. నందికొట్కూర్- గిత్త జయసూర్య

19. కదిరి-కందికోట యశోదా దేవి

20. మాడుగుల-ఫైలా ప్రసాద్

21. కందుకూర్ - ఇటూరి నాగేశ్వరరావు

22. మదనపల్లి-షాజహాన్ భాషా

23. గాజువాక- పల్లాశ్రీనివాసరావు.

Gold Smuggling: రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు..

ఈ క్రమంలో రూ.40.08 కోట్ల విలువైన 61.08 కిలోల విదేశీ బంగారం, రూ.13 లక్షల నగదు, 17 కార్లు, 30 మొబైల్స్, 21 ఇంటర్నెట్ డాంగిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌ఐ పాట్నా, ముజఫర్‌పూర్, గోరఖ్‌పూర్, అస్సాం యూనిట్లు పాల్గొన్నాయి..

వాస్తవానికి గౌహతిలోని నివాస సముదాయం నుంచి బంగారం స్మగ్లింగ్ సిండికేట్(syndicate smuggling) నిర్వహిస్తున్నట్లు DRIకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అస్సాం యూనిట్ ఏజెన్సీ పలు చోట్ల సోదాలు చేయగా 22.74 కిలోల బరువున్న 137 బంగారు బిస్కెట్లు, రూ.13 లక్షల నగదు లభించాయి. అలాగే 21 వాహనాల తాళాలు, 30 మొబైల్ ఫోన్లు, 25 ఇంటర్నెట్ డాంగిల్స్ స్వాధీనం చేసుకోగా, ఆ ఇంట్లో ఆరుగురిని అరెస్టు చేశారు..

Simultaneous polls: 'జమిలి ఎన్నికల'పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

దిల్లీ: 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది..

ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు.

దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం..

ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది..