రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా.. అలం నరసానాయుడు...నియామకం..
శింగనమల నియోజకవర్గం, మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కష్ట పడుతున్న అలం నరసానాయుడు గారిని పార్టీ అధిష్టానం గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించింది. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలం అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 30 సంవత్సరాలు పైగా అలం నరసానాయుడు గారు
టిడిపి
మండల పార్టీ అధ్యక్షుని గా, జిల్లా పార్టీ కార్యదర్శి గా 2 సంవత్సరాలు,జిల్లా పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి గా 2 సంవత్సరాలు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా 4 సంవత్సరాలు ,జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా 4 సంవత్సరాలు, అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా 3 సంవత్సరాలు,రాష్ట్ర కార్యదర్శి గా 8 సంవత్సరాలుగా, శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులుగా 3 సంవత్సరాలుగా కొనసాగుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రస్థాయి పార్టీ పరిశీలకునిగా పార్టీ కోసం నిత్యం శ్రమిస్తున్న విషయాన్ని గుర్తించి అలాగే గత పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం కోసం చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా శ్రమించిన తీరును మరియు నియోజకవర్గంలోని సర్పంచుల ఉప ఎన్నికల్లో కష్టపడిన తీరును గుర్తించి ఇలా ఎన్నో విషయాలను పరిగణములోకి తీసుకొని ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు విషయాన్ని తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు హర్షాని వ్యక్తం చేస్తున్నారు,
అలాగే ఆలం నరసానాయుడు గారు మాట్లాడుతూ నా మీద నమ్మకంతో రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధిగా నియమించినందుకు మరింత బాధ్యతతో పార్టీ అభివృద్ధికి నిత్యం కష్టపడుతూ 2024 సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి ని చేయడమే ధ్యేయంగా పని చేస్తానని అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు గారికి, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కోవెలమూడి నాని గారికి కృతజ్ఞతలు తెలియజేసారు,
Mar 06 2024, 20:39