కలసికట్టుగా పని చేద్దాం.. వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
◆ కలసికట్టుగా పని చేద్దాం.. వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందాం.
◆ సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసి.. విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనది.
◆ కుల, మత పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించాం.
◆ చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది శూన్యం.
◆ ' మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం' లో దిశానిర్దేశం.
◆ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.
● అందరం కలిసి.. శింగనమల సెంటిమెంట్ ను నిలబెడుదాం.
◆ శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు.
◆ పాల్గొన్న పెనుకొండ ఎమ్మెల్యే మరియు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త ఎం. శంకర్ నారాయణ.
వివక్షకు తావులేకుండా దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ, ఎప్పుడు ఎన్నడూ చేయని విధంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించిన జగన్మోహన్ రెడ్డిని, మరో 30 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కలసికట్టుగా పని చేసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందామని సాంబ శివారెడ్డి పిలుపునిచ్చారు.
బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఉన్న ఎస్.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో 'మేము సిద్ధం..మా బూత్ సిద్ధం' కార్యక్రమంలో భాగంగా బూత్ ప్రెసిడెంట్స్ తో సాంబ శివారెడ్డి, శంకర్ నారాయణ, వీరాంజనేయులు సమావేశం నిర్వహించారు.
బూత్ లను ఎలా సిద్ధం చేయాలి, బలోపేతం చేయడానికి విధులు, మరియు బాధ్యతలపై, బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లిన ఏ ఇంటికి వెళ్లి అడిగినా జగనన్న అందించిన సంక్షేమమే కనిపిస్తుందన్నారు. విశ్వసనీయతతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత దేశ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న విశ్వసనీయతతో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసారని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చన్నారు.
2014 లో చంద్రబాబు 650 పేజీలతో మేనిఫెస్టో తెచ్చి అందరిని మోసగించారన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి వారి వర్గానికి మాత్రమే ఆదాయాన్ని సమకూర్చి ప్రజలను మోసం చేశారన్నారు. తప్పుడు వాగ్దానాల వలలో పడోద్దని 2014లో ఏ విధంగా నమ్మించి మోసం చేశాడో, అదేవిధంగా ఈసారి కూడా మోసం చేస్తాడని ప్రతి కుటుంబం సభ్యులకు వివరించాలన్నారు.
చంద్రబాబు నేతృత్వంలోని పెత్తందార్ల కూటమిని నమ్మవద్దని సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను ఎన్నుకోవాలని పిల్లల భవిష్యత్తు కోసం జగనన్నను మాత్రమే నమ్మాలనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కరోనా కష్టకాలంలో జగనన్న ప్రజలకు చేసిన మేలును ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యణ్ రాష్ట్రంలో కనిపించలేదన్నారు.
బూత్ ప్రెసిడెంట్ మరియు బూత్ కోర్ కమిటీ సభ్యులు తమ బూతు పరిధిలోని వాలంటీర్లు మరియు గృహ సారథులతో కలిసి కనీసం 60 శాతం ఓట్లు వైసీపీకి పడేలా వ్యూహాన్ని రూపొందించాలన్నారు. జగనన్న అందించిన సంక్షేమ పథకాల మేలుని మరోసారి లబ్ధిదారులకు గుర్తు చేయాలన్నారు.
2019 లో వైస్సార్సీపీ మేనిఫెస్టో లో అమలుపర్చిన హామీలన్నీ 100 శాతం నెరవేర్చామన్నారు. జగనన్న పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. రానున్న ఎన్నికలకు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవటానికి మనమందరం సిద్ధం అవ్వాలని కోరారు. మరింత సంక్షేమం అభివృద్ధి జరగాలంటే జరగబోయే ఎన్నికలలో జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ ప్రెసిడెంట్స్, బూత్ వైస్ ప్రెసిడెంట్స్, తదితరులు పాల్గొన్నారు.
Mar 06 2024, 20:07