పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
పేదల సొంతింటి కల తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి..
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల తీర్చడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆలూరు సాంబ శివారెడ్డి, శింగనమల వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు అన్నారు.
బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.
జగనన్న రిజిస్ట్రేషన్ చేయించిన ఇంటి స్థలం హక్కు పత్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి వారు లబ్ధిదారులకు అందజేశారు.
సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ పథకం ద్వారా పేదలకు సొంతిళ్లు ఉండాలనే అభిలాషతో ప్రతి పేద కుటుంబానికి ఒకటిన్నర సెంటు భూమిని ఉచితంగా ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించిందన్నారు.
మండల వ్యాప్తంగా సుమారు 1,855 మందికి స్థలాలు ఇవ్వగా, వాటిలో ప్రస్తుతం1,159 మందికి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ హక్కు పత్రాలను అందిస్తున్నామన్నారు. ఈ పత్రాలు శాశ్వత భూహక్కు పత్రాలుగా చెలామణి అవుతాయన్నారు. ఈ హక్కు పత్రాలపై బ్యాంకు రుణాలు పొందవచ్చునని లేదా విక్రయించుకోవచ్చన్నారు. దీనిపై లబ్ధిదారునికి పూర్తి హక్కును కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతుందన్నారు.
పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ మోసం చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు వస్తున్నాడని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే రాబోయే ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామన్నారు. సమన్వయకర్త ఎం. వీరాంజనేయులును మీరందరూ ఆశీర్వదించి మరోసారి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Mar 05 2024, 09:41