సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి.. రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..
సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలి..
రాబోయే రోజుల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించాలి.. జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి..
సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ
అనంతపురం, మార్చి 06 :
సార్వత్రిక ఎన్నికల్లో మీడియా కీలక భూమిక పోషించాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికలు - 2024పై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో మీడియా పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు. ఎన్నికల కోడ్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, రానున్న సాధారణ, పార్లమెంట్ ఎన్నికల్లో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల కమీషన్ నియమ నిబంధనలను పాటించేలా మీడియా ప్రధాన భూమిక వహించాలన్నారు. ఎన్నికల్లో జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారికి, మీడియాకు మధ్య సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సన్నద్ధత, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, అప్డేట్స్, జిల్లా జరిగే పలు విషయాలు, ఇతర అంశాలపై సమాచారం అందించాలన్నారు. ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం తెలియజేయడంలో మీడియా ప్రధానంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో మీడియా పాత్రపై అన్ని రకాల అంశాలను తెలియజేయడం కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా పెయిడ్ న్యూస్ కి సంబంధించి ఎన్నికల కమీషన్ నుంచి కొన్ని సూచనలు ఉన్నాయని, ఇందుకోసం ఎంసిఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) ఉంటుందని, నోడల్ అధికారి ఉంటారని, కమిటీ సర్టిఫికేషన్ జరిగిన అనంతరం నిర్ణయించిన డిఐపిఆర్ఓ రేట్స్ కు అనుగుణంగా పెయిడ్ న్యూస్ ప్రచురించాలన్నారు. ఎంసిఎంసికి ఎన్నికల్లో అధికారులకు, నాయకులకు సమాచారం కోసం మీడియా ముఖ్యమైన వారన్నారు. ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో మీడియా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. సోషల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏ చిన్న విషయమైనా ఓటర్లకు వెంటనే చేరువ అవుతుందని, ఎన్నికల్లో ఓటర్లను చైతన్యపరచడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు పారదర్శకంగా స్వేచ్ఛాయిత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఏదైనా వార్తను ప్రచురించే ముందు ఫ్యాక్ట్ చెక్ సరిచూసుకొని ప్రచురించాలని సూచించారు. ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ కాకుండా మీడియా ముఖ్య భూమిక పోషించాలన్నారు. రాజకీయ ప్రకటనలు, సోషల్ మీడియా, బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజ్ లు, సినిమా హాల్లో ప్రకటనలు, ఈ పేపర్లు, రేడియోలలో ముందుగా ఎంసిఎంసి ద్వారా సర్టిఫై అయిన తర్వాతనే ప్రచురించాలన్నారు. ఎన్నికల కమీషన్ గైడ్లైన్స్ ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
ఈ సందర్భంగా ఎంసిఎంసి అండ్ పెయిడ్ న్యూస్, ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ యాడ్స్ ఎక్స్పెన్స్, మీడియా & ఎలెక్షన్స్ పర్సెప్షన్ మేనేజ్మెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీడియా సెల్, సాధారణ నిబంధనలు, కమ్యూనికేషన్ స్ట్రాటజీ, తదితర అన్ని రకాల అంశాలపై హ్యాండ్లూమ్స్ అభివృద్ధి అధికారి బసవరాజు శిక్షణ ఇచ్చారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ గురుస్వామిశెట్టి, డీఆర్డీఏ పిడి నరసింహా రెడ్డి, హార్టికల్చర్ డిడి రఘునాథరెడ్డి, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఆఫీసర్ నాగేశ్వర్ రెడ్డి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Mar 06 2024, 20:42