నార్పల మండల కేంద్రం లో నాగిరెడ్డి అనే వ్యక్తి పై కొడవళ్ళతో దాడి..
:అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని వేరుసెనగ మిల్లు వద్ద నాగిరెడ్డి అనే వ్యక్తి పై చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి..
తీవ్ర రక్తస్రావం కావడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు...
సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
సంక్షేమ పాలన కోసం.. జగనన్నను గెలిపించుకుందాం.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన కొనసాగాలంటే రానున్న ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
గార్లదిన్నె మండల కేంద్రంలో, మరియు జమ్ములదిన్నె, జమ్ములదిన్నె కొట్టాలు,ఓబుళాపురం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
గడపగడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన గురించి ఆరా తీశారు. అవ్వా,తాతలను పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... పేద ప్రజలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైస్సార్సీపీ పార్టీని స్థాపించారన్నారు. ప్రజలకు జగనన్న చేస్తున్న మేలును మరచి పోలేనిదన్నారు. వైఎస్సార్సీపీ ని ఓడించాడానికి చంద్రబాబు నాయుడు పొత్తులతో వస్తున్నాడన్నారు. సీఎం జగనన్నకు ప్రజల అండ ఉన్నంత వరకు ఏమి చేయలేన్నారు. జగనన్న మేలు మరువద్దని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి గా ఆయన్నే చేసుకుందామన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
ఆశీర్వదించండి..అండగా ఉంటాను.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు
రానున్న ఎన్నికలలో వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వీరాంజనేయులు కోరారు.
గార్లదిన్నె మండలం కోటంక, మార్తాడు గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
ఇంటింటికీ వెళ్ళి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు మళ్ళీ కావాలంటే వైఎస్ఆర్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎం గా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో పొత్తులపై వస్తున్నారన్నారు. జగనన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇంటింటికి చేకూర్చారన్నారు. ప్రజలు ఓటు రూపంలో ఫ్యాన్ కు ఓటు వేసి వైఎస్సార్సీపీ ని గెలిపించుకొని గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పేదల ఆశాజ్యోతి జగనన్న.. వైఎస్సార్సీపీని గెలిపించండి.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
పేద, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎల్బీ కాలనీ, జన చైతన్య కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.
గడపగడపకు వెళ్లి ప్రజలను ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, సంక్షేమ పాలనపై అరా తీస్తూ, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగలంటే వైస్సార్సీపీ 'ఫ్యాన్' గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎంగా వైఎస్ జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జగనన్న పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని ప్రజలంతా ఆయనను ఆశీర్వదించాలన్నారు. ఎన్నికల కోసం తప్పుడు వాగ్దానాలతో ఇంటింటికి వస్తు ప్రజలని మోసం చేయడానికి టీడీపీ జనసేన కలిసికట్టుగా వస్తున్నారనే విషయం గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంతకు మించిన సంక్షేమం, అభివృద్ధి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు..
-సీఎం జగనన్నతోనే గ్రామాభివృద్ధి
శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎల్బీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన ప్రారంభించారు.
యం. జి.యన్.ఆర్.ఇ. జి. యస్ క్రింద రూ.20.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమానంగా చూస్తోందని, ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులు జోరుగా చేపట్టడం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీ పాలనలో చేయని అభివృద్ధిని నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలోని జన చైతన్య కాలనీలో ఉన్న మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆలూరు రమణారెడ్డి చేతుల మీదుగా రూ.2 లక్షల సొంత నిధులను ముస్లిం పెద్దలకు అందజేశారు.
గత టిడిపి ప్రభుత్వ పాలనలో మసీదు కాంపౌండ్ గోడ నిర్మాణం చేసుకోండి అని చెప్పి నిర్మించిన తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వంత ఖర్చుతో గోడను నిర్మించుకున్నాము అని , గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వచ్చినప్పుడు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడంతో కాంపౌండ్ గోడ ఖర్చు తామే ఇస్తామని మాట ఇచ్చి నేడు మాట నిలుపుకున్నారని ముస్లిం పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తమ కాలనీల్లో అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాలతో పాటు, అమ్మ ఒడి, వైయస్సార్ ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు వంటి పలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఇలాంటి పాలన మళ్ళీ రావడం కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని వారు తెలిపారు.
అడిగిన వెంటనే స్పందించి సహాయం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివరెడ్డికి ఆలూరు రమణారెడ్డికి ముస్లిం పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి గా కాటప్పగారి రామలింగారెడ్డి నియామకం..
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి గా కాటప్పగారి రామలింగారెడ్డి నియామకం..
శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలోని టీడీపీ సీనియర్ నాయకుడు కాటప్పగారి రామలింగారెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యనిర్వాహ కార్యదర్శిగా ఎన్నిక చేశారు. కాటప్పగారి రామలింగారెడ్డి గారు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి , జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలిపినారు.
సమిష్టి కృషితోనే విజయ బావుటా.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
సమిష్టి కృషితోనే విజయ బావుటా.. శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
వైఎస్సార్సీపీ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమిష్టిగా కృషి చేయాలని వీరాంజనేయులు కోరారు.
గార్లదిన్నె మండలం బూదేడు, ఎర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు.
గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి ప్రజలను పలకరిస్తూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ' ఫ్యాన్' గుర్తుకు ఓటు వేసి మళ్ళీ సీఎం గా వైఎస్ జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు.
ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పార్టీ బలోపేతానికి ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు అవుతానన్నారు. నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అండగా ఉంటానన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సంక్షేమ సారథి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే విధంగా అందరం కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ.. మద్దతు కోరుతూ..సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పర్యటించారు.
ఆప్యాయంగా పలకరిస్తూ.. మద్దతు కోరుతూ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని విరుపాక్షి నగర్ , గుజ్జల సరళాదేవి నగర్ లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు పర్యటించారు.
ఇంటింటికీ వెళ్ళి మహిళలు, వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసి మళ్ళీ సీఎం గా జగనన్ననే ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ... జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మక జగనన్నకే మద్దతు ఇచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటికి వెళ్లి జగనన్న పాలన పై అడుగుతుంటే మునుపెన్నడు లేనివిధంగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందుతున్నాయని ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బ్రిడ్జి ప్రారంభోత్సవం...
◆ రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి.
◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.
◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బ్రిడ్జి ప్రారంభోత్సవం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిరంతరాయంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని ఆలూరు సాంబ శివారెడ్డి, ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రం పరిధిలో ఉన్న విరుపాక్షి నగర్ లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, మరియు బ్రిడ్జి ను, గుజ్జలసరళాదేవి నగర్ లో మంచినీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పైపు లైన్ మోటర్ ను వారు ప్రారంభించారు.
దాదాపు రూ.23.00 లక్షలతో సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణం చేశారు మరియు మంచి నీటి సౌకర్యం కోసం దాదాపు రూ.2.50 లక్షల నిధులతో బోర్, పైపు లైన్, మోటార్ లను ఏర్పాటు చేశారు.
వారు మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల వద్దకు ధైర్యంగా వెళుతున్నామన్నారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Mar 11 2024, 07:44